రూ. 200 కోట్ల ప్రైవేట్‌ జెట్‌కొన్న అజ్ఞాత వ్యక్తి, అంబానీ పండిట్‌ వైరల్‌

Published on Thu, 05/22/2025 - 17:14

200  కోట్ల రూపాయల విలువైన  ప్రైవేట్ జెట్‌ను కొనుగోలు చేశాడోవ్యక్తి. మరి అంత విలాసవంతమైన  జెట్‌ కొన్నా తరువాత అంతే  భక్తితో   దైవిక పూజలు నిర్వహించి, దేవుడి ఆశీర్వాదం తీసుకోకుండా ఉంటాడా. అదీ ఖరీదైన పూజారి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించాడు. ఇదే ఇపుడు నెట్టింట హాట్‌ టాపిక్‌గా నిలిచింది. ఇంతకీ ఆ లగ్జరీప్రైవేట్‌ జెట్‌ ఓనరు ఎవరు? పూజలు చేసిన పండితుడు ఎవరు? తెలుసుకోవాలని ఉందా?   ప్రస్తుతం నెట్టింట   వైరల్‌గా మారిన ఆవివరాలు  మీకోసం.

బెంగళూరుకు చెందిన మిస్టరీ వ్యక్తి తన ప్రైవేట్ జెట్‌ను సొంతం చేసుకున్నాడు.  రూ. 200 కోట్లదీని ధర రూ. 150 కోట్ల నుండి రూ. 200 కోట్ల వరకు ఉంటుంది. బిలియనీర్‌, రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ ఇంట పూజలు నిర్వహించే  ప్రసిద్ధ పూజారి పండిట్ చంద్రశేఖర్ శర్మ  ఈ వాహనానికి సంబంధించిన పూజలు నిర్వహించారు.  స్వయంగా  ఆయనే  దీనికి సంబంధించిన ఒక క్లిప్‌ను పంచుకున్నారు.  ప్రైవేట్ జెట్‌కు స్వాగత పూజలు చేశారు. ఈ ప్రైవేట్ జెట్ సాధారణమైనది కాదు. ఇది గల్ఫ్‌స్ట్రీమ్ G280 జెట్,  జెట్ యజమానికి సంబంధించి పూర్తి వివరాలుఅందుబాటులో లేవు. కానీ ఈ జెట్ అమెరికాలోని కాలిఫోర్నియాలోని శాన్ మారినోలో ఉన్న ఎంపైర్ ఏవియేషన్ కింద రిజిస్టర్  అయింది.  పూజలు ఇండియా చేశారు కాబట్టి, దీని యజమాని భారతీయుడేనా? కాదా అనే దానిపై కూడా స్పష్టత లేదు. 

చదవండి: నా బరువుతో నేను హ్యాపీగానే ఉన్నా : ఐశ్వర్య ఘాటు రిప్లై వైరల్‌

పండిట్ చంద్రశేఖర్ శర్మ అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ వివాహ వేడుకలో ఒక కార్యక్రమంలో ఆచారాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.తన ఐజీ హ్యాండిల్ ద్వారా ప్రైవేట్ జెట్‌లో పూజ చేస్తున్న వీడియోను షేర్ చేశారు. జెట్ టేకాఫ్ కావడానికి కొద్దిసేపటి ముందు పూజ జరిగిందని తెలిపాడు.

దాదాపు రూ. 200 కోట్ల ప్రైవేట్ జెట్ విశేషాలు
గల్ఫ్‌స్ట్రీమ్ G280 జెట్ 10 మందికి ప్రయాణించడానికి అవకాశం ఉంటుంది.  రెండు హనీవెల్ HTF7250G టర్బోఫ్యాన్ ఇంజిన్‌లు ఉంటాయి. ఇవి ఒక్కొక్కటి 33 కిలోన్యూటన్‌ల వరకు థ్రస్ట్‌ను మోయగలవు. దానితో పాటు, ప్రైవేట్ జెట్‌లో అధునాతన ఫీచర్స్‌,   విలాసవంతమైన సేవలను అందిస్తుంది. ఇది గంటకు 900 కి.మీ వరకు ఎగురుతుంది.
ఇదీ చదవండి: వారానికి 52 గంటలకు మించి పని చేస్తే.. మెదడు మటాషే!

Videos

కోతల రాయుడు.. ఆంజనేయులపై బొల్లా బ్రహ్మనాయుడు ఫైర్

70కోట్ల ప్యాకేజీతో నవరంధ్రాలు మూసుకుని... పవన్ పై రాచమల్లు ఫైర్

అసెంబ్లీలో ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ ఫస్ట్ స్పీచ్

అసెంబ్లీలో కేసీఆర్ ను పలకరించిన సీఎం రేవంత్

అండర్-19 వరల్డ్ కప్ టీమ్ వచ్చేసింది.. అందరి కళ్లు అతడిపైనే..!

రెడ్ బుక్ ఆర్డర్.. పోలీసులు జీ హుజూర్

రియల్ సైకో! తొందర పడకు..

పవన్ కు ప్రతి నెల 70 కోట్ల ప్యాకేజీ!

Watch Live: తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు

ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా సురేష్ బాబు ఎన్నిక

Photos

+5

‘ది రాజా సాబ్’ప్రీ రిలీజ్ లో మెరిసిన హీరోయిన్స్‌ మాళవిక , రిద్ది కుమార్ (ఫొటోలు)

+5

సల్మాన్ ఖాన్‌ 60వ బర్త్‌డే సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్‌

+5

దళపతి 'జన నాయగన్' ఆడియో లాంచ్ (ఫొటోలు)

+5

మేడారం : తల్లులకు తనివితీరా మొక్కులు..(ఫొటోలు)

+5

బుక్‌ఫెయిర్‌ కిటకిట..భారీగా పుస్తకాలు కొనుగోలు (ఫొటోలు)

+5

గచ్చిబౌలి స్టేడియం : కూచిపూడి కళావైభవం గిన్నీస్‌ ప్రపంచ రికార్డు (ఫొటోలు)

+5

'జన నాయగణ్' ఈవెంట్ కోసం పూజా రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

ఫిలిం ఛాంబర్ ఎన్నికల్లో టాలీవుడ్ సెలబ్రిటీలు (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (డిసెంబర్ 28- జనవరి 04)

+5

బేబీ బంప్‌తో హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)