Breaking News

ఈ ఏడు రోజులే అత్యంత బలమైన ముహూర్తాలు!

Published on Sat, 06/27/2026 - 09:03

హిందూ సంప్రదాయంలో ఏ పని తలపెట్టిన శుభ ముహూర్తాలు  చూసుకోవడం ఆనవాయితీ. కొత్త వస్తువులు, వాహనాలు కొనాలన్నా మంచి రోజులు ఉండాల్సిందే. అలాంటిది జీవితంలో అత్యంత ప్రధానమైన వివాహాలు, గృహప్రవేశాల విషయంలో నక్షత్ర, రాశి బలాలకు సరిపడా ముహుర్తాలపై ప్రజలకు అచంచల విశ్వాసం  ఉంటుంది. అయితే గత మే 14న అధిక జ్యేష్టమాసం ప్రారంభం కావడంతో నెల రోజులుగా శుభకార్యాలకు బ్రేక్‌ పడింది.  

తాళికట్టు శుభవేళ.. 
ఈ నెల 15తో శూన్యమాసం ముగిసింది. 16 నుంచి నిజ జ్యేష్టమాసం ప్రారంభమైంది. జూన్‌  27, 28, జూలై 1, 2, 3, 4, 5, 8, 9 తేదీలలో అత్యంత బలమైన ముహూర్తాలు ఉన్నాయని జ్యోతిష పండితులు చెబుతున్నారు. ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబర్‌ మాసాల్లోనూ మంచి ముహుర్తాలు ఉన్నాయని అంటున్నారు.  

వ్యాపారాలు కళకళ.. 
నెలరోజులుగా ముహూర్తాలు లేకపోవడంతో కల్యాణ మండపాలు, కేటరింగ్, టెంట్‌ హౌస్‌లు, డెకరేషన్, పూల వ్యాపారులు, పురోహితులు, బంగారం షాపులు, వస్త్రవ్యాపారులు, ఫొటోగ్రాఫర్ల వ్యాపారాలు మందగించాయి. చాలా మంది కారి్మకులకు ఉపాధి కరువైంది. జూన్‌ 19 నుంచి మళ్లీ సీజన్‌ ప్రారంభం కానుండటంతో ఈ అనుబంధ వ్యాపారాలన్నీ ఊపందుకుంటాయని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.  

రెండు వేల వరకు వివాహాలు  
నెల రోజుల తర్వాత ముహూర్తాలు మొదలవడంతో జిల్లా వ్యాప్తంగా సుమారు 2వేల వరకు పెళ్లిళ్లు జరిగే అవకాశాలు ఉన్నాయి. దీంతో వధూవరులకు కావలసిన వస్త్రాలు, పట్టుచీరలు కొనేందుకు తల్లిదండ్రులు, బంధువులు షాపులకు క్యూ కడుతున్నారు. కిరాణా దుకాణాలలో కూడా వ్యాపారాలు జోరుగా సాగుతున్నాయి.   

‘బంగారం’ లాంటి చాన్స్‌ 
పెళ్లికి ముఖ్యమైనది బంగారం. దాని ఖరీదు పెరుగుతున్నా తప్పని సరిగా బంగారం పెట్టాల్సిందే. స్వర్ణాభరణాల ధరలు పెరుతున్నా పెళ్లికి అతిముఖ్యంగా కావలసిన తాళిబొట్టు, మట్టెలు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీంతో కొందరు బంగారం షాపుల వద్ద చేరి వీటిని ముందుగా ఆర్డర్‌ ఇచ్చి చేయించుకుంటున్నారు. మరికొందరు  బంగారం ముక్క కొనుగోలు చేసి తమకు తెలిసిన తయారీదారుని వద్ద వెళ్లి ఆర్డర్‌ ఇస్తున్నారు.  

జ్యేష్టమాసం విశేషమైంది 
జ్యేష్టమాసం అన్ని మాసాలలోకి విశేషమైంది. బ్రహ్మదేవునికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసం. నిజ జ్యేష్ట మాసంలో వివాహాది శుభ కార్యక్రమాలు యధావిధిగా నిర్వహిస్తారు. చాలా మంది వివాహాలు చేసుకునేందుకు సన్నద్ధమవుతున్నారు.  
– తెన్నేటి విక్రమశర్మ, ప్రకాశరాయ జ్యోతిషాలయం  

ముహూర్తాల కోసం వస్తున్నారు.. 
నెలరోజులుగా ముహూర్తాలు లేక చేతిలో పనులు లేవు. ఎట్టకేలకు శుభ ముహూర్తాలు మొదలు కావడంతో వివాహాది శుభకార్యాలు చేయించుకునేందుకు మావద్దకు వస్తున్నారు. తేదీలు ముందుగా బుక్‌ చేసుకుంటున్నారు. 
– పి.నర్సింహమూర్తి, పురోహితులు, శ్రీకాకుళం  

Videos

చెత్త వేయొద్దన్నందుకు GHMC మహిళపై దాడి!

భాగ్యరాజ్ మృతిపై YS జగన్ సంతాపం

వాడి గురించి మాట్లాడటం కూడా వెస్ట్.. మహాసేన రాజేష్ కి కౌంటర్

సూసైడ్ కాదు.. హత్య..! లైవ్ లో బయటపెట్టిన అక్కాచెల్లెళ్లు

సోమవారం హైకోర్టు కీలక తీర్పు..లాకప్ డెత్ కేసులో మరో పిటిషన్..

ఇదే గుర్తుపెట్టుకోండి.. బండరాయితో YSRCPపై దాడి శైలజానాథ్ సీరియస్ వార్నింగ్

కారుపై రాళ్లతో దాడి చేసిన టీడీపీ గూండాలు.. టెన్షన్ టెన్షన్

విశాఖలో భీకర వర్షం.. APలో రెండు రోజులు వానలే వానలు

మరో పేపర్ లీక్ ఘటన.. మహారాష్ట్రలో 'టెట్' వాయిదా

నీ జీతం 6 లక్షలు.. ఇంకో 19 లక్షలు అకౌంట్ లో పడుతున్నాయి

Photos

+5

నిర్మాతగా అల్లు అర్జున్ ఫ్రెండ్.. 'జోకర్' మూవీ లాంచ్ (ఫొటోలు)

+5

భాగ్యరాజ్‌కు నివాళి అర్పించిన కోలీవుడ్ సెలబ్రిటీలు (ఫొటోలు)

+5

తెరపై నవ్వు.. తెర వెనుక విజన్‌.. భాగ్యరాజ్‌ అరుదైన (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్ కీర్తి సురేష్ (ఫొటోలు)

+5

తిరుమలలో శాస్త్రోక్తంగా ప్రారంభమైన శ్రీవారి జ్యేష్ఠాభిషేకం (ఫొటోలు)

+5

‘దీవాన’ సినిమా థ్యాంక్స్‌ మీట్‌ (ఫొటోలు)

+5

నెల్లూరు : ఘనంగా రొట్టెల పండుగ ప్రారంభం (ఫొటోలు)

+5

గ్రాండ్‌గా నటి ఖుష్బూ కూతురి పెళ్లి (ఫొటోలు)

+5

మృణాల్.. అందగత్తెలకే అసూయ పుట్టించేస్తూ (ఫొటోలు)

+5

హెబ్బా పటేల్.. జూన్ జ్ఞాపకాలు (ఫొటోలు)