Breaking News

నో లగ్జరీ కార్లు, నో బ్రాండెడ్‌ బట్టలు..! వైరల్‌గా ఆ జంట ఆర్థిక సూత్రాలు..

Published on Thu, 07/23/2026 - 12:49

ప్రస్తుతం ఆన్‌లైన్‌ షాపింగ్‌, ఆఫర్ల పుణ్యమా అని..అవసరం ఉన్నా లేకపోయినా..కొనడం ఒక వ్యసనంగా మారిందని చెప్పాలి. దాంతో కొన్ని కుటుంబాలు ఆర్థిక సమస్యల్లో చిక్కుకుని సతమవుతున్నాయి కూడా. అయినా కూడా ఈ జాడ్యం వదిలించుకోలేరు. చూడగానే కంటికి నచ్చితే చాలు కొనేయాల్సిందే అన్న మనస్తత్వం ఉంటే ..ఆర్థిక కష్టాలు కూడా ఆ రేంజ్‌లోనే ఉంటాయని చెబుతుంటారు ఆర్థిక నిపుణులు. ఇప్పుడిదంతా ఎందుకంటే ఓ జంట మాత్రం ఆర్థికంగా బేషుగ్గా ఉండాలంటే ఈ విధానం ఫాలో అయితే చాలు అంటూ చెప్పిన ఆర్థిక సూత్రాలు నెట్టింట తెగ వైరల్‌గా మారాయి. వాళ్లు వేటి మీద పెట్టుబడులు పెడుతున్నారో చూస్తే విస్తుపోతాం కూడా. అంతా విలాసవంతమైన వాటి కోసం చూస్తే..వాళ్లు మాత్రం జీవితానికి కీలకమైన దానిపై పెట్టుబడులు పెడుతూ అందర్నీ ఆలోచింప చేశారు. ఇంతకీ ఆ దంపతులు వేటి మీద పెట్టుబడులు పెడుతున్నారంటే..

డబ్బు విషయానికి వస్తే, ప్రతి ఒక్కరికీ వేర్వేరు ప్రాధాన్యతలు ఉంటాయి. కొందరు భవిష్యత్తు కోసం పొదుపు చేసి పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడితే, మరికొందరు తక్షణ ఆనందాల కోసం ఖర్చు చేస్తూ సంతోషంగా ఉండేందుకు ప్రాధాన్యత ఇస్తుంటారు. వర్తమానాన్ని సద్వినియోగం చేసుకోవాంటే నచ్చిన వాటిపై ఖర్చు చేయాల్సందేనన్నది కొందరి వ్యక్తుల నమ్మకం. 

అయితే చాలామంది రేపటికోసం ప్రణాళిక తోపాటు ప్రస్తుత జీవితాన్ని ఆస్వాదించేలా సమతుల్యతకు పెద్దపీట వేస్తారు. అలానే చేస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నా మేఘ, శుభమ్‌లు. ఒక పసిబిడ్డ, ఒక పెంపుడు కుక్క, రెండు పూర్తికాల ఉద్యోగాలతో తమ కుటుంబాన్ని ఎలా నడిపిస్తున్నారో ఇన్‌స్టాగ్రామ్‌ వీడియోతో పంచుకుంటూ అందర్నీ ఆకర్షించారు. ఆ దంపతులు అనుసరించే విధానం..అందరికీ నచ్చడం విశేషం. వాళ్లు తమ కుటుంబాన్ని నడిపించేందుకు ఫాలో అవుతున్న ఆర్థిక తత్వం గురించి మాట్లాడారు. 

తాము హోదాల కంటే సౌకర్యానికి, జీవన నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. విలాసవంతమైన కార్లు, డిజైనర్ దుస్తులు లేదా ఖరీదైన ఆభరణాలు కొనడానికి బదులుగా, తమ కుమార్తెతో ఎక్కువ సమయం గడిపే నివాస సముదాయంపై పెట్టుబడులు పెట్టేందుకు ఇష్టపడతామని అన్నారు. ప్రతి వేసవిలో ఒక అంతర్జాతీయ విహారయాత్రను ప్లాన్ చేసుకోవడం, ఏడాదిలో అనేకసార్లు తమ ప్రాంతంలోని విహారయాత్రాలు చేయడం, ముఖ్యంగా పండుగల సమయంలో తల్లిదండ్రల ఇంటికి వెళ్లడం వంటివి ఒక నియమంగా పెట్టుకుంటామని చెప్పారు. 

ఇక ఆరోగ్యం, ఫిట్‌నెస్‌ అవసరమైన పెట్టుబడులుగా పరిగనిస్తామని అన్నారు. అందుకే ఆరోగ్యోకరమైన ఆహారం, జిమ్‌ సభ్యుత్వం, ఆరోగ్య సంరక్షణపై ఖర్చులు పెడతామని అన్నారు. ప్రతి ఏడాది పెట్టుబడులను పెంచుతూ..పెట్టుబడి ఫోర్టఫోలియో వృద్ధికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. చివరగా స్వల్పకాలిక, దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించుకోవడం ద్వారా సంపదను నిర్మించడంపై దృష్టి పెడతామని చెప్పారు. అలాగే తాము తమ ఖర్చుల, ఆర్థిక బాధ్యతలను పంచుకుంటామని అన్నారు. 

మేఘా అద్దె, యుటిలిటీ బిల్లులు, గృహ సిబ్బంది జీతాలు వంటి స్థిరమైన నెలవారీ ఖర్చులు చూసుకుంటుండగా, శుభం కిరాణా సామాగ్రి, ప్రయాణం, క్రెడిట్‌తో సహా మారే ఖర్చులను చూసుకుంటాడని అన్నారు. ఈ ఆర్థిక నియమాలు అందరికీ వర్తించేవని చెప్పడం లేదని కేవలం ఆర్థికంగా ధీమాగా ఉండేందుకు, ఒక చిన్న కుటుంబానికి అత్యంత అనుకులమైన ఒక విధానమని చెప్పారు.

 

(చదవండి: వెయ్యి ఇంజెక్షన్లు, రెండు గర్భస్రావాలు..! ఐవీఎఫ్‌ జర్నీపై నటి షాకింగ్‌ వ్యాఖ్యలు)

 

Videos

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)