Breaking News

గర్భంలోనే నాన్న మాటలకు స్పందించింది..షాక్‌లో తండ్రి! వీడియో వైరల్‌

Published on Mon, 08/03/2026 - 14:09

సినిమాల్లోనూ, టీవీల్లోనూ చూస్తుంటాం ఇలాంటి ఘటనలు. హీరో ప్రెగ్నెంట్‌తో ఉన్న హీరోయిన్‌ కడుపు దగ్గరగా వచ్చి మాట్లాడుతుంటే..కిక్‌ ఇవ్వడం, స్పందించడం వంటివి చూస్తుంటాం. అలాంటి అరుదైన దృశ్యం రియల్‌గా చోటుచేసుకుంది. పేరెంట్స్‌ సైతం విస్తుపోయారు తమ పుట్టబోయే పాపాయి స్పందన చూసి..

ఈ విచిత్ర ఘటన కెనడాలో చోటు చేసుకుంది. లియా ఒలివెరా అనే మహిళ తన భాగస్వామితో కలిసి ఒక సాధారణ ప్రినేటల్ అల్ట్రాసౌండ్ చెకప్ కోసం ఆసుపత్రికి వెళ్లారు. స్కానింగ్ జరుగుతున్న సమయంలో ఆ మహిళ భర్త ఎంతో ప్రేమగా ఆమె కడుపుపై ముద్దుపెట్టుకుని తమ కాబోయే పాపతో మాట్లాడడం ప్రారంభించారు. 

"గుడ్ మార్నింగ్.. హ్యాపీ శనివారం, నీకు ఆకలిగా ఉందా?" అంటూ ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. అయితే ఆ తండ్రి గొంతు విని వెంటనే.. అల్ట్రాసౌండ్ స్క్రీన్ పై కనిపించిన చిన్నారి ముఖంలో అద్భుతమైన మార్పు చూసి అక్కడున్ను వారంతా కంగుతిన్నారు. నాన్న మాటలకు ఆ పాపాయి చిరునవ్వుతూ స్పందించింది. ఆ అద్భుతమైన దృశ్యాన్ని కెమెరాలో బంధించి..సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. 

దాంతో ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.  ఈ మేరకు తల్లి లియా ఒలివెరా మాట్లాడుతూ.. తన జీవితంలో ఇది ఎప్పటికీ మర్చిపోలేని మధుర జ్ఞాపకం అంటూ భావోద్వేగానికి గురైంది. పుట్టబోయే బిడ్డతో పేరెంట్స్‌కి ఎంతలా బాండింగ్‌ ఉంటుందో ఈ ఘటన నిరూపించిందంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఇది యాదృశ్చికమైనదే అయినా..ఈ అద్భుత దృశ్యం వేలాది మంది హృదయాలను గెలుచుకోని..అందరి ముఖాల్లో నవ్వులు విరిసేలా చేసింది.

 

 

(చదవండి: తొలి లేడీ డిటెక్టివ్‌..! ఆఖరికి పెళ్లి గురించి కూడా...)

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)