Breaking News

పనిమనిషి జీతం రూ. 45 వేలు : అంత అవసరమా, నెట్టింట చర్చ!

Published on Sat, 10/18/2025 - 18:42

సిలికాన్ సిటీ, ఐటీ సిటీ బెంగళూరు (Bengaluru) ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటి. గార్డెన్ సిటీ బెంగళూరులో జీవితం అంటే చాలా ఖరీదైనదే. అలాంటిది బెంగళూరులో కుటుంబంతో నివసిస్తున్న ఒక రష్యన్ మహిళ తన ఇంటి సహాయకురాలికి నెలకు రూ.45,000 కంటే ఎక్కువ చెల్లించడం చర్చకు దారితీసింది.

తాజాగా రష్యాకు చెందిన ఒక కంటెంట్ క్రియేటర్ యులియా అస్లమోవా బెంగళూరు లైఫ్ గురించి పంచుకున్న వీడియో ఇప్పుడు నెట్టింట సందడి చేస్తోంది. తన బిడ్డను చూసుకునేందుకు నియమించుకున్న పనిమనిషికి నెలకు రూ. 45,000 చెల్లిస్తానని వెల్లడించింది. అంతేకాదు ఇంటి పనిని కూడా "వృత్తిపరంగా" చూస్తానని,  ఏదేని కార్పొరేట్ ఉద్యోగం లాగే ప్రోత్సాహకాలను అందిస్తానని అస్లమోవా చెప్పారు.

 

ఇంకా ఇంటి అద్దెకు 1.25 లక్షల రూపాయలు, తన పిల్లల స్కూల్ ఫీజు కోసం రూ.30వేలు, ఆహారంతో సహా ఇంటి ఖర్చుల కోసం  రూ.75,000 రూపాయలు ఖర్చు చేస్తున్నట్లుగా కూడా ఈ మహిళ  వెల్లడించింది. పనిమిషికి  45 వేలు ఇవ్వడం అంటే తనను "పిచ్చిదానిని" అని అనుకోవచ్చు.  కానీ ఆమె విధేయత, వృత్తి నైపుణ్యం కారణంగా ఆమె ఈ  ప్రతిఫలానికి అర్హురాలని తాను భావించినట్లు తెలిపింది. తన కుమార్తె ఎలినా కోసం నానీని నియమించుకునే ముందు కనీసం 20 మంది అభ్యర్థులను ఇంటర్వ్యూ చేశానని ఆమె చెప్పారు. 

దీనిపై నెటిజన్లు స్పందించారు. బెంగళూరు సహా భారతదేశంలోని నలుమూలల నుండి ప్రజలు స్పందించారు. కొందరు ఆమెను ప్రశంసించగా మరికొందరు విమర్శించారు. మీరు ఎక్కువ చెల్లిస్తున్నారనీ, ఇంతకంటే తక్కువకు ఫ్లాట్‌లు దొరుకుతాయని కమెంట్‌ చేశారు. మరొక వినియోగదారు “అది TCS, ఇన్ఫోసిస్ ,యాక్సెంచర్ టెక్ ఫ్రెషర్లకు చెల్లించే దానికంటే ఎక్కువ.” అని పేర్కొన్నారు.

అయితే విమర్శలపై  స్పందిస్తూ అస్లమోవా తన వైఖరికి కట్టుబడి ఉండటం విశేషం.  "మీరు ఇతరులతో చెడుగా ప్రవర్తిస్తే, కర్మ మీకు ఫలితం ఇస్తుంది" అని  కౌంటర్‌ ఇవ్వడం గమనార్హం. అలాగే వ్యక్తిగత లేదా వృత్తిపరమైన వృద్ధికి బదులుగా ఇంటి పనికి రోజుకు చాలా గంటలు కేటాయించేవారు విలువైన అవకాశాలను కోల్పోతున్నారని చెబుతూ, వారు తమ సమయాన్ని ఎలా గడుపుతున్నారో  ఒక్కసారి పునరాలోచించుకోవాలని కోరారు.
 

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)