Breaking News

బొట్టు కూడా ఒక డిజైనర్‌ ఆభరణం : ఆదాయం 20 లక్షలు

Published on Thu, 10/16/2025 - 17:11

భారతీయ మహిళామణులకు  బొట్టు అంటే ప్రాణం.అందం, సంప్రదాయాల మేళవింపు అది.  పండగ అయినా,  పెళ్లిఅయినా, ఏ వేడుక అయినా అదొక ఫ్యాషన్‌. అందుకే కాలక్రమేణా బొట్టు లేదా బిందీ రూపాలు మారుతూ వచ్చాయి.ఈ మార్పునే ఆకళింపు చేసుకున్నారు బెంగళూరుకు చెందిన వ్యవస్థాపకురాలు మేఘనా ఖన్నా. రోజువారీ జీవితంలో భాగమైన బొట్టు బిళ్లలను ఫ్యాషన్ ఆభరణాలుగా  మార్చి, తన క్రియేటివిటీతో పలువురి సెలబ్రిటీల ఫ్యావరెట్‌గా మారిపోయింది. మిలిటరీ నేపథ్యమున్న కుటుంబం నుంచి వచ్చిన  మేఘన  ఉద్యోగాన్ని వదిలి  మరీ ఈ వ్యాపారాన్ని ఎంచుకుంది. మేఘనా సక్సెస్‌ జర్నీ ఎలా సాగిందో తెలుసుకుందాం ఈ కథనంలో.

బెంగళూరుకు చెందిన వ్యవస్థాపకురాలు మేఘనా ఖన్నా  బిందీ సంప్రదాయం నుండి ప్రేరణ పొంది, ది బిండి ప్రాజెక్ట్‌ను స్థాపించారు. అయితే ఈ జర్నీ వెనుక పెద్ద పోరాటమే ఉంది. మేఘనా ఖన్నా పూణేలో మార్కెటింగ్ అండ్‌ ఫైనాన్స్‌లో ఎంబీఏ చేశారు. ఒక ఏడాది పాటు  ఒక కంపెనీలో ఉద్యోగంలో చేరారు.  కానీ  సొంతంగా వ్యాపారాన్ని చేయాలనే  ఆలోచనకు మరింత  పదును పెరిగింది.  ఈ క్రమంలో   ఆమె దృష్టి ముక్కు పోగులపై పడింది. జోధ్‌పూర్‌ కళాకారులతో కలసి "లెవిటేట్" అనే హ్యాండ్‌క్రాఫ్ట్ జ్యువెలరీ బ్రాండ్‌ను ప్రారంభించింది. 2002 - 2020 వరకు అంటే పద్దెనిమిదేళ్లు లెవిటేట్ విజయవంతంగా నడిచింది. ఇందులో రకరకాల చోట్ల నుంచి వచ్చిన అందమైన నగలు, యాక్సెసరీలు, గృహాలంకరణ వస్తువులు ఉండేవి.  కోవిడ్‌ మహమ్మారి మేఘనా వ్యాపారాన్ని దెబ్బతీసింది. చివరకు వ్యాపారం మూసివేయాల్సి వచ్చింది. కానీ బిజినెస్‌ చేయాలనే కోరిక మాత్రం నశించ లేదు.

2022లో అనుకోకుండా బొట్టు బిళ్లల్లో బంగారు, వెండివి ఉంటాయని తెలుసుకుంది మేఘనా. తన స్నేహితురాలు అమ్మమ్మ ఇచ్చిన బంగారు బొట్టు చూశాక తానెందుకు ఇలాంటి తయారు చేయకూడదనే ఆలోచన వచ్చింది. అన్ని ఆభరణాల మాదిరిగానే  బొట్టు బిళ్లలు కూడా ఒకఫ్యాషన్‌గా ఉండాలనే ఆలోచనతో  "ది బిందీ ప్రాజెక్ట్"  ప్రారంభించింది. దీనికి తోడు ‘లెవిటేట్’ అనుభవం  ఉండనే ఉంది.  రూ.5 లక్షలతో బిందీ ప్రాజెక్ట్‌ షురూ అయింది. కేవలం ఇద్దరు మహిళలకు శిక్షణ ఇచ్చి, అందంగా స్పెషల్‌ డిజైన్లతో బిందీ డిజైన్లు రూపొందాయి. దీనికి తగ్గట్టు మార్కెటింగ్‌ చేసుకున్నారు. తొలుత వీటిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. పర్యావరణహితమైన, రీసైకిల్ చేయబడిన వ్యర్థాలతో అందమైన బొట్టు బిళ్లలను తయారు  కావడంతో  సెలబ్రిటీలను సైతం విపరీతంగా ఆకర్షించాయి. ఇవి కేవలం ఒక సాధనంగా కాకుండా, ఫ్యాషన్ స్టేట్‌మెంట్‌గా  మారిపోయాయి. 

రెండున్నరేళ్లలో 1500 కస్టమర్లు  వచ్చారు.  సోషల్‌ మీడియాలో వాట్సాప్‌, ఇన్‌స్టా ద్వారా ఆర్డర్లు తీసుకుంటారు. ఇలా 2024 ఆర్థిక సంవత్సరంలో 10 లక్షల ఆదాయం వచ్చింది. ఇది 2025లో రూ.  20 లక్షలకు చేరిందంటే దీని ఆదరణను అర్థం చేసుకోవచ్చు.  ఫెస్టివ్, లెదర్, వస్త్రంతో పూర్తిగా చేత్తో తయారవుతాయి.  రంగు రాళ్లు, ఇత్తడి ముక్కలు, పూసలు ఇలా రక రకాలుగా  తయారయ్యే ఒక్కో బొట్టు బిళ్లా ఒక్కో  డిజైనర్‌ ఆభరణంలా ఉంటుంది. సామాన్యులతో పాటు,ప్రముఖ పాప్‌ గాయని ఉషా ఉతుప్‌,  కరీనా కపూర్‌, కరిష్మా, తమన్నా, సోనం కపూర్‌ తదితర బాలీవుడ్‌  హీరోయిన్లను కూడా  ఆకర్షిస్తున్నాయి. 

Videos

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)