Breaking News

సముద్ర గర్భంలో సాహసతార

Published on Tue, 06/30/2026 - 06:16

స్కూటీ డ్రైవింగ్‌కు, స్కూబా డైవింగ్‌కు తేడా తెలియని చిన్న గ్రామంలో పుట్టి పెరిగింది అతుల్య. స్కూబా డైవింగ్‌ గురించి తెలుసుకోవడానికి ఆమెకు చాలాకాలమే పట్టింది. అయితే... భవిష్యత్‌ కాలాలు కూడా గుర్తు పెట్టుకునే విజయాలను స్కూబా డైవింగ్‌లో సాధించింది. స్కూబా డైవింగ్‌ శిక్షణ పూర్తి చేసిన కేరళకు చెందిన మొదటి మహిళగా, కమర్షియల్‌ స్కూబా డైవింగ్‌లో ఐఎన్‌సీఏ సర్టిఫికేషన్‌ పొందిన మొదటి భాతీయురాలిగా రికార్డ్‌ సృష్టించింది...

సముద్రం ఇప్పటికీ ఒక అంతచిక్కని రహస్యమే. పాలక్కాడ్‌కు చెందిన 29 ఏళ్ల అతుల్య బెల్గాడ్‌కు ఆ రహస్య ప్రపంచంలోకి తొంగిచూడాలనే ఆసక్తి ఒక శక్తిగా మారింది. ఆ శక్తితోనే మహిళలకు తక్కువ ప్రాతినిధ్యం ఉన్న స్కూబాడైవింగ్‌లో తనదైన గుర్తింపు తెచ్చుకునేలా చేసింది. నీటి అడుగున చేసే కమర్షియల్‌ డైవింగ్‌ అనేది పైప్‌లైన్‌లు, ఇంటర్నెట్‌ కేబుళ్ల నిర్వహణ, వెల్డింగ్‌...మొదలైన వాటికి సంబంధించిన సాంకేతిక వృత్తి. దీనికి శారీరక బలం, సముద్రంపై అవగాహన, క్రమశిక్షణ అవసరం.

మహిళలు ఒక్కరూ లేరు!
త్రిస్సూర్‌లోని సెయింట్‌ మేరీస్‌ కాలేజీలో బీఏ చదువుతున్న రోజుల్లో స్కూబాడైవింగ్‌ గురించి తొలిసారిగా విన్నది అతుల్య. స్కూబాడైవింగ్‌లో మహిళల ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉందనే విషయం కూడా తెలుసుకుంది. ఆ సమయంలోనే ‘నేను ఎందుకు ప్రయత్నించ కూడదు!’ అని ఆలోచించి స్కూబాడైవింగ్‌పై ఆసక్తి పెంచుకుంది.

‘నీటి అడుగున ఉన్న ప్రపంచాన్ని అన్వేషించాలనే ఆలోచన నన్ను ఎంతగానో ఆకర్షించింది. సముద్రగర్భంలో ఏముందో చూడాలనే ఆసక్తి అంతకంతకూ పెరుగుతూ పోయింది’ అంటున్న అతుల్యకు ఈత కొట్టడంలో మంచి ప్రావీణ్యం ఉంది. స్కూబా డైవింగ్‌ను కెరీర్‌గా ఎంచుకోవడానికి సంబంధించి తల్లిదండ్రులను ఒప్పించింది. వారు ఓకే అనడంతో మరింత ధైర్యం వచ్చింది. స్కూబా డైవింగ్‌ కోసం కోవలం వెళ్లింది. మహిళలు ఒక్కరూ కనిపించలేదు! 

ఏవేవో భయాలే ఉండేవి. అయితే శిక్షణ సజావుగా సాగింది. ఆ తరువాత కమర్షియల్‌ స్కూబాడైవింగ్‌లో శిక్షణ కోసం దక్షిణాఫ్రికాకు వెళ్లింది. అక్కడే కమర్షియల్‌ స్కూబాడైవింగ్‌లో సర్టిఫికేషన్‌ పొందింది. కేరళకు తిరిగి వచ్చిన తరువాత మూడు సంవత్సరాల పాటు కోస్టల్‌ పోలీసులకు ట్రైనర్‌గా పనిచేసింది.
ఆ తరువాత అండమాన్‌లో సంవత్సరం పాటు పనిచేసింది. ఆ సమయంలో అతుల్య పనితీరును గమనించిన దక్షిణాఫ్రికాలోని ఒక డైవింగ్‌ కంపెనీ ఆమెను సంప్రదించింది. అలా ఆమె దక్షిణాఫ్రికా ప్రయాణం మొదలైంది.

ఆహ్లాదమే కాదు... ప్రమాదం కూడా!
సముద్రగర్భ ప్రయాణాలు ఎంత ఆహ్లాదకరమైనవో అంతే ప్రమాదకరమైనవి కూడా. ‘ప్రమాదాలకు దూరంగా ఉండడానికి ప్రతి డైవ్‌కు ముందు ఆ వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేస్తాను’ అంటున్న అతుల్య ‘నీటి అడుగున దేనినీ తాకరాదు’ అనే నియమాన్ని కచ్చితంగా పాటిస్తుంది. స్టోన్‌ఫిష్‌ అచ్చం రాయిలాగే కనిపిస్తుంది. మనం దానిని తాకితే, దాని విషపూరితమైన ముళ్లతో తీవ్రమైన గాయమై ఇన్‌ఫెక్షన్‌ వస్తుంది. దాని కాటుకు సరిౖయెన చికిత్స చేయకపోతే పరిస్థితి ప్రమాదకరంగా మారుతుంది. ‘సముద్రపు అడుగున ఉన్న ఏదీ మనకు చెందినది కాదు. మనలాగే అక్కడ నివసించే జీవులకు కూడా వాటి సొంత జీవితాలు ఉంటాయి. మనం వాటికి ఆటంకం కలిగించకూడదు. వాటి స్థలాన్ని మనం గౌరవించాలి’ అంటుంది అతుల్య.

తన సాహసాలను సముద్రం దగ్గరే ఆపాలనుకోవడం లేదు అతుల్య. ‘జీవితంలో మరిన్ని సాహసాలు చేయాలనుకుంటున్నాను. దీనికోసం కొన్ని లక్ష్యాలను ఏర్పాటు చేసుకున్నాను. కేరళలో ఒక స్కూబా డైవింగ్‌ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఉంది’ అంటుంది అతుల్య.
 
అది నిజం కాదు!
‘సాధారణంగా మేము సుమారు 50 మీటర్‌ల లోతు వరకు డ్రైవ్‌ చేస్తాము. నీటి అడుగున స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను తీసుకువెళ్తామని చాలామంది అనుకుంటారు. కాని అది నిజం కాదు’ అంటుంది అతుల్య. వారు ఉపయోగించే గాలిలో 21 శాతం ఆక్సిజన్, 79 శాతం నైట్రోజన్‌ ఉంటాయి. నిర్దిష్ట లోతుకు మించి స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను ఉపయోగిస్తే అది విషపూరితంగా, ప్రమాదకరంగా మారుతుంది. లోతైన డైవ్‌ల కోసం హీలియం మిశ్రమాలను ఉపయోగిస్తారు. కొన్ని డైవ్‌ల తరువాత గొంతు మారే అవకాశం ఉంటుంది.

చరిత్ర గర్భంలోకి!
కోజికోడ్‌ సమీపంలో కుంజలి మారక్కర్‌ చరిత్రతో సంబంధం ఉందని నమ్మే ప్రాంతంలో డైవ్‌ చేస్తున్నప్పుడు రాళ్లతో మూసివేయబడిన అనేక పురాతన కట్టడాలను అతుల్య చూసింది. తిరువనంతపురంలో డైవ్‌ చేస్తున్నప్పుడు గుహల ప్రవేశద్వారాల్లా కనిపించే ఒక కట్టడాన్ని చూసింది. ‘సముద్ర గర్భం ఒక రహస్య భాండాగారం లాంటిది. ఈ ప్రదేశాలను మనం లోతుగా అధ్యయనం చేస్తే తెలియని విషయాలెన్నో కనుగొనవచ్చు’ అంటుంది అతుల్య.

మరో ప్రపంచంలోకి...
ఆసక్తి, ధైర్యం, శారీరక బలం ఉంటే ఎవరైనా కమర్షియల్‌ స్కూబా డైవింగ్‌ చేయవచ్చు. నీటి అడుగులోకి వెళ్లినప్పుడు అత్యంత సుందర దృశ్యాలు కనిపిస్తాయి. బయట మనం ఎప్పుడూ, ఎక్కడా చూడని రంగులు, అద్భుతాలు కనువిందు చేస్తాయి. చేపలు గుంపులుగా కలిసి తిరగడం, ఆక్టోపస్‌ రంగు మార్చుకోవడం చూడటం వంటివి అద్భుతమైన అనుభవాలు. నీటి అడుగున ఉన్న ప్రతిదానికి ఒక ప్రత్యేకమైన అందం ఉంది. దీనితోపాటు ప్రమాదాలు కూడా ఉంటాయి. బలమైన ప్రవాహాలు, సుడిగుండాలు, నీటి అడుగున విద్యుత్‌తీగలు, స్టోన్‌ఫిష్, స్ట్రింగే, లయన్‌ఫిష్‌ వంటి ప్రమాదకరమైన సముద్ర జీవులు, వీటితో పాటు కఠినమైన వాతావరణ పరిస్థితులు స్కూబా డైవింగ్‌ను సవాలు చేస్తాయి. లోతుకు వెళ్లే కొద్దీ చుట్టూ చీకటి ఆవహిస్తుంది. దారి తెలుసుకోవడానికి టార్చ్‌లైట్‌ మాత్రమే అందుబాటులో ఉంటుంది. పదునైన రాయిలాంటి చిన్న వస్తువు కూడా ప్రమాదకరంగా మారవచ్చు. డైవింగ్‌ చేస్తున్నప్పుడు భద్రతకు సంబంధించిన ఆలోచనలు వస్తూ పోతుంటాయి.
– అతుల్య

Videos

నిప్పుల కొలిమిగా యూరప్... పిట్టలా రాలిపోతున్న జనాలు!

2029లో మీరు రాజారెడ్డి మనవడిని చూస్తారు..! ఒక్కొక్కడికీ ఊచకోతే..!

జులైలో వానలు! విశాఖ IMD గుడ్ న్యూస్

YS జగన్ ను కలిసిన సింగపూర్ కాన్సులేట్ జనరల్

కేతన్ హత్య కేసులో బయటపడుతున్న కీలక ఆధారాలు.. మరో సంచలన ట్విస్ట్!

మినిమం కామన్ సెన్స్ లేదా... ఏమ్మా హోమ్ మినిస్టర్, ఏం చేస్తున్నావ్..!

High Tension: చంద్రబాబు ఇంటిని ముట్టడి బారు గేట్లు లాగిపడేసిన రైతులు

సాయికృష్ణ కేసులో RMP డాక్టర్ చెప్పిన నమ్మలేని నిజాలు

ఫేస్ యాప్ దుర్వినియోగం? ఉపాధి హామీలో టీడీపీ అక్రమాలు

రికార్డులు బద్దలు కొట్టిన సమంత.. అనుష్కను దాటేసింది!

Photos

+5

అక్కినేని అఖిల్‌ ‘లెనిన్‌’ మూవీ HD స్టిల్స్‌

+5

‘హ్యాంగ్‌మ్యాన్’ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

‘ఆల్ఫా’ మూవీ ప్రమోషన్‌లో సందడి చేసిన అలియా భట్ (ఫొటోలు)

+5

గ్లామరస్‌గా సింగ్ గీతం బ్యూటీ నివేదా పేతురాజ్.. (ఫోటోలు)

+5

రొట్టెల పండగ : స్వర్ణాల తీరం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

అందాల అదితీ రావు హైదరీ (ఫొటోలు)

+5

రకుల్.. అదిరెన్ నీ సొగసులు! (ఫొటోలు)

+5

లార్డ్స్ మైదానంలో సందడి చేసిన కోహ్లి-ధావన్ ఫ్యామిలీస్! (ఫోటోలు)

+5

ఫ్యామిలీతో హీరోయిన్ మధుబాల స్పెషల్ మూమెంట్స్ (ఫొటోలు)

+5

బాలీవుడ్ భామ ప్రగ్యా కపూర్ బర్త్‌ డే.. తమన్నా సందడి (ఫోటోలు)