మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!
Breaking News
రైల్లో ఫోన్ స్పీకర్ ఆన్ చేస్తే జైలుకే..
Saudi: భారత పౌరులకు భద్రతా హెచ్చరికలు
చైనాలో ఎంత బంగారమైనా కొనొచ్చా? గోల్డ్ రూల్స్ ఇవే..
ట్రంప్‌కు ‘శాంతి’నిచ్చి.. ప్రతిపక్షంలో మచాడో కలకలం!
‘టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు మా పనే’.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్
ఎస్ఎస్ఆర్, ఎస్ఐఆర్ మధ్య తేడాలివే.. సింపుల్‌గా తెలుసుకోండి
రాబోయే ఎన్నికల్లో కూటమికి సింగిల్ డిజిట్ కూడా రాదు: వైఎస్ జగన్
ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల గడువు
ఏపీలో ఎక్కడా స్వేచ్ఛగా నామినేషన్లు వేయనివ్వడం లేదు!
ఎస్ఈసీని కలిసిన వైఎస్ జగన్
మా టైం వచ్చినప్పుడు మేమేంటో చూపిస్తాం: వైఎస్ జగన్
కోల్‌కతా తొక్కిసలాట: సీఎం సువేందు ఉన్నత స్థాయి సమీక్ష
సీఈసీ నియామకంపై వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
బాబుకు ఓటమి భయం పట్టుకుంది: వైఎస్ జగన్
పార్ట్నర్ పార్టీకి.. బాబు పార్టీ నుంచే అభ్యర్థుల సప్లై: వైఎస్ జగన్
తొక్కిసలాట విషాదం: పలు మండపాల్లో పూజల నిలిపివేత
ఏపీలో అధర్మ, రక్త చరిత్ర నడుస్తోంది: వైఎస్ జగన్
వైఎస్ జగన్ ప్రెస్‌మీట్ హైలైట్స్
జనసైనికుల ఆర్తనాదాలు.. నమ్మించి.. ఆపై నిండా ముంచిన పవన్ కల్యాణ్?!
బంగారం, వెండి ధరలు ఇలా..
మెడి టిప్: స్పాండిలోసిస్ పెరగకుండా జాగ్రత్తలివి..
Published on Sun, 01/14/2024 - 13:02
మెడలో ఉన్న వెన్నుకు సంబంధించిన ఎముకలు అరిగి.. రాపిడికి గురైనప్పుడు వెన్నుపూసల నరాలపై ఒత్తిడి పడటం వల్ల వచ్చే నొప్పిని ‘స్పాండిలోసిస్’ అంటారు. ఈ నొప్పి తగ్గడానికీ.. అలాగే ముందు నుంచే స్పాండిలోసిస్ నివారణకూ పాటించాల్సిన జాగ్రత్తలివి..
- బరువైన వస్తువులు.. అంటే నీళ్లబక్కెట్లు, సూట్‌కేసులు, బ్రీఫ్‌కేసులు, ల్యాప్‌టాప్‌లు మోయడం వంటి పనులు చేయకూడదు.
- తలపైన బరువులు (మూటలు, గంపలు వంటి అతి బరువైనవి) పెట్టుకోకూడదు.
- పడుకునే సమయంలో తలగడ కేవలం తల కింది వరకే కాకుండా భుజాల వరకూ ఉండేలా చూసుకోవాలి. దాంతో మెడకు కొంత సపోర్ట్ ఉండేలా జాగ్రత్తపడాలి.

- తలగడ అందుబాటులో లేకపోతే కనీసం ఒక బెడ్‌షీట్ నాలుగు ఇంచుల ఎత్తుగా ఉండేలా మడత వేసి తల కింద పెట్టుకోవాలి. దాని మీద ఓ టర్కీ టవల్‌ను రోల్ చేసినట్లుగా చుట్టి మెడకింద పెట్టుకోవాలి. మూడు నెలల నుంచి ఆర్నెల్ల వరకు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.
- ఈ సమస్య ఉన్నప్పుడు తలగడ లేకుండా పడుకోవడం అన్నది సరికాదు. తలగడ ఉండటం వల్లనే తప్పనిసరిగా మెడకూ, భుజాలకు సపోర్ట్ ఉంటుంది.
- సమస్య రెండో దశలో ఉన్నప్పటికీ మందులతో పాటు ఇక్కడ పేర్కొన్న జాగ్రత్తలు తీసుకుంటే సమస్య దాదాపు పూర్తిగా తగ్గిపోతుంది. అప్పటికీ తగ్గనివారు ఒకసారి డాక్టర్‌ను సంప్రదించడం అవసరం.
ఇవి చదవండి: చాలాసేపు కదలకుండా కూర్చుంటున్నారా.. అయితే జాగ్రత్త!
#
Tags : 1