Breaking News

నల్లటి వలయాలు, పుట్టుమచ్చలను మాయం చేద్దాం ఇలా..!

Published on Sun, 09/28/2025 - 11:41

సాధారణంగా ఒత్తిడి, అలసట, నిద్రలేమి, కంప్యూటర్స్‌ లేదా ఫోన్స్‌ ఎక్కువగా చూడటంతో కళ్ల కింద నల్లటి వలయాలు (డార్క్‌ సర్కిల్స్‌), వాపు, ముడతలు ఏర్పడుతుంటాయి. వాటిని తగ్గించుకోవాలంటే ప్రత్యేకమైన జాగ్రత్తలు తప్పవు. ఇందుకోసం ఈ మెటల్‌ టూల్‌ అయిన కళ్ళ మసాజర్‌ లేదా క్రీమ్‌ స్పూన్‌ ప్రత్యేకమైనదిగా నిలుస్తోంది. ఎందుకంటే ఈ టూల్‌కి ఒకవైపు బాల్‌ లాంటి భాగం మరోవైపు స్పూన్‌ లాంటి ఆకారం ఉంటాయి. 

క్రీమ్స్, సీరమ్స్‌ వంటివి వేళ్లతో కాకుండా ఈ టూల్‌తో అప్లై చేసుకుంటే చర్మంపై బాక్టీరియా చేరే అవకాశం తగ్గుతుంది. ఈ స్పూన్‌.. జింక్‌ అలాయ్‌తో తయారైంది. ఇది చాలాకాలం మన్నుతుంది. కళ్ళకు వాడే క్రీములు, ఫేస్‌కి వాడే క్రీమ్స్, డ్రై మాస్క్‌లు, లోషన్లు, ఇతర సౌందర్య ఉత్పత్తులు అప్లై చేయడానికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది. దీన్ని స్నేహితులకు బహుమతిగా కూడా ఇవ్వచ్చు. ఈ మసాజర్‌తో సున్నితంగా మసాజ్‌ చేయడం వల్ల ముఖంపై ఉండే వాపు తగ్గుతుంది, 

డబుల్‌ చిన్‌ సమస్య నుంచి ఉపశమనం పొందొచ్చు. కళ్ళ కింద ఉండే నల్లటి వలయాలు, బ్యాగ్స్‌ కూడా తగ్గుతాయి. ముఖ కండరాలు రిలాక్స్‌ అవ్వడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఈ టూల్‌ చాలా తేలికైనది, చిన్నది కాబట్టి హ్యాండ్‌బ్యాగ్‌లో లేదా జేబులో సులభంగా పెట్టుకొని ఎక్కడికైనా తీసుకెళ్ళవచ్చు. క్రమం తప్పకుండా దీనితో మసాజ్‌ చేయడంతో, ఇది చర్మాన్ని బిగుతుగా చేసి, యవ్వనంగా కనిపించేలా చేస్తుంది.

బెస్ట్‌ బ్యూటీ ట్రీట్‌మెంట్‌!
కొన్ని పుట్టుమచ్చలు అందాన్ని తెచ్చిపెడితే, మరికొన్ని పుట్టుమచ్చలు గడ్డల్లా కనిపిస్తూ, ఉన్న అందాన్ని చెడగొడుతుంటాయి. అలాంటి వాటిని తొలగించడానికి చాలా రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో షేవ్‌ ఎక్సిషన్‌ ట్రీట్‌మెంట్‌ ఒక సాధారణ వైద్య పద్ధతి. చర్మంపై ఉన్న పులిపిర్లు, పుట్టుమచ్చలు లేదా చిన్న చిన్న గడ్డలు తొలగించడానికి ఈ చికిత్స సహకరిస్తుంది. ఈ ప్రక్రియలో, ఒక పదునైన బ్లేడుతో చర్మం పైపొరలో ఉన్న పెరుగుదల భాగాన్ని జాగ్రత్తగా ‘షేవ్‌’ చేస్తారు. 

ఇది లోతైన కోత కాదు, కాబట్టి సాధారణంగా కుట్లు వేయాల్సిన అవసరం ఉండదు. ప్రక్రియ ఎలా జరుగుతుందంటే.. ముందుగా, ఆ ప్రాంతానికి మత్తు ఇంజెక్షన్‌ ఇస్తారు, కాబట్టి నొప్పి తెలియదు. అనంతరం ఒక ప్రత్యేకమైన బ్లేడుతో చర్మంపై ఉన్న గడ్డను జాగ్రత్తగా షేవ్‌ చేస్తారు. కొద్దిగా రక్తం కనిపించే అవకాశం ఉంటుంది, దాన్ని ఆపడానికి విద్యుత్తు లేదా రసాయనాలను ఉపయోగిస్తారు. చికిత్స తర్వాత ఆ ప్రాంతాన్ని పొడిగా, శుభ్రంగా ఉంచుకోవాలి. చర్మ వైద్య నిపుణుడి సమక్షంలోనే ఈ ట్రీట్‌మెంట్‌ తీసుకోవడం ఉత్తమం. 

(చదవండి: World Rivers Day: హృదయ నదులు..! వాటి గొప్పదనాన్ని నాడు ఎలా చెప్పారంటే..)

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)