Breaking News

మోదీ మెచ్చిన 'బగురుంబ'..! అచ్చం సీతకోక చిలుకలా..

Published on Thu, 01/22/2026 - 17:18

ప్రకృతిని పూజించడం, ఆరాధించడం ఇవాళ్టిదేం కాదు.. మనిషి జీవితంలోని ప్రతిదశ ప్రకృతితో ముడిపడిపోయి ఉంటుంది. అంతలా పెనువేసుకుపోయారు మనిషి, ప్రకృతి. ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ప్రకృతితో అనుబంధాన్ని ఏర్పరుచుకున్నారు. అలా ప్రకృతిని ఆరాధించే అస్సాం రాష్ట్రానికి చెందిన ఒక సంప్రదాయ నృత్యమే బగురుంబ. మరి ఆ నృత్యం విశేషాలేంటో సవివరంగా తెలుసుకుందామా..!.

అస్సాం ప్రజలకు ప్రకృతి అంటే కేవలం ఒక వనరుకాదు, ఒక జీవనాధారం. వారి నృత్యం, పాట, పండుగ, అన్నీ పచ్చదనం చుట్టూనే తిరుగుతాయి. అలా ప్రకృతితో మమేకమయి చేసే ప్రసిద్ధ నృత్యం బగురుంబ నృత్యం. అతిపెద్ద గిరిజన తెగ అయిన బోడో ప్రజల సంప్రదాయ నృత్యం ఇది. ఈ నృత్యంలో మహిళలు తమ చేతుల్లో రంగురంగుల కండువాలను పట్టుకుని రెండు చేతులు చాచి ఎగురుతున్న సీతాకోక చిలుకల వలె కదులుతారు. అందుకే దీనిని సీతాకోక చిలుక నృత్యం అని కూడా పిలుస్తారు.

వసంతాన్ని ఆహ్వానిస్తూ..
ప్రకృతి పట్ల బోడో ప్రజలకున్న గౌరవానికి చిహ్నం బగురుంబ. వసంత రుతువు రాకను ఆహ్వానిస్తూ, ప్రకృతి అందాలను కొనియాడుతూ ఏప్రిల్‌ నెలలో ఈ నృత్యాన్ని ప్రదర్శిస్తారు. ఈ నృత్యం చేసేటపుడు స్త్రీలు దోఖానా అనే సంప్రదాయ చీర, జ్వమ్గ్రా అనే కండువాను ధరిస్తారు. వీరు సాధారణంగా పసుపు, ఎరుపు, ఆకుపచ్చ రంగులకు ప్రాధాన్యత ఇస్తారు. ఈ నృత్యానికి తోడుగా పురుషులు వెదురు ఫ్లూట్, డ్రమ్, వయోలిన్, జోటా, తార్ఖా వంటి వాయిద్యాలను వాయిస్తారు.

ప్రధాని ప్రశంస
ఇటీవలే గువాహటిలోని సరుసాజై స్టేడియంలో 10,000 మంది బోడో మహిళా కళాకారులు ఏకకాలంలో ఈ బగురుంబ నృత్యాన్ని ప్రదర్శించి ప్రపంచ రికార్డు సృష్టించారు. ఈ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వయంగా వీక్షించి ప్రశంసించారు. బిహు నృత్యం కూడా అస్సాంలో చాలా ప్రసిద్ధమైనది. ఇది వసంత కాలాన్ని, పంటల సాగును సూచిస్తుంది. ఈ రెండు నృత్యాలు అస్సాంలోని వైవిధ్యమైన సంస్కృతిని చాటి చెబుతాయి.

 

(Beauty Tips: కళ్ల కింద నలుపు తగ్గాలంటే..!)

 

Videos

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)