Breaking News

చూడటానికి అదొక దేవాలయం..! కానీ కింద చూస్తే..

Published on Sun, 06/01/2025 - 12:34

అదొక పుస్తక నిలయం. లక్షల సంఖ్యలో గ్రంథాలతో కళకళలాడే జ్ఞానభాండాగారం. కాని, అక్కడికి వెళితే, అక్కడ ఒక దేవాలయం మాత్రమే గోచరిస్తుంది. గుడిలోకి ప్రవేశించాక నేలమాళిగలోకి వెళ్లేందుకు భూగర్భమార్గం కనిపిస్తుంది. అలా మెట్ల మార్గంలో కిందికిపోతే, అరుదైన భూగర్భ గ్రంథాలయం ఆశ్చర్యపరుస్తుంది. ఆసియాలోనే అతిపెద్ద భూగర్భ గ్రంథాలయమది. అత్యంత అరుదైన ఈ భూగర్భ గ్రంథాలయం కథా కమామిషు తెలుసుకుందాం...

పదహారడుగుల లోతులో...
రాజస్థాన్‌ రాష్ట్రం జైసల్మేర్‌ జిల్లా భడారియా గ్రామం చుట్టూ ఎడారి వాతావరణం. ఊరిలో భడారియా దేవాలయం ప్రత్యేక ఆకర్షణ కేంద్రం. కారణం ఈ ఆలయం భూ ఉపరితలానికి పదహారడుగుల కింద కొలువైన భూగర్భ గ్రంథాలయం. విశాలమైన వరండాలు, గాజు అలమరాలలో భద్రపరచిన పుస్తకాలు, పెద్దపెద్ద ర్యాకులు, ప్రశాంత వాతావరణం ఈ గ్రంథాలయం ప్రత్యేకతలు. భడారియా గ్రంథాలయాన్ని రెండు విభాగాలుగా వర్గీకరించారు. 

ఒకటి అధ్యయన భవన్, మరొకటి సంగ్రహణ భవన్‌. అధ్యయన భవన్‌లో వందలాది మంది కూర్చుని చదువుకునేందుకు వీలుగా విశాలమైన గదులను నిర్మించారు. సంగ్రహణ భవన్‌లో పలు అరుదైన గ్రంథాలను అందుబాటులో ఉంచారు. వీటికోసం 562 అలమరాలు, 16వేల అడుగుల పొడవులో ర్యాక్స్‌ ఏర్పాటు చేశారు. ఏటా ఈ గ్రంథాలయానికి వచ్చేవారి సంఖ్య లక్షల్లోనే ఉంటుంది ప్రాచీన ప్రతులు, రాష్ట్రపతులు, ప్రధానుల ప్రసంగాలు లభిస్తాయి. 

భడారియా మహారాజు కృషి ఫలితం
భడారియా మహారాజు 1960లో శక్తిపీఠమైన భడారియామాత మందిరాన్ని సందర్శించి. అక్కడే స్థిరపడిపోయారు. ఆయన అసలు పేరు హరివంశ్‌సింగ్‌ నిర్మల్‌. ఇక్కడి వారిని విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఇక్కడ గ్రంథాలయాన్ని నెలకొల్పాలని అనుకున్నారు. 1983లో నిర్మాణానికి సంకల్పించారు. బయట ఎడారి వాతావరణం కాబట్టి పాఠకులకు, సందర్శకులకు ఇబ్బంది లేకుండా దీనిని నేలమాళిగలో నిర్మించారు. 

దీనివల్ల లోపల చల్లని వాతావరణం ఉంటుంది. ఎలాంటి అసౌకర్యానికి గురికారు. మహారాజు పదిహేనేళ్ల కృషికి ఫలితంగా 1998లో ఈ గ్రంథాలయం అందుబాటులోకి వచ్చింది. దీని నిర్మాణం ప్రారంభం నుంచే పుస్తకాల సేకరణ ప్రారంభించారు. అలా ఇప్పటికి తొమ్మిది లక్షల పుస్తకాలను ఇందులో అందుబాటులో ఉంచారు. 

వీటిలో ప్రపంచస్థాయిలోని పలు మత గ్రంథాలు, చారిత్రక, భాషా, న్యాయ శాస్త్రాలకు సంబంధించిన అనేక పుస్తకాలున్నాయి. వీటితోపాటు వినోద, విజ్ఞానాలను పంచే పుస్తకాలనూ ఉంచారు. ఇక్కడికి వచ్చే పరిశోధకులు, విజ్ఞానార్థులు వేరేచోట అన్వేషించాల్సిన అవసరం లేకుండా సకల గ్రంథాలూ లభించేలా సమకూర్చారు. 

విశాలమైన భోజనశాలలు
పలు అంశాలపై అధ్యయనం చేయడానికి వచ్చే వారికోసం పద్దెనిమిది గదులు నిర్మించారు. అలాగే విశాలమైన భోజనశాలలు ఏర్పాటు చేశారు. ఎడారి ప్రాంతమైనా, ఈ గ్రంథాలయంలో ఎక్కడా వేడి వాతావరణం కనిపించదు. పాలరాతి గోడలతో చుట్టూ చల్లటి వాతావరణం ఉండేలా దీనిని నిర్మించారు. 

ఇక్కడికి దేశంలోని ప్రధాన నగరాల నుంచే కాదు, యూరోప్‌ నుంచి వచ్చే పర్యాటకుల తాకిడి కూడా అధికంగా ఉంటుందని గ్రంథాలయ నిర్వాహకులు చెబుతున్నారు. ఆసియాలోనే అతిపెద్దదిఆసియాలో పేరున్న భూగర్భ గ్రంథాలయాల రెండే ఉన్నాయి. వాటిలో దక్షిణ కొరియా రాజధాని సియోల్‌ లోని స్టార్‌ ఫీల్డ్‌ లైబ్రరీ ఒకటి కాగా రెండోది మన భడారియా గ్రంథాలయం. ఈ రెండిటిలో భడారీయా పుస్తక నిలయమే పెద్దది కావడం విశేషం. 

తిరుమలరావు కరుకోల

(చదవండి: Mayanmar Began: ఆకాశం నుంచి ఆలయ దర్శనం..!)
 

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)