Breaking News

ఇంటిపేరే ‘బెంగళూరు’..!

Published on Mon, 01/26/2026 - 16:39

కొన్ని ఇంటి పేర్లు, ఊర్లు, గ్రామాల పేర్లుగా ఉండటం చూశాం. అంతేగానీ మెట్రో నగరాల్లాంటి మహా నగరాల పేరే ఇంటిపేరుగా ఉండటం గురించి విన్నారా?. వాట్‌ సీటీ పేరు ఇంటి పేరుగానా అని అనుకోకండి. ఇది నమ్మక తప్పని నిజం. ఓ మహిళ ఇంటిపేరే బెంగళూరు. ఎందుకలా వింటే.. ఆలోచన వేరేలెవెల్‌ అని అంటారు. మరి ఆ పేరు ఎందుకు పెట్టుకుందో ఆమె చకచక చదివేయండి మరి..!.

బెంగళూరుకు చెందిన  విప్రా బెంగళూరు అనే మహిళ తను పుట్టి.. పెరిగిన నగరంతో ముడిపడి ఉన్న జ్ఞాపకాలను ఓ వీడియో రూపంలో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ఇది నెటిజన్ల దృష్టిని అమితంగా ఆకర్షించడమేకాదు ఆమె తాత ఆలోచనకు ఫిదా అయ్యారు కూడా. మీ తాతగారి ముందుచూపుకి హ్యాట్సాఫ్‌ అంటూ ప్రశంసల జల్లు కురిపించారు. 

ఆమె తన వాయిస్‌ ఓవర్‌తో వివరించి వ్యక్తిగత కథ అందరి మనసులను తాకింది. ఆ వీడియోలో క్లిప్‌లో విప్రా ఇలా చెప్పడం ప్రారంభించింది. తన ఇంటి పేరు బెంగళూరు అని ఉండటం గమనించారా. ఇదేంటని అనుకుంటున్నారా..?. అయితే నగరం పేరు ఇంటిపేరుగా ఎలా మారిందో మీకు తెలియాలి అంటూ వివరించడం మొదలుపెట్టింది ఆమె.."మా తాతయ్య నిజానికి తన పిల్లలకు అంటే మా నాన్నకు ఇంటి పేరు పెట్టలేదు. 

ప్రజలు వారి ఇంటి పేరుని బట్టి వారి నేపథ్యం, హోదాను అంచనా వేస్తారనే ఉద్దేశంతో తన పిల్లలకు ఇంటిపేరు పెట్టేందుకు ఇష్టపడ లేదు. దాంతో మా నాన్నకు ఇంటిపేరు లేదు. ఇక నా వద్దకు వచ్చేటప్పటికీ..ఇంటి పేరు తప్పనిసరి కావడంతో..నేను పుట్టిన బెంగుళూరు నగరమే నా ఇంటి పేరుగా మారింది అని వివరించింది "విప్రా బెంగళూరు. 

ఈ మహిళ కథ తన తాతయ్య సామాజిక కట్టుబడులకు దూరంగా ఉంచడానికి ఆయన ఎలాంటి స్పృహతో వ్యవహరించారో అవగతమవుతోంది. తన పిల్లలకు ఇంటి పేరు పెట్టకుండా..వ్యక్తిగతంగా వారి నేపథ్యం, గుర్తింపుతోనే బతికేలా చేసేందుకు ఆయన​ ప్రయత్నించిన తీరు నిజంగా ప్రశంసనీయం. అలాగే ఇంటి పేరు తప్పనిరి పరిస్థితులో తను పుట్టిన నగరమే తన గుర్తింపుగా మార్చుకోవడం కూడా తాత ఆశయాలకు అనుగుణంగా చాలా అర్థవంతంగా ఉంది కదూ..!. నెటిజన్లు కూడా ఆ మహిళ ఇంటి పేరు వెనుక ఉన్న ఆలోచన చాలా గొప్పగా, ఆదర్శంగా ఉందంటూ ఆమె తాతపై ప్రశంసల వర్షం కురిపిస్తూ.. పోస్టులు పెట్టారు.

 

(చదవండి: ఒత్తిడికి మూలం డబ్బేనా..!)

 

Videos

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

నేను తాడిపత్రి పోతా.. ఏం పీకుతారో పీక్కోండి.. మాస్ వార్నింగ్

Photos

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)