ఒంటరిగా ఫ్లైట్‌ జర్నీ..ఆమె జీవితాన్నే మార్చేసింది..!

Published on Sat, 08/01/2026 - 11:28

ఒక్కోసారి మనం ఎదుర్కొనే పరాజయాలు మనల్ని ఎంతలా కుంగదీస్తాయంటే..ప్రతి చిన్నదానికి భయపడిపోయేలా చేస్తాయ్‌. ఇంతకు ముందున్నుట్లుగా ఆత్మవిశ్వాసంగా ఉండనివ్వవు. అంతేగాదు ప్రతి పనిలో ఆటంకం కూడా..భయం, ఆందోళనకు దారితీస్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే మన మానసిక పరిస్థితి అత్యంత బలహీనంగా అయిపోతుంది. ఆ స్థితి నుంచి ఓ పట్టాన బయపడలేం. సరిగ్గా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోందో ఓ 32 ఏళ్ల మహిళ. ఆ దారుణమైన మానసిక పరిస్థితి నుంచి బయటపడేందుకు ఆమె ఏం చేసిందంటే..

గౌహతికి చెందిన 32 ఏళ్ల పూజా దాస్‌ మహిళ గత కొంతకాలంగా బ్యాంకు పరీక్షల కోసం సన్నద్ధమై ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయింది. దాంతో తీవ్రమైన ఆందోళన, డిప్రెషన్‌కి గురవ్వడమే కాదు, అనారోగ్య సమస్యలు కూడా చుట్టుముట్టాయి. దాంతో ఆమె ఇదివరకటిలా ధైర్యంగా ఎక్కడకి వెళ్లలేకపోతోంది. కనీసం ఏ పనిచేసినా..జరగకపోతే తీవ్రంగా ఆందోళన చెందడం, నా బతికింతే అన్నట్లుగా ఆ‍త్మనూన్యత భావానికి గురయ్యేది. అలా ఒక్కోసారి చచ్చిపోవాలనేకునేంత స్టేజ్‌కి కూడా వెళ్లిపోయేది కూడా. బ్యాంకు ఉద్యోగాన్ని సంపాదించలేకపోయానన్న బాధ ఆమెను అంతలా కుంగదీసింది. 

ఆ తర్వాత ఆమె ఆ ప్రయత్నాన్ని విరమించుకుని కంటెంట్‌ క్రియేటర్‌గా మారి ఆన్‌లైన్‌లో వీడియోలు పోస్ట్‌ చేస్తూ సంపాదించడం మొదలు పెట్టినా..ఎందుకో ఆ భయం, బెరుకు ఆమెను వదలి వెళ్లడం లేదు. ముఖ్యంగా అబ్సెసివ్-కంపల్సివ్ డిజార్డర్ (OCD) కారణంగా తీవ్రమైన ఆందోళనతో ఇబ్బంది పడుతుండేది. ఈ సమస్య నుంచి బయటపడాలని తనకు తాను ధైర్యం తెచ్చుకుని ఓ అడుగు ముందుకేసింది. అందుకోసం తాను సోలోగా ఫ్లైట్‌ జర్నీ చేయాలని నిర్ణయించుకుంది. 

ఎందుకంటే ముందుగా ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లడం నుంచి అక్కడ జరిగే తనిఖీల వరకు ప్రతీదీ తానే స్వయంగా నిర్వహించుకోవాలని డిసైడ్‌ అయ్యింది. ఆ క్రమంలో ఎదురయ్యే టెన్షన్‌, ఒత్తిడి అన్నింటిని అధిగమించాలనే ఇలా చేసింది. అదేంటో ఆమె ఒక్కత్తే వెళ్లి తిరిగి వచ్చేసింది. పైగా తన భర్తకు నేరుగా ఎయిర్‌పోర్ట్‌కి వచ్చేదాక కాల్‌ చేయలేదు. అది చూసి ఆమె భర్త సైతం ఆశ్చర్యపోయారు. ఎందుకంటే..ఎప్పుడైనా.. ఎక్కడికైనా.. ఒంటిరిగా వెళ్లితే..ఓ వందసార్లుకు పైగా కాల్‌ చేస్తుంది. 

అలాంటిది ఈసారి సోలోగా ఫ్లైట్‌ జర్నీ చేసినా..అంతలా భయపడలేదు, పైగా ఎక్కవ సార్లు భర్తకు కాల్‌ కూడా చేయలేదు. ప్రతీదీ తానే ధైర్యంగా చేయడమే కాదు ఇదివరకటిలా ఆత్మవిశ్వాసంగా ఉంది. అందుకు సంబంధించిన విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ..నావిలువను బ్యాంకు పోటీ పరీక్షలతో పోల్చుకున్నాని తెలుసుకున్నా. అయినా ప్రతీదీ అనుకున్నట్లుగా జరిపోదు అనేదాన్ని పూర్తిగా నమ్మాలి. నిజానికి ఆ దారిలో గెలవలేకపోతున్నాం అంటే..మరో దారి ఏదో మనకోసం వెయిట్‌ చేస్తుందని సానుకూలంగా తీసుకుని ముందుకుపోవాలని అర్థమైంది. అలాగే జీవితంలో ఎదురయ్యే కష్టాలు, ఆరోగ్య సమస్యల వల్ల కలిగే భయం మనకు ఎన్నో నేర్పించి. స్ట్రాంగ్‌గా మారుస్తుందని రాసుకొచ్చింది పోస్ట్‌లో. 

చివరగా జీవితం అంటే బతకడం కోసం గడిపేది కాదు జీవించడం అని ఆత్మవిశ్వాసంగా చెప్పిందామె. అంతేగాదు కంఫర్ట్‌ జోన్‌ నుంచి బయటకు వచ్చి ప్రతి సవాలుని ఎదుర్కొంటేనే జీవితంలో కిక్కు ఉంటుందని తెలిసందీ.. అని అంటోంది. ఒంటిరిగా చేసిన ఆ జర్నీ తనలో ఎంతో మార్పు తీసుకువచ్చి, ఆత్మవిశ్వాసంగా ఉండేలా చేసిందని సంతోషంగా చెబుతోందామె. కాగా, దాస్‌ స్వస్థలం అస్సాంలోని మోరిగావ్‌. ఆమె అత్తమామలతో కలిసి అస్సాంలోని టిన్సుకియాలో ఉండేవారు. ప్రస్తుతం భర్తతో కలిసి హైదరాబాద్‌లో నివశిస్తోంది.  

(చదవండి: అందాల పోటీల్లో తళుక్కుమన్న స్వగతికా పాణిగ్రాహి)
 

#

Tags : 1

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)