Breaking News

నెయిల్‌ పాలిష్‌కు గుడ్‌బై.. ఇప్పుడు ఇదే కొత్త ట్రెండ్‌!

Published on Sat, 09/26/2026 - 14:14

గోళ్లకు రంగులు వేయించుకోవడం, నెయిల్‌ ఆర్ట్‌ చేయించుకోవడం ఇప్పుడు చాలామంది మహిళలకు అందం, స్టైల్‌లో భాగంగా మారింది. అయితే ఇటీవల దీనికి భిన్నంగా గోళ్లకు ఎలాంటి రంగు వేయకుండా సహజంగా, మెరిసేలా ఉంచుకోవడం ట్రెండ్‌గా మారింది. సోషల్‌ మీడియాలో ‘బేర్‌ నెయిల్స్‌’ పేరుతో ఈ స్టైల్‌ బాగా వైరల్‌ అవుతోంది. ఫ్యాషన్‌ షోలు, రెడ్‌ కార్పెట్‌లపైనా సహజంగా కనిపించే గోళ్లు కనిపిస్తుండటంతో దీనిపై ఆసక్తి పెరుగుతోంది. కొందరు దీన్ని ‘క్వైట్‌ లగ్జరీ’కి కొత్త గుర్తుగా భావిస్తున్నారు.

లండన్‌లోని కొన్ని నెయిల్‌ సెలూన్లకు వస్తున్న కస్టమర్లు పాలిష్‌ వేయించుకోకపోయినా గోళ్లను ఫైల్‌, బఫ్‌, క్యూటికల్స్‌ శుభ్రం, మాయిశ్చరైజ్‌ చేయించుకోవడం చేస్తున్నారు. అంటే సహజంగా కనిపించే గోళ్ల వెనుక కూడా ప్రత్యేక శ్రద్ధ ఉంటోంది. తరచూ మానిక్యూర్‌ చేయించుకోవడానికి అయ్యే సమయం, ఖర్చును తగ్గించుకోవడంతో పాటు సింపుల్‌, మినిమల్‌ లుక్‌ తమకు నచ్చుతోందని కొందరు మహిళలు చెబుతున్నారు. మరికొందరు మాత్రం నెయిల్‌ ఆర్ట్‌తో తమ వ్యక్తిత్వాన్ని, స్టైల్‌ను చూపించుకోవడమే ఇష్టమని అంటున్నారు.

అయితే బేర్‌ నెయిల్స్‌ను మాత్రమే ‘క్లాసీ’, ‘ఎలిగెంట్‌’గా చూపించడంపై సోషల్‌ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నెయిల్‌ ఆర్ట్‌ అనేది కేవలం అలంకరణ మాత్రమే కాదని, అది వ్యక్తిత్వాన్ని, సంస్కృతిని, అందాన్ని వ్యక్తపరిచే మార్గంగా మారిందని పలువురు నెటిజన్లు అంటున్నారు. ముఖ్యంగా నల్లజాతి, లాటిన్‌, ఆసియా వర్గాల్లో నెయిల్‌ ఆర్ట్‌కు ప్రత్యేకమైన చరిత్ర ఉందని గుర్తుచేస్తున్నారు. సహజ గోళ్లనే మంచి రుచికి గుర్తుగా చూపించడం వల్ల రంగురంగుల నెయిల్‌ ఆర్ట్‌ను తక్కువగా చూసే పరిస్థితి రావచ్చని కొందరు ఫ్యాషన్‌ వర్గాల వారు అభిప్రాయపడుతున్నారు.

నిజానికి గోళ్ల అలంకరణకు చరిత్రలోనూ సామాజిక ప్రాధాన్యం ఉంది. ప్రాచీన చైనాలో పొడవాటి గోళ్లు ఉన్నత వర్గాల గుర్తుగా ఉండేవని ఫ్యాషన్‌ చరిత్రకారులు చెబుతున్నారు. కాలక్రమంలో మానిక్యూర్‌ సామాన్యులకు కూడా అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా నల్లజాతి మహిళలు నెయిల్‌ ఆర్ట్‌ను తమ అందం, వ్యక్తిత్వాన్ని చూపించే సాధనంగా మార్చడంలో కీలక పాత్ర పోషించారని ఫ్యాషన్‌ రంగానికి చెందిన వారు చెబుతున్నారు. ఇప్పుడు సహజంగా కనిపించే గోళ్లనే ఉన్నత స్థాయి, మంచి రుచికి గుర్తుగా చూడటం కొత్త చర్చకు దారితీసిందని ఫ్యాషనర్లు అంటున్నారు.

అయితే గోళ్లను ఎలా ఉంచుకోవాలన్నది పూర్తిగా వ్యక్తిగత ఇష్టానికి సంబంధించినదేనని చాలామంది మహిళలు అభిప్రాయంగా తెలుస్తోంది. పాలిష్‌ వేసుకున్నా, నెయిల్‌ ఆర్ట్‌ చేయించుకున్నా, ఎలాంటి రంగు లేకుండా సహజంగా ఉంచుకున్నా అది వ్యక్తిగత ఎంపికేనని అంటున్నారు. సహజంగా కనిపించే గోళ్ల కోసం కూడా ప్రత్యేక సంరక్షణ, సమయం అవసరం కావచ్చని, ట్రెండ్‌ ఏదైనా.. ఇతరుల ఎంపికను గౌరవిస్తూ, మనకు నచ్చిన స్టైల్‌లో ఉండటమే ముఖ్యం అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చదవండి: కాఫీ కప్పు చూసి అభ్యర్థిని అంచనా వేస్తారా?

Videos

వైరల్ వీడియో వోడ్కా తాగి వైన్స్ లోనే పడుకున్న కోతి

మంత్రి నారాయణ పై సిట్ విచారణ జరపాలి అమరావతి రైతుల కీలక డిమాండ్

ఊహించని ఊచకోత.. అప్పుడే రూ.100 కోట్లు

దానంకు ఖైరతాబాద్ టికెట్ టెన్షన్

కర్నూలులో పట్టపగలే చోరీ.. రైతు బైక్ నుంచి రూ.2 లక్షలు మాయం

చింతమనేని నీకే చెప్తున్నా దెందులూరు గడ్డ సాక్షిగా.. నెక్స్ట్ లెవెల్ వార్నింగ్

గణేష్ నిమజ్జనంలో దుమ్మురేపిన హైదరాబాద్ లేడీ పోలీస్ డాన్స్

KAAKA నుంచి క్రేజీ అప్డేట్

మధుబాబును సస్పెండ్ చేసిన కూటమి ప్రభుత్వం ఉద్యోగ సంఘాల ఆగ్రహం

ఉండ్రాజవరంలో హైటెన్షన్.. పోలీసులకు వంగవీటి కూతురు మాస్ వార్నింగ్

Photos

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఇంకా కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు.. ట్యాంక్ బండ్ వద్ద భారీ క్యూ...(ఫొటోలు)

+5

చూడప్పా సిద్ధప్పా.. సింహం గడ్డం గీసేసిందప్పా! (ఫొటోలు)

+5

'సిగ్మా' సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)

+5

ఖైరతాబాద్ గణేశుడి సేవలో టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)

+5

హైదరాబాదులో వినాయక నిమజ్జనం సందడి..(ఫొటోలు)

+5

ఖైరతాబాద్‌ మహా గణపతి నిమజ్జనం దృశ్యాలు..(ఫొటోలు)

+5

'ప్యారడైజ్'లో సమ్మక్క పాత్ర.. నటి జ్ఞాపకాలు (ఫొటోలు)