Breaking News

ఐటీ ఉద్యోగం వదలి ఆటో డ్రైవర్‌గా మహిళా టెకీ..!

Published on Tue, 09/29/2026 - 14:23

ఒక మహిళా టెకీ యువత ఎంతో ఇష్టపడే డ్రీమ్‌ జాబ్‌ అయిన ఐటీ ఉద్యోగాన్ని వద్దనుకుని మరి రాపిడో ఆటో నడుపుతోంది. కార్పొరేట్‌ ఉద్యోగాన్నే ఇష్టపడే ఈ రోజుల్లో ఆమె ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడమే కాదు..ఇష్టపడితే ఏ పని చిన్నది కాదని అంటోంది. పైగా ఆటో డ్రైవర్‌గానే ఎక్కువ సంపాదిస్తున్నా అని చెబుతుండటం విశేషం. 

ఆ మహిళే బెంగళూరుకి చెందిన మాజీ ఐటీ ఉద్యోగిని. తన తండ్రి మరణంతోటే తాను కార్పొరేట్‌ ఉద్యోగాన్ని వదిలేసినట్లు తెలిపింది. నైట్‌షిప్టులు చేస్తూనే తన తల్లికి అండగా ఉండటం కష్టంగా ఉండటంతోనే ఇలా చేసినట్లు తెలిపింది. పైగా ఆటో డ్రైవర్‌గా సమయంపై నియంత్రణ తోపాటు ఇంటికి దగ్గరగా ఉండేలా చూసుకోగలుగుతున్నట్లు వెల్లడించింది. ఇలా ఆటో డ్రైవర్‌గా మారాలనే ఆలోచనను తన కుటుంబం తీవ్రంగా వ్యతిరేకించిందని, అలాగే ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అంత సులభమేమి కాదని పేర్కొంది. 

అయితే ఆమె తన పరిస్థితులు దృష్ట్యా కుటుంబానికి ఏది ఉత్తమమో దానికే ప్రాధాన్యత ఇవ్వడం విశేషం. పైగా ఆమె ఆటోడ్రైవర్‌గానే ఎక్కువ సంపాదిస్తున్నట్లు తెలిపింది. కంటెంట్‌ క్రియేటర్‌ తన్వి సదరు మహిళతో సంభాషిస్తున్న వీడియోని నెట్టింట పంచుకోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అంతేగాదు ఆ మాజీ టెకీ అనర్గళంగా ఇంగ్లీష్‌ మాట్లాడే వ్యక్తి ఆటో నడుపుతుండటం ఏంటని కస్టమర్లు తనను చూసి విస్తుపోతుంటారని నవ్వుతూ చెబుతోంది. 

"ఆమె ప్రజలు ఏమనుకుంటారు? అనే దాని గురించి పట్టించుకోకుండా స్వేచ్ఛను ఎంచుకుంది. తన జీవిత బాధ్యతను తానే తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. అంతేగాదు తన జీవితానికి సమాజం అనుమతి అవసరం లేదని నిర్ణయించుకున్న బెంగళూరు అమ్మాయి. పైగా మహిళలు స్వయంగా వాహనం నడపడం (స్టీరింగ్ చేతిలోకి తీసుకోవడం) మాకు చాలా ఇష్టం. ఎందుకంటే ధైర్యంగా ఉండటం అంటే ఎప్పుడూ ఏదో అసాధారణమైన పని చేయడం మాత్రమే కాదు. 

కొన్నిసార్లు, 'నాకు ఇదే కావాలి, దీన్నే నేను ఎంచుకుంటున్నాను' అని చెప్పే ధైర్యం కలిగి ఉండటమే నిజమైన ధైర్యం." అని కంటెంట్‌ క్రియేటర్‌ తన్వి ఆ మాజీ టెకీపై ప్రశంసల జల్లు  కురిపిస్తూ పోస్ట్‌లో రాసుకొచ్చింది. నెటిజన్లు సైతం ఆమెను చూస్తే గర్వంగా ఉంది. అలాగే తల్లిని రాత్రిపూట ఒంటరిగా వదిలిపెట్టకూడదన్న ఆమె ఆలోచన నిజంగా అభినందనీయం అని ప్రశంసిస్తూ పొస్టులు పెట్టారు. 

 

ఇదీ చదవండి: మరీ ఏడు నెలల గర్భంతోనా.. రిస్క్‌ కాదా?)
 

Videos

Konda Surekha: వాళ్లని చిత్తు చిత్తుగా కొడతా..

TDP నేతల కంటే ఎక్కువ తిరుగుతున్నాడు మజ్జి శ్రీనుకు ఇచ్చిపడేసిన పేర్ని కిట్టు

పడిపోతున్న బంగారం ధరలు కొనాలా? వద్దా?

ఇప్పటికీ నా భార్య తిడతా ఉంది.. పేర్ని నాని నాన్ స్టాప్ సెటైర్లు

నిరసన చేస్తున్న లాయర్లను ఈడ్చిపడేసిన పోలీసులు

నాని మేడారం మొక్కులు

నీకు ఎన్ని బూతులు వచ్చో నాకు అంతకంటే ఎక్కువే వచ్చు.. నాని స్వీట్ వార్నింగ్

ఎవరా పోలీసులు.. గుర్తించండి..! మహినికలి MLAల ఘుటనపై హైకోర్టు సీరియస్

CHATGPTతో తిరుమల రూమ్ బుకింగ్... పేమెంట్ దశ వరకు వెళ్లి..!

గుంటూరులో ఘోర విషాదం.. కారులో మంటలు చెలరేగి వ్యక్తి సజీవ దహనం

Photos

+5

YS జగన్‌ కోసం కదిలిన ఒంగోలు.. పోటెత్తిన అభిమానులు! (ఫొటోలు)

+5

మిస్‌ ఎర్త్‌ వాటర్‌ ఇండియాగా ఆదిలాబాద్ యువ‌తి (ఫొటోలు)

+5

‘తత్వం’ సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)

+5

మేడారం వనదేవతల సన్నిధిలో నాని (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటుడు నవీన్ చంద్ర (ఫొటోలు)

+5

ఫేమస్ దేవాలయాలన్నీ తిరిగేస్తున్న 'జైలర్' భామ (ఫొటోలు)

+5

హ్యాపీ బర్త్ డే క్యూటీ.. భర్తకు ఆలియా భట్ లవ్‌లీ విషెస్ (ఫొటోలు)

+5

ప్రెగ్నెన్సీతోనూ జిమ్, గేమ్.. సమంత లేటెస్ట్ (ఫొటోలు)

+5

పెళ్లి వేడుక కోసం ముస్తాబైన హీరోయిన్ కళ్యాణి (ఫొటోలు)

+5

పూలతోటలో అనుపమ పరమేశ్వరన్ చిల్.. ఫోటోలు