Breaking News

పక్షవాతంతో మంచానికే పరిమితం..కానీ ఆయుర్వేదం నడిచేలా చేసింది..!

Published on Tue, 02/10/2026 - 17:40

అమ్మాయిల కలల రాకుమారుడిలా ఉండే తమిళ నటుడు అరవింద్‌ స్వామి నటన పరంగానే కాదు గ్లామరస్‌ పరంగా ఆయనకు సాటిలేరెవ్వరూ. బాంబే, రోజా మూవీలో వేలాది అభిమానులను సొంతం చేసుకున్న నటుడు అరవింద్‌స్వామి. అలాంటి ఆయన కెరీర్‌పీక్‌లో ఉండగానే సినిమాలకు దూరమయ్యారు. మళ్లీ ఇటీవలే ‍ప్రధాన పాత్రలతో ప్రేక్షకులకు చేరవవుతున్నారు. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో ఇన్నాళ్లు తాను ఎందుకు సినీ ఫీల్డ్‌కి ఎందుకు దూరంగా ఉన్నారో వెల్లడించారు. అనారోగ్యం బారిన పడటం ఒక కారణమైతే, అధిక బరువు మరో కారణమంటూ..తాను ఎదుర్కొన్య ఆరోగ్య సమస్య గురించి కూడా వివరించారు. ఇంతకీ ఆయన ఏ అనారోగ్య సమస్యతో బాధపడ్డారంటే..

అరవింద్‌ స్వామికి 2005లో పాక్షికంగా పక్షవాతం వచ్చింది. 18 నెలలు ఎంతగానో నొప్పితో విలవిలలాడాడు. చివరికి శస్త్ర చికిత్స చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఆయన అది వద్దనుకుని కేరళకు చెందని ఆయుర్వేద వైద్యుడిని ఆశ్రయించినట్లు తెలిపారు. ఒకటిన్నర ఏడాదిగా అనుభవించిన బాధ అంత ఇంత కాదని, ఆఖరికి స్పర్శను కూడా కోల్పోయానని అన్నారు. కానీ ఆయుర్వేదం తనను మూడు రోజుల్లో తిరిగి నడిచేలా చేసిందన్నారు. 

అది నాకు చాలా అద్భుతంగా పనిచేసిందని చెప్పుకొచ్చారు. అయితే ఆయన తనకు పనిచేసింది కాబట్టి ప్రజలను ఫాలో అవ్వమని సూచించడం లేదు. అలాగే గుడ్డిగా కూడా ఫాలో కావొద్దన్నారు. వైద్యుల సూచనల మేరకు, ఆరోగ్య పరిస్థితి రీత్యా సరైన నిర్ణయం తీసుకోండని అన్నారు. ఇక్క నొప్పి, కదలలేని పరిస్థితి కంటే..మానసికంగా స్థైర్యంగా ఉండటం అత్యంత ప్రధానమని అన్నారు. ఆ పరిస్థితిలో నాకే ఇలా అనే ఆలోచన దరిదాపుల్లోకి కూడా వెళ్లకూడదన్నారు. ఆ సమస్య నుంచి బయటపడ్డ వెంటనే..ఫజిల్స్‌, చదరంగం వంటి ఆటలతో బిజీ అయిపోయినట్లు తెలిపారు. 

అయితే ఆ అనారోగ్య సమస్య నుంచి బయటపడ్డాక మళ్లీ సినీ రంగంవైపుకి రావాలని అస్సలు అనుకోలేదు, సినిమా చేయాలని కూడా అనుకోలేదట. ఎందుకంటే ఆ టైంలో చాలా మందులు వాడటంతో విపరీతం బరువు పెరిగిపోయి, జుట్టు ఊడిపోయి అదోలా తయారయ్యానని, దాంతో సినిమాల ఆలోచన రాలేదని చెప్పుకొచ్చారు అరవింద్‌ స్వామి. ఎంత టెక్నాలజీ అభివృద్ది చెంది..ఆధునాత వైద్యం చెంతకు చేరినా..ఏళ్లనాటి పురాతన ఆయుర్వేదమే అత్యుతమమని పలు ఉదంతాల్లో నిరూపితమైంది కూడా.

(చదవండి: అమెరికా కోడలు..ఇండియా అత్త..! అనుబంధం మాములుగా లేదుగా..)

 

Videos

మేయర్ గా గెలిచిన వెంటనే నేను చేయబోయే మొదటి పని...

రూ.5 లక్షలతో రూ.80 లక్షలు.. ఇదే ఆ సింపుల్ ట్రిక్

గాల్లో ఎగురుతూ ఆఫీసుకు! అమెరికా వ్యక్తి వెరైటీ జర్నీ..

గరివిడి లక్ష్మి చూసి.. పవన్, రవితేజ ఫిదా!

DSP ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన అవినాష్ రెడ్డి

ఓటమి భయంతోనే.. చంద్రబాబు అండ్ కో దాడులు

నామినేషన్ కేంద్రాల వద్ద రాళ్ల గుట్టలు.. YSRCP నేతలే టార్గెట్..!

టైగర్ ష్రాఫ్ కేసులో కొత్త కోణాలు..

ఏపీ మున్సిపల్ ఎన్నికలపై సుప్రీంకోర్టు దృష్టి..

పచ్చ కుట్ర జోరు.. రూ.600, బిర్యానీ ప్యాకెట్లు.. ఎన్నికల వేళ విద్యార్థులకు ఎర..

Photos

+5

అల్లు శిరీష్-నయనిక జపాన్ ట్రిప్ (ఫొటోలు)

+5

అపరంజి బొమ్మలా నభా నటేశ్ (ఫొటోలు)

+5

ఏపీలో ప్రసిద్ధి చెందిన లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ఎక్కడో తెలుసా?

+5

విజయవాడ : భవానీ భక్తులతో ఎరుపెక్కిన ఇంద్రకీలాద్రి (ఫొటోలు)

+5

విజయదశమి శుభాకాంక్షలు చెప్పిన సెలెబ్రెటీలు (ఫొటోలు)

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)