Breaking News

మీ బ్రెయిన్‌ ఆక్టివ్‌గా ఉండాలంటే.. ఇలా చేయండి!

Published on Sat, 05/11/2024 - 12:52

శరీరంలో ముఖ్యమైన భాగాల్లో మెదడు ఒకటి. మెదడు ఆదేశాల ప్రకారమే శరీరంలోని అన్ని భాగాలు పనిచేస్తాయి. మెదడు సరిగ్గా పని చేయకపోతే... మనిషి ఏ పనీ సరిగ్గా చేయలేడు. అలాంటి మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే.. మనం కొన్ని చెయ్యాలి... మరికొన్నింటిని తినాలి... అవేంటో చూద్దాం...

దేనినైనా సరే, సరిగ్గా పని చేయిస్తేనే అది సక్రమంగా పని చేస్తుంది. ఎన్ని వేలు పోసి కొన్న యంత్రాన్నైనా సరే, దానితో పని చేస్తేనే కదా అది సరిగ్గా పనిచేసేదీ లేనిదీ తెలిసేది! అందువల్ల మెదడు సరిగ్గా పని చేయాలంటే దానికి ఎప్పుడూ తగిన పని చెబుతూనే ఉండాలి. అదేవిధంగా మెదడు చురుగ్గా పని చేయాలంటే కొన్ని రకాలైన ఆహార పదార్థాలను తీసుకోవాలి.

  • ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌: మెదడు సరిగ్గా పని చేయాలంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ తీసుకోవడం అవసరం. ఎందుకంటే ఈ ఫ్యాటీ యాసిడ్స్‌ మెదడు కణాల మధ్య కమ్యూనికేషన్‌ ను ప్రోత్సహిస్తాయి. తృణ ధాన్యాలు కూడా మెదడును ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

  • యాంటీ ఆక్సిడెంట్లు: ఇవి కూడా మెదడు కణాలను ఒత్తిడి, వాపు నుంచి రక్షించడంలో సహకరిస్తాయి. విటమిన్‌ బి12 లోపిస్తే నరాల బలహీనతకు దారితీయవచ్చు. కాబట్టి మీ డైట్‌లో విటమిన్‌ బి12  ఉండేలా చూసుకోండి.

  • అదే విధంగా అధికంగా చక్కెర తీసుకోవడం వల్ల మెదడు పనితీరు మందగిస్తుంది.  ఫలితంగా జ్ఞాపకశక్తి తగ్గి మతి మరపు పెరుగుతుంది. కాబట్టి షుగర్‌ తక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవడం ఉత్తమం. అదేవిధంగా హైడ్రేట్‌గా ఉండటం వల్ల మెదడు చురుగ్గా ఉంటుంది.

  • అరోమా: కొన్ని రకాల మూలికలు, సుగంధ ద్రవ్యాలు మెదడు కణాలను పరిరక్షించే  సమ్మేళనాలను కలిగి ఉంటాయి, ఇవి ఐక్యూని మెరుగుపరుస్తాయి. కాబట్టి మీ ఆహారంలో పసుపు, దాల్చిన చెక్క, రోజ్‌ మేరీ వంటివి ఉండేలా చూసుకోండి.

  • ఇవిగాక మెదడును చురుగ్గా ఉంచేలా పదవినోదాలు, పదవిన్యాసాలు పూర్తి చేయడం, సుడోకు వంటివి ఆడటం, క్యారమ్స్, చదరంగం వంటి ఇన్‌డోర్‌ గేమ్స్‌ ఆడటం, రోజూ కొన్ని పదాలను గుర్తు పెట్టుకోవాలనే నియమాన్ని పెట్టుకుని దానిని సరిగ్గా అనుసరించడం వల్ల మెదడు చురుగ్గా ఉంటుంది.

ఇవి చదవండి: Shipra Singhania: సిమెంట్ వాడకుండా.. గోరువెచ్చని ఇల్లు!

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)