Breaking News

జస్ట్‌ 15 నిమిషాల జర్నీలో అద్భుత జీవిత పాఠం..! డబుల్‌ ఎంఏ, ఏడు భాషలు..

Published on Thu, 07/17/2025 - 18:00

మనకే అన్ని తెలుసు. మనంత అదృష్టవంతులు ఎవ్వరూ లేరు అని తెగ పొంగిపోతుంటాం. కానీ కాసేపు సరదాగా బయటకు వెళ్లగానే ఆ కొద్ది నిమిషాల్లో మనకు పరిచయమై అపరిచివ్యక్తులు చాలా విషయాలను నేర్పిస్తారు. ఇలాంటి అనుభవం చాలామందికి ఎదురవ్వుతుంది. కానీ ఇలాంటి టాలెంటెడ్‌ వ్యక్తి మాత్రం ఎదురయ్యి ఉండడు. ఈ యువకుడికి ఎదురైన అనుభవం వింటే..మనకు తెలియని గొప్ప విషయాలు ఎన్నో ఉన్నాయని అంగీకరించకుండ ఉండలేరు. 

ఇంతకీ ఏం జరిగిందంటే..హైదరాబాద్‌కు చెందిన కంటెంట్‌ క్రియేటర్‌ అభినవ్‌ మైలవరపు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోని షేర్‌  చేసుఉన్నారు. తన స్నేహితులతో కలిసి బెంగళూరులోని డీమార్ట్‌ షాప్‌కి వెళ్లి బాగా అలసిపోయి తిరిగి వచ్చి ఓ ఆటో ఎక్కి వస్తుండగా ఓ మంచి అనుభవం ఎదురైందంటూ ఆ వీడియోలో చెప్పుకొచ్చాడు. అప్పటిదాక ఉన్న మా అలసట మొత్తం ఉఫ్‌ మని ఎగిరిపోయూలా గొప్ప అనుభూతిని పంచాడు ఆ ఆటో డ్రైవర్‌ తనకెదురైన అనుభవాన్ని వివరిస్తున్నాడు. 

ఆ రోజుఆటోలో వెళ్తూ సరదాగా ఆ ‍డ్రైవర్‌తో మాటలు కలిపినట్లు తెలిపాడు. "అతడు కూడా సరదాగా మాట్లాడుతూ..వాళ్లకో సవాలు విసిరాడు. కంప్యూటర్‌ అనే పదం ఫుల్‌ ఫామ్‌ చెప్పమని అడిగాడు. ఒకవేళ దానికి సమాధానం చెబితే గనుక తాను తమ వద్ద నుంచి ఈ జర్నీకి అయ్యే డబ్బులు కూడా ఛార్జ్‌ చెయ్యనని అంటాడు. అయితే ఆ డ్రైవర్‌కి తెలుసు తాము కచ్చితంగా సమాధానం ఇవ్వలేమని అంటున్నాడు అభినవ్‌. చివరికి ఆ డ్రైవరే కంప్యూటర్ అంటే: వాణిజ్యం, విద్య మరియు పరిశోధన కోసం ఉద్దేశపూర్వకంగా ఉపయోగించే సాధారణ యంత్రం ((COMPUTER)Commonly Operated Machine Purposely Used for Trade, Education and Research) అని చెబుతాడు. 

తాను 1976 ఆ టైంలో చదువుకున్నానని, అప్పడు అంతా కంప్యూటర్లు వస్తాయనేవారు..కానీ ఇప్పడంతా ఏఐ గురించి మాట్లాడుకుంటున్నారు అని చెప్పాడు ఆ డ్రైవర్‌. ఆ తర్వాత ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ పితామహుడు ఎవ్వరని ప్రశ్నించడమే గాక ఆ భాష చరిత్ర గురించి వివరిస్తూ..తన గురించి చెప్పుకొచ్చాడు. తాను డబల్‌ ఎంఏ చేశానని, ఒక ఇంగ్లీష్‌, మరొకటి పొలిటికల్‌ సైన్స్‌లోనని చేసినట్లు తెలిపాడు. 

సడెన్‌గా పెళ్లి ఫిక్స్‌ చేయడం, తర్వాత పిల్లలు, బాధ్యతలు వల్ల చదువు కొనసాగించలేకపోయానని అన్నాడు. తాను కూడా ఐఏఎస్‌కి ప్రిపరయ్యే వాడినని చెప్పుకొచ్చాడు. తాను పలు ఎంఎన్‌సీ కంపెనీల్లో అధిక వేతనానికి పనిచేసినట్లు చెప్పుకొచ్చాడు. ఇచ్చే జీతానికి తగ్గట్టుగా అక్కడ కార్పొరేట్‌ అధికారులు మనల్ని ఎలా పనులతో ఉక్కిరిబిక్కిరి చేస్తారో కూడా చెప్పాడు. 

అప్పటి దాక షాపింగ్‌తో అలసిన వాళ్లకి ఆ డ్రైవర్‌ మనోగతం జీవితంపై స్పష్టత వచ్చేలా కళ్లు తెరిపించి ఓ గొప్ప పాఠాన్ని వివరించినట్లుగా అనిపించింది. అంతేగాదు ఆ ఆటోలో ప్రయాణించిన 15 నిమిషాల జర్నీ జీవితంలో మర్చిపోలేని గొప్ప అనుభూతినిచ్చింది అని వీడియోలో చెప్పుకొచ్చాడు అభినవ్‌. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ వీడియోపై ఓ లుక్కేయండి.

 

(చదవండి: పార్లమెంటు క్యాంటీన్‌లో సరికొత్త హెల్త్‌ మెనూ! లిస్టు చూసేయండి!)
 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)