Breaking News

ఉండాల్సిన నమ్మకం : భగవంతుడు సర్వాంతర్యామి

Published on Tue, 06/03/2025 - 13:10

భగవంతుడు సర్వాంతర్యామి అనేది భారతీయుల విశ్వాసం. అందుకే భారతీయులకు నదీనదాలూ, కొండలూ, గుట్టలూ, జంతువులూ, పక్షులూ... ఒకటేమిటి– అన్నీ పూజనీయాలే.  పండుగలూ పబ్బాలలో ప్రకృతితో మమేకమై తన్మయత్వంతో పూజలు చేయడం అందుకే! అయితే వివిధ రూపాల్లో ఉన్న దేవుని గుర్తించడంలో మాత్రం చాలామంది విఫలమవుతూ ఉంటారు. ఇందుకు దైవాన్ని గుర్తించగలిగిన జ్ఞానం వారికి లేకపోవడమే కారణం. దేవుణ్ణి దర్శించుకోవడానికి గుడి లోపలికి చాలా భక్తిప్రపత్తులతో వెళతారు. కానీ గుడి మెట్లపై కూర్చునే యాచకులు, దీనులను చాలామంది పట్టించుకోరు. వారితోనే నిజంగా దేవుడు కూర్చున్నా గుర్తించలేరు. అయితే భగవంతుని గుర్తించడానికి శోధన అవసరం. 

ఇదీ చదవండి: బొక్కలిరుగుతాయ్‌.. అమెరికా టూరిస్ట్‌కు చేదు అనుభవం, వీడియో వైరల్‌

అన్వేషించే కొద్దీ భగవంతుణ్ణి ఏదో ఒకరోజు తెలుసుకోవచ్చు. ఆరాధనా పద్ధతులతోపాటు అన్వేషణా జ్ఞానాన్నీ సముపార్జించాలి. ఆ జ్ఞానం లేకపోతే ఆ నారాయణుడే మన ముందుకొచ్చి నిల్చున్నా తెలుసుకోలేం. పైపెచ్చు అనుమానిస్తాం. అతను నిజంగా నారాయణుడేనా అని ఆలోచనలో పడతాం. నారాయణుడేదో మన అవసరాలను తీర్చడానికొస్తే ఎదురు మనమే అవీ ఇవీ అడిగి అనుమానిస్తాం. అప్పుడు ‘నేను సాక్షాత్తూ ఆ నారాయణుడినే నయ్యా’ అని భగవంతుడు చెప్పినా సరే... మన మనసు ఒప్పుకోవడానికి ససేమిరా అంటుంది. ‘అదేంటీ, నాకంత సులభంగా పరమాత్మ ప్రత్యక్షమవుతాడా’ అని సందేహిస్తాం. ఇటువంటి స్థితిలోనైనా మనకు ప్రహ్లాదుడి మాట గుర్తుకు రావాలిగా... ఆ హరి నారాయణుడు లేని చోటేది? అతను సర్వాంతర్యామి అనేది తెలిసుండాలిగా! అలాకాక ‘నీకు శంఖం, చక్రం లేవేమిటీ? నీ వాహనమైన గరుత్మంతుడేడీ?’ అని ప్రశ్నిస్తే ఆ నారాయణుడిని ఎలా చూడగలం?

చదవండి: Miracle Sea Splitting Festival: గంట సేపు సముద్రం చీలుతుంది

మనకు మన మీదే అపనమ్మకం. అటువంటప్పుడు సాక్షాత్తూ ఆ వైకుంఠవాసుడైనా ఏమీ చేయలేడు. కనుక మనకు ఉండాల్సింది నమ్మకం. అన్నింట్లోనూ ఆ భగవంతుడు ఉంటాడనేది తెలియాలి. 
– యామిజాల జగదీశ్‌ 
 

#

Tags : 1

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)