Breaking News

వర్కౌట్‌లతో సమంత..ఉదయానికి మించిన బెస్ట్‌ టైమ్‌ లేదు!

Published on Thu, 02/22/2024 - 13:04

టాలీవుడ్‌ నటి సమంత రూత్‌ ప్రభు ఎప్పటికప్పుడూ తన విషయాలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తుంటారు. అలానే ఈసారి తన వర్క్‌ఔట్‌లకు సంబంధించిన పోటోలను షేర్‌ చేశారు. అంతేగాదు దానికి 'ఎప్పటికీ ఉదయపు సూర్యుడినే కోరుకుంటారు' అనే క్యాప్షన్‌ని జోడించి మరీ పోస్ట్‌ చేశారు. పైగా వేకువజాముకి మించిన మంచి సమయం మరోకటి లేదు అని ఆ పోస్ట్‌లో రాసుకొచ్చింది సమంత. ఆ ఫోటోలకు ప్రతిస్పందనగా ప్రముఖ సెలబ్రెటీలు, అభిమానుల కామెంట్లోతో పోస్ట్‌లు వెల్లువలా వచ్చాయి. సమంత ఉదయపు సూర్యుడి కోసం వెతుకుతున్నట్లుగా ఉంది ఆ ఫోజ్‌ అంటూ ఉదయిస్తున్న సూర్యుడి ఎమోజీలతో పోస్ట్‌లు పెట్టారు.

ఇక ఫిల్మ్‌ మేకర్‌ నందిని రెడ్డి చమత్కారంగా ఇప్పుడే రెండుసార్లు వర్క్‌ఔట్‌లు చేశా! అంటూ సన్‌గ్లాసెస్‌ ఎమోజీలతో పోస్టులు పెట్టారు. అలగే మృణాల్‌ ఠాకూర్‌ ఆమె వయసు జస్ట్‌ 23 అన్నట్లు ఉంది అంటూ హార్ట్‌ సింబర్‌ ఎమోజీని పెట్టింది. ఇక సమంత 2022లో మైయోసిటిస్‌ అని పిలిచే ఆటో ఇమ్యూన్‌ పరిస్థితితో బాధపడిన సంగతి తెలిసిందే. అందుకోసం నటనకు కొంతకాలం విరామం కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆమె ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడమే గాక తనలా ఎవ్వరూ అలాంటి స్థితిని ఎదుర్కొనకూడదని 'టేక్‌ 20' అనే హెల్త్‌ పాడ్‌ కాస్ట్‌కి సంబంధించిన ఓ యూట్యూబ్‌ ఛానెల్‌ని కూడా ఇటీవల ప్రారంభించింది. ఇందులో ప్రముఖ ఆరోగ్య నిపుణుడి సలహాలతో విలువైన సమాచారం అందిస్తామని ఆ ఛానెల్‌ టీజర్‌ని రీలీజ్‌కి సంబంధించిన వీడియోని షేర్‌ చేస్తూ వెల్లడించారు.

ఈ సమస్య రావడానికి ముందు సంవత్సరం చాలా కష్టంగా గడిచింది. చివరికి కోలుకుని ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నా. హాయిగా ఊపిరి పీల్చుకోగులుగుతున్నా అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తాను నటనపై దృష్టి పెడుతున్నానని, షూటింగ్‌లలో పాల్గొననున్నట్టు తెలిపింది. ఇక ఈ పోడోకాస్ట్‌ని తనలా ఎవ్వరూ ఇలాంటి వ్యాధుల బారిన పడకుండా సురక్షితంగా ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించినట్లు తెలిపింది. ప్రస్తుతం ఉన్న కాలుష్య ప్రపంచంలో మనల్ని మనం సేఫ్‌గా ఉంచుకునేలా ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిది, ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు అనే వాటి గురించి ప్రముఖ నిపుణులతో మాట్లాడి అత్యంత విలువైన సమాచారం ఇవ్వనున్నట్లు వెల్లడించి సమంత. 

ఎర్లిమార్నింగ్‌ వర్క్‌ఔట్‌లు చేస్తే..
సెలబ్రెటీలు, కామన్‌పీపుల్స్‌.. ఎవ్వరైనా సరే ఉదయమే చేసే వర్క్‌ఔట్‌లు ఎప్పటికీ మనలో నూతన ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని అందిస్తాయి. ఉదయమే చేసే వర్క్‌ ఔట్‌లతో దేహం చురుకుగా ఉంటుంది. ఎలాంటి రుగ్మతలు ఉన్నా తగ్గడం లేదా అదుపులో ఉండే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. మన ముఖంలో కూడా ఏదో తెలియని వెలుగు కనిపిస్తుంది. ఇలా అందరూ తాము చేయగలిగనన్ని వర్క్‌ఔట్‌లు చేసి ఆరోగ్యంగా ఉండండి. అంతేకాదండోయ్‌ ఇలా చేస్తే మన జీవితం కూడా ఉదయపు సూర్యుడిలా ప్రకాశవంతంగా సాగిపోతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

(చదవండి: టోపీ, హెల్మెట్లు వల్ల బట్టతల వస్తోందా? నిపుణులు ఏమంటున్నారంటే..)

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)