Breaking News

సమాజ హితం కోసం.. సకినీ ఫౌండేషన్‌

Published on Tue, 03/04/2025 - 11:02

సమాజ హితం కోసం తాను ఏదో చేయాలనుకున్నాడు.. అనుకున్నదే తడవుగా.. తనకు తోచిన మేరకు పేద విద్యార్థుల చదువుకు ఆర్థిక సాహాయం చేస్తున్నాడు. అంతటితో ఆగకుండా ఆపదలో ఉన్న పలువురు బస్తీ వాసులకు ఆపద్భాంధవుడిగా నిలుస్తున్నాడు. మురికి వాడల్లో నివసించే పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాడు. ఓ వైపు రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటూనే సమాజ సేవలోనూ ముందు వరుసలో 
ఉంటున్నాడు..  – గోల్కొండ 

 

నగరంలో అది పెద్ద లేబర్‌ అడ్డాల్లో టోలిచౌకీ లేబర్‌ అడ్డా ఒకటి. పొరుగు రాష్ట్రాల నుంచే కాకుండా నగర పరిసరాల నుంచి ఎందరో నిరుపేదలు ఉపాధి కోసం స్థానిక లేబర్‌ అడ్డాలకు వస్తుంటారు. పని దొరకక వారిలో అనేక మంది రోజుల తరబడి పస్తులు ఉంటుంటారు. ఇది గమనించిన ఆసిఫ్‌ హుసేన్స్‌న్‌ సోహెల్‌ సూర్యనగర్‌ కాలనీలో మాషా అల్లా పేరిట కిచెన్‌ ఏర్పాటు చేశాడు. దీని ద్వారా నిత్యం 250 మందికి మధ్యాహ్న సమయంలో భోజనం అందిస్తున్నాడు. 

వలస కూలీలకు అండగా.. 
ఆసిఫ్‌హుస్సేన్‌ సోహెల్‌ సేవలపై ప్రశంసలునగరంలో గోల్కొండకు చెందిన ఆసిఫ్‌హుస్సేన్‌ సోహెల్‌ సమాజంలో మార్పు కోసం తన వంతు కృషి చేస్తున్నాడు. మురికివాడల్లో చదువుకు నోచుకోని నిరుపేద విద్యార్థులకు ఉచితంగా విద్యను అందిస్తున్నాడు. చదువు మధ్యలో ఆపేసిన వారిని గుర్తించి వారికి అవగాహన కల్పించి, పై చదువులకు ప్రైవేటు పాఠశాలల్లో చేరి్పంచడం వంటి కార్యక్రమాలు చేస్తున్నాడు. దీంతో పాటు ఆయా మురికి వాడల్లోని మహిళల సాధికారత కోసం సకీనా ఫౌండేషన్‌ ద్వారా సలహాలు, సూచనలు ఇస్తూ.. వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతున్నాడు. మహిళలకు ఉచితంగా వివిధ ఉపాధి పథకాల్లో శిక్షణ ఇప్పిస్తున్నాడు. పేదల బస్తీలైన విరాట్‌నగర్‌ వంటి ప్రాంతాల్లో ఫ్యాషన్‌ డిజైనింగ్, ఫస్ట్‌ ఎయిడ్, జిగ్‌జాగ్, ఫ్యాబ్రిక్‌ పెయింటింగ్‌ వంటి అంశాల్లో శిక్షణ ఇప్పిస్తున్నాడు. విజయవంతంగా శిక్షణ పూర్తి  చేసుకున్న వారికి బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి మహిళలు తమ కాళ్లపై తాము నిలబడేలా, వారి ఆర్థిక స్థితికి తోడ్పడుతూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నాడు.  

కరోనా సమయంలో.. 
కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో వలస కూలీలకు తాను అండగా ఉన్నానంటూ నిత్యావసరాలు అందించడంతో పాటు వలస కూలీలు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు ఉచిత రవాణా కలి్పంచాడు. టోలిచౌకీ ముంపు కాలనీగా పేరుగాంచిన నదీమ్‌ కాలనీలో వరదల సమయంలో బోట్లతో రంగంలోకి దిగి ఎందరినో సురక్షిత ప్రాంతాలకు తరలించాడు. వీటన్నింటికీ తోడుగా ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తూ బస్తీలో రోగులకు వారి ఇంటి ముందే మందులు అందిస్తున్నారు. మున్ముందు కూడా సకీనా ఫౌండేషన్‌ ద్వారా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని సోహెల్‌ చెబుతున్నారు. 

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)