Breaking News

చిన్న ప్రయత్నమే..కానీ ఎఫెక్ట్‌ ఎవరెస్టు రేంజ్‌..!

Published on Thu, 10/09/2025 - 16:06

ప్రజలకు అవగాహన కల్పించేలా చేయడం అంటే మాటల్లో చెప్పినంత ఈజీ కాదు. కార్యరంగంలోకి దిగాక తెలుస్తుంది అసలైన సమస్య. కానీ ఈ మహిళ అవేమి పట్టించుకోకుండా స్వచ్ఛందంగా పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్న తీరు ప్రతి ఒక్కర్నీ కదిలిస్తోంది. పైగా రెండు భాషల్లో వారికర్థమయ్యేలా చెబుతున్న తీరుకి హ్యాట్సాఫ్‌ అనాల్సిందే. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. 

ఆ వీడియోలో ఒక మహిళ స్వచ్ఛందంగా పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తోంది. అందుకోసం సిటీ బస్సు ఎ‍క్కి మరీ వీధుల్లో చెత్త వేయొద్దంటూ ప్రయాణికులను కోరడమే గాక..ఇలా అందరూ సమిష్టిగా చేస్తే..దాని ప్రభావం దేనికి దారితీస్తుందో నొక్కి చెప్పింది. ఈ ఘటన బెంగళూరు సిటీ బస్సులో చోటుచేసుకుంది. 

ఆమె కన్నడ, హిందీ భాషలలో ప్రజలకు తన సందేశాన్ని వినిపించడం విశేషం. అంతేగాదు ప్రయాణికులు టిక్కెట్ల, గుట్కా ప్యాకెట్లు రోడ్లపై వేయొద్దని అభ్యర్థిస్తూ అవగాహన కల్పించింది. "మార్పు మన నుంచి మొదలవ్వాలి.. మీ చెత్తను ఇంటికి తీసుకువెళ్లండి.. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుందాం." అని పిలుపునిస్తున్న తీరు అక్కడున్నవారందర్నీ బాగా ఆకర్షించింది. ఎవరేం అనుకున్నా పర్లేదు..మార్పు ఒక్కటే ముఖ్యం అంటూ వాలంటీర్‌గా ముందుకువచ్చి ఇలా బహిరంగంగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్న తీరు ప్రతి ఒక్కరిని ప్రభావితం చేస్తుంది. 

కచ్చితంగా ఇది ఎవరెస్టు రేంజ్‌కి మార్పుకి నాంది పలికి తీరుతుంది అంటూ పలువురు నెటిజన్లు ఆమెను అభినందిస్తూ పోస్టులు కూడా పెట్టారు. అంతేగాదు ప్రయత్నం చూడటానికి సాదాసీదాగా కనిపించొచ్చు..మార్పు సంతరించుకున్నప్పడూ కచ్చితంగా దాని విలువ తప్పక తెలుస్తుంది కదూ..!.

 

(చదవండి: హిమాలయన్ ఆంటీ'..ఆమె శిఖరాగ్ర శక్తికి సాటిలేదు!)

 

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)