రికార్డు... ‘కేక’

Published on Sun, 07/12/2026 - 06:05

యుద్ధాల్లో పాల్గొనే వీరులు సింహనాదాలు చేసేవారని పురాణాల్లో చదువుకున్నాం. అడవిలోని సింహం గర్జిస్తే, ఆ గర్జన ఏకంగా ఐదు కిలోమీటర్ల దూరం వరకు వినిపిస్తుంది. అడవి అడవంతా ప్రతిధ్వనిస్తుంది. సింహగర్జన శబ్దం 114 డెసిబల్స్‌ ఉంటుంది. సింహగర్జనను మించిన శబ్దంతో పెనుకేక పెట్టి ఆస్ట్రేలియన్‌ పెద్దమనిషి ఒకరు గిన్నిస్‌ రికార్డు బద్దలు కొట్టాడు. ఆస్ట్రేలియాలోని కాన్‌బెర్రాకు చెందిన జోసెఫ్‌ మెక్‌గ్రాల్‌ బేటప్‌ అనే 58 ఏళ్ల వ్యక్తి ‘నౌ’ అని పెనుకేక పెట్టాడు.

ఆ కేక శబ్దం 122.4 డెసిబల్స్‌. అతడి కేకకు దెబ్బకు గిన్నిస్‌ రికార్డు బద్దలైంది. అంతకు ముందు 1994లో నార్త్‌ ఐర్లండ్‌ టీచర్‌ అనాలీసా ఫ్లాంగన్‌ ఇలాగే పెనుకేక పెట్టింది. ఆ శబ్దం 121.7 డెసిబల్స్‌గా నమోదై గిన్నిస్‌ రికార్డుకెక్కింది. ఇన్నాళ్లకు జోసెఫ్‌ పెట్టిన పెనుకేక ఆ రికార్డును అధిగమించింది. రికార్డు బద్దలు కొట్టాలనే ఉద్దేశంతో జోసెఫ్‌ అంత పెద్ద పెనుకేక వేశాడు గాని, ఆ తర్వాత కొద్దిరోజులు అతడి గొంతు బొంగురుపోయింది.

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)