Breaking News

బుల్లితెర నటి అస్మిత హెల్దీ డైట్‌ ప్లాన్‌ ఇదే..! 20 ఏళ్లుగా..

Published on Sun, 05/04/2025 - 10:11

‘నాలుగు పదుల వయసు దాటిన మహిళల్లో హార్మోన్లలో మార్పులు సహజం. అందుకే పోషకాహారాన్ని ప్లాన్‌ చేసుకోవడమే కాదు ఆరోగ్యానికి కొన్ని సప్లిమెంట్స్‌ వాడకం కూడా అవసరమే’ అంటూ తన డైట్‌ప్లాన్‌ను వివరించారు బుల్లితెర నటి, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ అస్మిత కర్ణని. ‘ఇరవై ఏళ్లుగా హెల్తీ డైట్‌ ప్లాన్‌ చేసుకున్నందుకే ఈ రోజుకీ హెల్తీగా ఉన్నాను’ అని చెబుతున్నారు.

‘మైండ్‌ ప్రశాంతంగా ఉండాలంటే బాడీ కూల్‌గా ఉండాలి. నా శరీరానికి ఎలాంటి పోషకాలు అవసరమో తెలుసుకుంటూ, 20 ఏళ్లుగా డైట్‌ ప్లాన్‌ చేస్తున్నాను. రోజూ ఉదయం నట్స్, డ్రై ఫ్రూట్స్‌తో రోజును స్టార్ట్‌ చేస్తాను. వర్కౌట్స్‌ తర్వాత సలాడ్స్, ఫుడ్‌ సంప్లిమెంట్స్‌ తీసుకుంటాను. 

ఒక పూట భోజనానికే ప్రాముఖ్యత. 40 ఏళ్ల తర్వాత హార్మోన్లలో చాలా వేగంగా మార్పులు వస్తుంటాయి. మన ఆరోగ్యం హార్మోన్ల మీదనే ఆధారపడి ఉంటుంది. ఈ రోజుల్లో ఆహారపదార్థాల్లో పోషకాలు బాగా తగ్గిపోయాయి. అందుకే నిపుణులు సూచించిన మెడికల్‌ న్యూట్రిషన్‌ సప్లిమెంట్స్‌ తీసుకుంటాను. 

బయటి ఫుడ్‌ తీసుకోను...
లంచ్‌ టైమ్‌లో ఒక వరస క్రమాన్ని పాటిస్తాను. మొదట కడుపులోకి వెళ్లాల్సింది పీచుపదార్థాలు. అందుకని కూరగాయలతో చేసిన సలాడ్‌ ముందుగా తీసుకుంటాను. తర్వాత ప్రోటీన్‌ డైట్, ఆ తర్వాత కార్బోహైడ్రేట్స్‌ ఉన్న డైట్‌ తీసుకుంటాను. బయటి ఫుడ్‌ దాదాపు తీసుకోను. 

ఉప్పు... చక్కెర తక్కువ
మన శక్తి స్థాయులు పెరగాలంటే ఉప్పు, పంచదార వాడకం బాగా తగ్గించేయాలి. అలా చేయడం వల్ల ఎనర్జీ ఏ మాత్రం తగ్గదు. సీజనల్‌ ఫ్రూట్స్‌ని ఎప్పుడూ వదులుకోను. వీటిని అరగంటసేపు నీటిలో నానబెట్టి, తీసుకుంటే రసాయనాల ప్రభావం తగ్గుతుంది. డ్రై ఫ్రూట్స్‌ సాయంత్రం 4:30 కి తీసుకుంటాను. తర్వాత బ్లాక్‌ కాఫీ. కాఫీ లేదా టీ పాలతో తీసుకుంటే బరువు పెరుగుతారు. 

అందుకని బ్లాక్‌ కాఫీ తీసుకుంటాను. సాయంకాలం  ప్రోటీన్లు ఉండే ఆహారం తీసుకుంటాను. దీని వల్ల బరువు 70 కేజీలు ఉన్నా, సన్నగా కనిపిస్తాను. ప్రోటీన్‌ పౌడర్‌కి, యోగర్ట్, కొన్ని ఫ్రూట్స్‌ కూడా కలిపి తీసుకుంటాను. సూర్యాస్తమయం తర్వాత ఏదీ తినను. ఏడాది మొత్తం నా డైట్‌ చార్ట్‌ ఇలాగే ఉంటుంది.

కండరాల బలానికి...
వేసవిలో డీ హైడ్రేట్‌ అవకుండా ఉండటానికి చాలా జాగ్రత్తలు తీసుకుంటాను. ఎప్పుడైనా లో ఎనర్జీ అనిపిస్తే ఎలక్ట్రాల్‌ పౌడర్‌ కలిపిన చల్లని నీళ్లు తీసుకుంటాను. రోజులో 3–4 లీటర్ల నీళ్లు తాగుతాను. జనరల్‌ ఫిట్‌నెస్‌ కోసం వారంలో 2–3 సార్లు వర్కౌట్స్‌ చేస్తాను. దీనివల్ల బరువు కూడా మెయింటెన్‌ అవుతుంది. 

వృద్ధాప్యంలో కండరాల బలం కోల్పోకుండా ఉండాలంటే ఇప్పటినుంచే వాటికి పని పెట్టాలి. అందుకని వ్యాయామం తప్పనిసరి. అందం గురించి కాదు. ఆరోగ్యంగా ఉండాలనుకోవడం జీవితాంతం చేసే ప్రయాణం. అందుకు నా జీవనశైలిని కూడా ఫిక్స్‌ చేసుకున్నాను’’ అని వివరించారు అస్మిత. 

నిర్వహణ: నిర్మలారెడ్డి 

(చదవండి: డాబా నిద్రలు కజిన్స్‌తో కబుర్లూ)

 

Videos

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)