Breaking News

ఐదుగురు పిల్లల తల్లి!.. ఏకంగా 67 కిలోల బరువు తగ్గి ఇలా..

Published on Tue, 03/24/2026 - 14:29

కొన్ని వెయిట్‌లాస్‌ స్టోరీలు వెనుక ఎడతెగని ఎగతాళి, విమర్శలు, కంటిమీద కునుకు పట్టని బాధరకమైన వేదన ఉంటుంది. వాటిన్నంటి తట్టుకుని బరువు తగ్గి చూపించడమే కాకుండా ఆ క్రమంలో తామేంటో చూపించి విజేతలుగా, స్ఫూర్తిప్రదాతలుగా నిలుస్తారు. అలాంటి కోవకు చెందిందే ఈ అరుణాచల్‌ప్రదేశ్‌కు చెందిన మహిళ. ఎవరామె..? ఏమా కథ సవివరంగా చూద్దామా..!.

అరుణాచల్‌ప్రదేశ్‌కి చెందిన ఐదుగురు పిల్లల తల్లి అయిన అమోమ్‌ సోకి యెకర్‌ ఒకప్పుడు అధిక బరువుతో ఉండేది. ఈ 39 ఏళ్ల వ్యాపారవేత్త 130 కిలోల అధిక బరువుతో ఇబ్బందిపడుతుండేది. ఆమె ఆకారం, బరువు చూసి సన్నిహితులే ఎగతాళి చేస్తూ ఇబ్బందిపెడుతుండేవారు. అంత బరువుతో కనీసం బయటకు అడుగుపెట్టడానికి కూడా ఇబ్బంది పడేది. 

సదా నిరాశనిస్ప్రుహలతో నిరుత్సాహంగా ఉండేదామె. కనీసం స్నేహితులను కూడా కలవలేకపోయేది. పైగా లోలోన అభద్రతా భావంతో కుమిలిపోతూ ఉండేది. కానీ ఏదో విధంగా ఈ అధిక బరువుని తగ్గించుకోవాలి, తానేంటోప్రూవ్‌ చేసుకోవాలన్న ఆరాటం మాత్రం యెకర్‌కి అపారంగా ఉండేది. అదే ఆమెను..స్లిమ్‌గా మారేందుకు ఉపక్రమించేలా చేసింది. 

అచంచలమైన దృఢసంకల్పంతో బరువు తగ్గే ప్రయత్రాలు చేసింది. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను చిన్నగా మొదలు పెట్టి ప్రభావవంతంగా ఉండేలా చేసుకుంది. అలా తగ్గుతూనే మోడల్‌గా ప్రయత్నిస్తుంటే..నువ్వా మోడల్‌గానా అంటూ ఛీత్కారాలు, అవమానాలు ఎక్కువయ్యాయి. బాగా నాజూకుగా మారితే ఒక్కసారైనా అరుణాచల్‌ అందాలపోటీల్లో పాల్గొనాలని ఆశిస్తున్నట్లు తన కోరికను వ్యక్తం చేయగా..ఒక్కసారిగా అందరూ నోఛాన్స్‌ అనేశారు. 

పైగా ఆమె కారణంగా ఆ అందాల పోటీలను సైతం తిట్టిపోశారు. ఇక ఈ మాటలు వింటూ డిప్రెషన్‌లోకి వెళ్లకూడదని, కేవలం వాళ్లు అనే మాటలు మూగబోయేలా తాను స్లిమ్‌గా మారాలన్నేదే లక్ష్యంగా పెట్టుకుని మరి ఏకంగా 130 కిలోల  నుచి 67 కిలోలకు చేరుకుంది. అనుకున్నట్లుగానే అరుణాచల్‌ప్రదేశ్‌ అందాల పోటీల్లో పాల్గొని, మిసెస్ అరుణాచల్ 2026గా కిరీటాన్ని గెలుచుకుంది. ప్రస్తుతం మిసెస్ ఇండియాగా టైటిల్‌ దక్కించుకోవడమే తన లక్ష్యం అని చెబుతోంది యోకర్‌. 

ఫిట్‌నెస్‌ జర్నీ మొదలైందిలా..
తాను స్వతహాగా బాగా తిండిబోతునని, అదే తన ఊబకాయానికి ప్రధాన కారణమని చెబుతోంది. తాను ఈ వెయిట్‌లాస్‌ జర్నీని..ప్రభావవంతమైన చిన్న అలవాట్లను జీవనశైలిలో జోడించి సన్నగా మారినట్లు పేర్కొన్నారు. ప్రతిరోజు యోగ, శుద్ధి చేసిన పిండితో చేసే ఆహారాలకు దూరంగా ఉంటూ బరువు తగ్గినట్లు తెలిపింది. తాను టీని పూర్తిగా మానేశానని, శుభ్రమైన ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లకు మారడంతోనే ఇంతలా స్లిమ్‌గా మారానని సంతోషంగా చెబుతోందామె. 

సత్వర ఫలితాల కోసం వెంపర్లాడకుండా..స్థిరమైన ఆరోగ్యకరమైన జీవినశైలిని అవర్చుకోవడంతో బరువు తగ్గానని అంటోంది. చిన్న అలవాట్లే చాలా ప్రభావవంతంగా ఉంటాయని చెబుతోంది. ఐదుగురు పిల్లల తల్లివి, బాగా ఏజ్‌డ్‌గా కనిపిస్తున్నావ్‌.. అన్న మాటలు చెవికెక్కించుకోలేదని..తనలాంటి వాళ్లు ఏం చేయగలరో చూపించడంపైనే ఫోకస్‌ పెట్టా, స్ఫూర్తిగా నిలిచానని సంతోషంగా చెబుతోంది. అంతేగాదు మన కథను మనమే తిరగరాయాలని,..అప్పుడే లైఫ్‌ అనుహ్యమైన టర్న్‌ తీసుకుని విజేతలుగా నిలుస్తామని ఆత్మవిశ్వాసంగా చెబుతోంది అమోమ్‌ సోకి యెకర్‌.

 

(చదవండి: దంపతుల ఫిట్‌నెస్‌ కోసం..! మిలింద్‌ సోమన్‌ టిప్స్‌)
 

Videos

ట్రంప్ ప్రకటనకు ముందు భారీ డీల్ 580 బిలియన్ డాలర్ల ట్రేడింగ్

ప్రభాస్ సీక్వెల్ సినిమాలపై ధురంధర్ ఎఫెక్ట్

పసిడి ప్రేమికులకు పండగ.. బంగారం, వెండి ధరలు భారీగా పతనం..!

మొదలైన పెట్రోల్.. డీజిల్ కష్టాలు బంకుల్లో నో స్టాక్ బోర్డులు..

భారత్‌లో గ్యాస్, పెట్రోల్ సంక్షోభం..! మోదీ క్లారిటీ..

కూటమిలో కామ పిశాచులు

ఇరాన్ సంచలన నిర్ణయం.. ప్రపంచ దేశాల్లో భారీగా పెరగనున్న పెట్రోల్ ధరలు?!

అనకాపల్లి స్టీల్ ప్లాంట్ రావడానికి కారణం జగనే

ఇరాన్ కు రష్యా సాయం? ఆధారాలు ఉన్నాయన్న జెలెన్ స్కీ

కల్తీ పాల నిందితులను కఠినంగా శిక్షించాలి

Photos

+5

రష్మిక-విజయ్ దేవరకొండ వెడ్డింగ్..ఈ అరుదైన ఫోటోలు చూశారా? (ఫోటోలు)

+5

ట్రంప్ ప్రకటనకు ముందు భారీ డీల్ 580 బిలియన్ డాలర్ల ట్రేడింగ్

+5

విశాఖపట్నంలో సినీ నటి శ్రుతి హాసన్‌ సందడి (ఫొటోలు)

+5

శ్రీరామనవమి స్పెషల్ : ఏపీలో ఉన్న ఈ అద్భుతమైన ఆలయం గురించి తెలుసా? (ఫొటోలు)

+5

ధురంధర్‌ 2కి బ్లాక్‌బస్టర్‌ టాక్‌.. ట్రెండింగ్‌లో హీరోయిన్‌ సారా (ఫోటోలు)

+5

ఘనంగా 'బ్యాండ్‌ మేళం' ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

హైదరాబాద్ లో కొత్తగా నిర్మించిన అద్భుత ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

విజయవాడ : సమ్మోహనం.. ఆంధ్ర నాట్యం (ఫొటోలు)

+5

శర్వానంద్ 'బైకర్' సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

పెళ్లి వేడుకలో అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి (ఫోటోలు)