Breaking News

శిక్షణే వినూత్న లక్షణం..! వేసవి సెలవులను ఉపయోగించుకోండిలా..!

Published on Fri, 04/11/2025 - 10:47

విద్యార్థుల చదువులు, యువత కాలేజీల పోటీ వాతావరణానికి, ఒత్తిడికి వేసవి ఒక విరామం, వినోదం. అయితే హైదరాబాద్‌ నగరం వేసవి సెలవుల్లో విద్యార్థులు, యువతకు వివిధ రంగాల్లో నైపుణ్యం పెంపొందించుకునేందుకు అనేక సమ్మర్‌ క్యాంపులకు వేదికగా మారింది. ఇందులో భాగంగా సాంకేతిక పరిజ్ఞానం నుంచి సృజనాత్మక రంగాల వరకూ, శారీరక దృఢత్వం నుంచి వ్యక్తిత్వ వికాసం వరకూ విస్తరించి ఉన్న ఈ క్యాంపులు, విద్యా జీవితానికి వెలకట్టలేని అనుభవాలను అందిస్తున్నాయి. ఈ రెండు నెలల కాలాన్ని ఇంటి పట్టునే ఉండి వృథా చేయకుండా ఇటు విజ్ఞానం, అటు వినోదం సమ్మిళితంగా ఈ వేసవి శిబిరాలు ఏర్పాటు చేస్తుండటం విశేషం.   

ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఎప్పటికప్పుడు మారుతున్న అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకోవడానికి టెక్నికల్‌ స్కిల్స్‌ నేర్చుకోడానికి ఈ తరం ఎక్కువ ఆసక్తి చూపిస్తోందనేది నిపుణుల మాట. ఇందులో భాగంగా వైట్‌ హాట్‌ జేఆర్, కోడింగ్‌ నింజాస్, హ్యాకర్‌ కిడ్, ఎస్‌పీ రోబోటిక్స్‌ మేకర్‌ ల్యాబ్‌ వంటి సంస్థలు ప్రాథమిక స్థాయి నుంచి అడ్వాన్డ్స్‌ లెవెల్‌ వరకూ కోడింగ్, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్‌ వంటి రంగాల్లో శిక్షణ అందిస్తున్నాయి. 

స్పెషల్‌ ఇంటర్న్‌షిప్‌ మాడ్యూల్స్‌ సహా ప్రాజెక్టు ఆధారిత శిక్షణ ద్వారా విద్యార్థులకు రియల్‌–వరల్డ్‌ పరిజ్ఞానం అందిస్తోంది. మాదాపూర్, గచ్చిబౌలి వంటి ప్రాంతాల్లో ఈ సంస్థల శిక్షణా కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. 

ఈ తరం కళాత్మకం వైపే.. 
విద్య, వృత్తి పరమైన నైపుణ్యాలు ఎన్ని ఉన్నా ఏదో ఒక కళలో ప్రావీణ్యముండటం ఈ తరంలో సెలబ్రిటీ హోదాగా మారింది. ముఖ్యంగా సోషల్‌ మీడియా వైరల్స్‌ పుణ్యమా అని వినూత్న వ్యక్తిత్వానికి కళలు ఒక ప్రామాణికంగా మారాయి. ఈ నేపథ్యంలో ముఖ్యంగా నగరవాసుల దృష్టి కళల వైపు మళ్లిందనే చెప్పాలి. 

నగరంలోని రవీంద్ర భారతి అకాడమీ, శిల్పా రామం ఆర్ట్‌ క్యాంప్, కల్పతరు వంటి విభిన్న కళా వేదికలు, సంస్థలు.. పెయింటింగ్, సంగీతం, నృత్యం, థియేటర్‌ ఆర్ట్స్‌ వంటి రంగాల్లో వేసవి శిబిరాలను నిర్వహిస్తున్నాయి. ముఖ్యంగా శిల్పారామం ప్రాంగణంలో నిర్వహించే కళాకారుల వర్క్‌షాపులు, విద్యార్థులకు దేశీయ కళల పట్ల అవగాహన పెంపొందించడంలో మైలురాయిగా నిలుస్తున్నాయి. 

ఫిట్‌ అండ్‌ స్పోర్ట్స్‌.. 
నగర వాసుల సక్సెస్‌ మంత్ర ఏదైనా ఉందంటే.. అది ఆరోగ్యం, ఫిట్నెస్‌ అని ఠక్కున చెప్పేస్తారు. ఆరోగ్య శిక్షణ, క్రీడలు, ఫిట్నెస్‌ రంగాలకు నగరంలో మంచి డిమాండ్, ఆదరణ ఉంది. అంతే కాకుండా ఈ రంగాల్లోని శిక్షణా అంశాలపై హైదరాబాద్‌ వేదికగా అంతర్జాతీయ స్థాయి కేంద్రాలు ఉండటం విశేషం. డెకథ్లాన్‌ అకాడమీ, పుల్లెల గోపీచంద్‌ బ్యాడ్మింటన్‌ అకాడమీ, ఫిట్‌ కిడ్స్‌ హైదరాబాద్‌ వంటి సంస్థలు స్విమ్మింగ్, యోగా, మార్షల్‌ ఆర్ట్స్, స్పోర్ట్స్‌ ట్రైనింగ్‌ వంటి అంశాల్లో శిక్షణ ఇస్తున్నాయి. 

ఈ శిక్షణల ద్వారా విద్యార్థుల్లో ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా, క్రమశిక్షణ, టీం వర్క్, ఫోకస్‌ వంటి విలువలు పెంపొందుతున్నాయి. అంతేకాకుండా కేవలం చదువులు మాత్రమే కాదు.. క్రీడలతోనూ అంతర్జాతీయ గుర్తింపు, ఉన్నత స్థాయి జీవితానికి నాంది పలకవచ్చని చెప్పడానికి పలువురు నగర క్రీడాకారులే నిదర్శనం. 

చేయూతనిస్తే అద్భుతాలే.. 
సమ్మర్‌ క్యాంపుల ద్వారా విద్యార్థులు, యువత కొత్త ప్రపంచాన్ని అన్వేíÙంచే అవకాశం పొందుతున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల్లోని ఆసక్తులను గుర్తించి, అనుగుణమైన శిక్షణలకు ప్రోత్సహించగలిగితే, వారు భవిష్యత్తులో విశ్వాసంతో ముందుకు సాగుతారని నిర్వాహకులు, నిపుణులు సూచిస్తున్నారు.  

వ్యక్తిత్వ వికాసానికీ పెద్దపీట.. 
అదనపు నైపుణ్యాలను కోరుకునే నగర వాసులు ఎవరైనా సరే.. వ్యక్తిత్వ వికాస శిక్షణలో ప్రవేశించడానికే మొగ్గు చూపుతున్నారు. వీరి ఆసక్తికి అనుగుణంగా ది పర్సనాలిటీ స్కూల్, టైమ్‌ కిడ్స్, ఉద్భవ్‌ అకాడమీ వంటి ప్రత్యేక సంస్థలు కమ్యూనికేషన్‌ స్కిల్స్, పబ్లిక్‌ స్పీకింగ్, లీడర్‌షిప్‌ డెవలప్‌మెంట్‌ వంటి అంశాల్లో శిక్షణ ఇస్తున్నాయి. 

ఇవి విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచడంలో, యువత భవిష్యత్తుకు మార్గం చూపడంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. ప్రధానంగా ఉద్యోగాలను పొందడంలోనూ, ఉపాధి రంగాల్లో రాణించడంలోనూ ఈ వ్యక్తిత్వ వికాస శిక్షణ ఎంతో ఆత్మ విశ్వాసాన్ని, స్థైర్యాన్ని పెంపొందిస్తుందని వ్యక్తిత్వ వికాస నిపుణులు చెబుతున్న మాట.  

(చదవండి: సమ్మర్‌లో కాటన్‌ డ్రెస్‌లతో స్టైలిష్‌గా ఉండొచ్చు ఇలా..!)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)