Breaking News

స్వలింగ వివాహం చేసుకున్న విదేశాంగ మంత్రి!

Published on Sun, 03/17/2024 - 16:10

విదేశాంగ మంత్రి అయిన ఆమె దేశంలోనే తొలి మహిళా గే పార్లమెంటేరియన్‌గా ఆశ్చర్యపరిచింది. ఇలా తాను స్వలింగ సంపర్కురాలిని అని బహిరంగ పర్చడమే గాకుండా తన చిరకాల భాగస్వామిని పెళ్లి చేసుకుంటున్నట్లు ప్రకటించింది. ఇంతకీ ఎవరంటే ఆమె..

ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్‌ దేశంలోనే తొలి స్వలింగ మహిళా పార్లమెంటేరియన్‌. ఆమె తన భాగస్వామి సోఫీ అల్లౌచెతో దాదాపు రెండు దశాబ్దాలుగా కలిసే ఉంటోంది. ఇక తమ బంధాన్ని పెళ్లితో మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయించుక్నునట్లు పేర్కొంది వాంగ్‌. తన కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో విదేశాంగ మంత్రి వాంగ్‌ స్వలింగ వివాహం చేసుకున్నారు.

ఇలా తమ వివాహం తమ కుటుంబ సభ్యుల సమక్షంలో జరగడం మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉందని తెలిపింది వాంగ్‌. అందుకు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రాంలో షేర్‌ చేసింది. ఈ జంట దక్షిణ ఆస్ట్రేలియా రాజధాని అడిలైడ్‌లోని వైనరీలో గత రెండు దశాబ్దాలుగా కలిసి ఉన్నారని, శనివారమే పెళ్లితో ఒక్కటయ్యారని స్థానిక మీడియో పేర్కొంది. ఇక వాంగ్‌ సెనేట్‌లో దక్షిణ ఆస్ట్రేలియా రాష్ట్రానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

2002 నుంచి లేబర్‌ సెనేటర్‌గా ఆస్ట్రేలియా క్యాబినేట్‌ పదవిని పొంది తొలి ఆసియా వ్యక్తిగా వాంగ్‌ నిలిచింది. అయితే 2017లో ఆస్ట్రేలియాలో స్వలింగ వివాహం చట్టబద్ధం అయింది. ఈ నేపథ్యంలో తమ వివాహాన్ని బహిరంగంగా వెల్లడించింది వాంగ్‌. ఆస్ట్రేలియాలో దాదాపు 1997 వరకు అన్ని రాష్ట్రాల్లో స్వలింగ సంపర్కంని నేరంగా భావించేది. 

View this post on Instagram

A post shared by Penny Wong (@senatorpennywong)

(చదవండి: పద్నాలుగేళ్ల వయసులోనే దేశాధ్యక్షుడు)

#

Tags : 1

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)