Breaking News

కాఫీ, టీలకు బ్రేక్‌: ఇలా ట్రై చేద్దామా..!

Published on Mon, 06/03/2024 - 15:53

ఉదయం లేవగానే ఓ కప్పు వేడి వేడి కాఫీగానీ, టీగానీ పడకపోతే కాలకృత్యాల దగ్గర్నించి ఏ పని కాదు  చాలామందికి. ఖాళీ కడుపుతో  ఇలాంటి వాటివల్ల దీర్ఘకాలంలో  ఆరోగ్యానికి చాలా హాని చేస్తాయి. నిజానికి ఉదయం బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలి.  తద్వారా రోజు చురుకుగా ఉండటానికికావాల్సిన పోషకాలు అందుతాయి. మరి అవేంటో ఒకసారి చూద్దాం.

కాఫీ, టీ అయినా అదొక సెంటిమెంట్‌లాగా మనకి అలవాటు అయిపోయింది. కానీ మంచి ఆరోగ్యం కోసం మంచి డైట్‌ ,కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లను చేసుకోవాలి.

టీ లేదా కాఫీ ఉదయం పూట టీ, కాఫీలు అలవాటు మానలేని వారు చక్కెరను బాగా తగ్గించేస్తే బెటర్‌. మధుమేహ వ్యాధిగ్రస్తులు పూర్తిగా మానేయాలి.

 తాజా పండ్లను, పళ్లతో చేసిన రసాన్ని తీసుకోవచ్చు. క్యారెట్‌, కీరా, యాపిల్‌, బీట్‌రూట్‌ లాంటివాటితో జ్యూస్‌ చేసుకోవచ్చు. అయితే ప్యాకేజ్డ్ ఫ్రూట్ జ్యూస్  జోలికి వెళ్లవద్దు. వీటిల్లో  ఫైబర్‌ ఉండదు,పైగా  అధిక మొత్తంలో చక్కెర ఉంటుంది. 

జింజర్‌ టీ, హెర్బల్‌ టీ

  • పొద్దున్నే గోరు వెచ్చని నీళ్లు తాగాలి. అలాగే గోరు వెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం, తేనె కూడా కలుపు కోవచ్చు. ఇందులోని విటమిన్‌ సీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

  • అల్లం, తులసి,  పుదీనా ఆకులు, తేనెతో చేసిన హెర్బల్‌. జింజర్‌ టీతాగవచ్చు. 

  • కొబ్బరి నీళ్లు: కొబ్బరి నీళ్లలో అవసరమైన పోషకాలు, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, సోడియం, ఫాస్పరస్ వంటి ఖనిజాలు లభిస్తాయి., అలాగే ఫ్రీ-రాడికల్‌తో పోరాడే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. షుగర్ లెవల్స్‌ను   బట్టి  దీన్ని తీసుకోవాల్సి ఉంటుంది.

కాఫీ, టీలు రోజులో రెండుసార్లు తీసుకోవడం పెద్ద ప్రమాదం ఏమీకాదు. అయితే ఖాళీ కడుపుతో కాకుండా అల్పాహారం తరువాత తీసుకుంటే మంచిది. అలాగే  షుగర్‌ వ్యాధిగ్రస్తులు  చక్కెర వాడకంలో జాగ్రత్త పడాలి. 


తాగకూడనివి

  • సోడా, కార్బోనేటేడ్ పానీయాలు వీటిల్లో అధిక మొత్తంలో చక్కెర, కెఫిన్ కలిసి ఉంటాయి. ఇంకా వీటిలో ఉండే కార్బన్ డయాక్సైడ్ కడుపులో గ్యాస్, ఉబ్బరం సమస్యలను కలిగిస్తుంది. 
  • ఎనర్జీ డ్రింక్స్‌లో అధిక మొత్తంలో కెఫిన్, షుగర్ ఉంటాయి. ఉదయాన్నే వీటిని తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరుగుతాయి. దీని కారణంగా రోజంతా శక్తి లేకపోవడం అలసటగా అనిపిస్తుంది. ఇది కాకుండా ఎనర్జీ డ్రింక్స్   గుండె వేగాన్ని,  రక్తపోటును పెంచుతాయనేది గమనించాలి. 

Videos

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు