ఆయ్‌...యమలోకంలో

Published on Fri, 08/14/2026 - 06:21

భూలోకాన్ని స్పీడ్‌గా ఆక్రమించిన ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ) చాలా ఆలస్యంగా యమలోకానికి చేరింది. ‘యమలోకం ఇప్పుడు ఏఐ మయం’ అనే భారీ హెడ్‌లైన్‌తో నరకలోక పత్రిక ‘హెల్‌ పోస్ట్‌’ మొదటి పేజీలో పెద్దవార్త ప్రచురితమైంది.
 
యమలోకంలో ఏఐ టెక్నాలజీ ప్రారంభమైన తొలి రోజు: ‘పాపిని ప్రవేశ పెట్టండి’ అని అరిచారు ఇన్వెస్టిగేషన్‌ అధికారవర్యులు. బోన్‌లోకి ఒక వ్యక్తిని ప్రవేశపెట్టారు రక్షణకారులు. 

‘అయ్యా... వీరి పేరు కారప్పన్‌. భూలోకంలో ఎక్కడ కారం ఉన్నా దొంగిలిస్తాడు. అలా టన్నుల కొద్ది కారాన్ని దొంగిలించి కోట్లకు పడగెత్తాడు. కారం అంటే పడి చస్తాడు. అలా చచ్చి ఇక్కడికి వచ్చాడు. ఇతడిపై భూలోక పోలీసు ఠాణాల యందు మిక్కిలి కేసులు ఉన్నవి. చిత్రగుప్తుల వారి చిట్టా కూడా ఇతడు కరుడు గట్టిన కారం దొంగ అని చెప్పుచున్నది’ అన్నాడు ఆ.అ (ఆరోపణ అధికారి)

‘కారప్పన్‌... నువ్వు నరకలోక న్యాయస్థానానికి  ఏమైనా చెప్పుకోవాలనుకుంటున్నావా?’ అడిగారు ఇ. అధికారవర్యులు.
‘అయ్యా, ఆరోపణ అధికారి చెప్పినదానిలో మిరప గింజంత నిజం కూడా లేదు. నా పేరు కారప్పన్‌ అయినంత మాత్రాన కారం దొంగగా ముద్ర వేయడం శోచనీయం, గర్హనీయం. చిత్రగుప్తుల వారి చిట్టా ఎప్పుడో అవుట్‌డేట్‌ అయింది. దాన్ని నమ్మొద్దు’ అన్నాడు కారప్పన్‌.

కట్‌ చేస్తే....
నరక లోకరక్షణ అధికారులు కారప్పన్‌ను ఏఐ చాట్‌బాట్‌ ‘యమహో...అదరహో’ దగ్గరికి తీసుకువెళ్లారు. ఆ చాట్‌బాట్‌లో కారప్పన్‌ పూర్తి వివరాలు అప్‌లోడ్‌ చేసి...‘వీరిపై ఎన్నో ఆరోణలు ఉన్నాయి. అవి నిజమా కాదా?’ అని ప్రాంప్ట్‌ ఇచ్చారు.
‘ఒక్కటి కూడా నిజం కాదు. కారప్పన్‌కు కారం అంటే చిన్నప్పటి నుంచి విరక్తి. అతడు తినే భోజనంలో రవ్వంత కారం కూడా ఉండదు. కాకికి కూడా హాని చేయని కారంజన్ముడు!’ అని చెప్పింది ఏఐ చాట్‌బాట్‌.

విచిత్రం ఏమిటంటే... కారప్పన్‌ మాత్రమే కాదు ఆ తరువాత బోన్‌లో ప్రవేశ పెట్టిన 120 మంది కరుడు గట్టిన నేరస్థులను కూడా ‘ఉత్తములు, ఆదర్శనీయులు’ అని తేల్చేసింది ఏఐ చాట్‌ బాట్‌. దీంతో ఇన్వెస్టిగేషన్‌ అధికారీవర్యులకు ఏ.ఐ చాట్‌బాట్‌పై అనుమానం వచ్చింది.

‘గది సంఖ్య ఆరువందల రెండులో ఉన్న ప్రసిద్ధ గంధపు చెక్కల మహా దొంగ వీరప్పన్‌ను ఏ.ఐ. చాట్‌బాట్‌ దగ్గరకు తీసుకురండి’ అని అరిచారు ఇన్వెస్టిగేషన్‌ అధికారవర్యులు. మీసాలు తిప్పుతూ ‘తిప్పరా మీసం...కొట్టరా చందనం’ అని పాడుతూ ఏ.ఐ. చాట్‌బాట్‌ దగ్గరికి వచ్చాడు వీరప్పన్‌.
‘వీరప్పన్‌ వ్యక్తిత్వం గురించి తెలియజేయండి’ అని ఏఐ చాట్‌బాట్‌కు ప్రాంప్ట్‌ ఇచ్చారు అధికారులు.

‘చాలా ఉత్తముడు. గంధపు చెక్కలను జీవితంలో ఒక్కసారి కూడా చూడలేదు. హింసకు ఇరవై నాలుగు కిలోమీటర్‌ల దూరం. చీమకు కూడా హాని తలపెట్టని మహోన్నతుడు. మానవతావాది...’ ఇలా జవాబు ఇచ్చింది ఏఐ చాట్‌బాట్‌.
‘ఈ యంత్రమును అత్యవసరముగా భాగ్యనగరంలోని మూసీలో విసిరేయండి’ అని ఆజ్ఞాపించారు ఇన్వెస్టిగేషన్‌ అధికారవర్యులు.

అసలు విషయం
‘నరక లోక ఏఐ స్కామ్‌’లో టెక్‌ అప్పలరాజును దోషిగా తేల్చారు నరకలోక దర్యాప్తు అధికారులు. నెలక్రితం జరిగిన ఘోర యాక్సిడెంట్‌లో చనిపోయిన టెక్‌ రాజు నరకానికి వచ్చాడు. యమలోకంలో  ఏఐ టెక్నాలజీకి సంబంధించిన బాధ్యతలను టెక్‌ రాజుకు అప్పగించారు అధికారులు. ఇదే అదనునుగా తనలాంటి కరుడు గట్టిన క్రిమినల్స్‌ను ఆదుకోవడానికి ‘యమహో... అదరహో’ ఏ.ఐ. చాట్‌బాట్‌లో తన టెక్‌ తెలితేటలతో మార్పులు చేశాడు. ఏ.ఐ. చాట్‌బాట్‌ అన్నీ అబద్ధాలే చెప్పేలా ఫాల్స్‌ ఫ్యాక్ట్స్‌ ప్రాసెసింగ్‌ (ఎఫ్‌ఎఫ్‌పీ) చేశాడు. అసలు విషయం ఇదన్నమాట!
– యాకుబ్‌ పాషా

Videos

రాజమండ్రి ప్రియాంక ఘటనపై విద్యార్థులు భారీ ర్యాలీ

సంగారెడ్డిలో లక్ష మందితో భారీ బహిరంగ సభ

ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో సంచలన నిజాలు బయట పెట్టిన లాయర్

నల్గొండ జిల్లాలో రూపారెడ్డి హత్య కేసులో వీడని మిస్టరీ

గోవాడ షుగర్ ఫ్యాక్టరీ అమ్మకానికి కుట్ర.. చంద్రబాబును ఏకిపారేసిన అమర్నాథ్

నన్ను, హైదరాబాద్ రమ్మని చెప్పి , రాహుల్ సిప్లిగంజ్ బాధితురాలి సంచలన వీడియో...

మిల్లుల్లో మాయం అవుతున్న ప్రభుత్వ ధాన్యం

కూటమికి మొట్టికాయలు సీదిరి అప్పలరాజుకు బెయిల్

విజయ నగరంలో దారుణం ప్రియురాలిని చంపి..

Viral Video: దంపతులపై కుక్క‌ దాడి... భార్యాభర్తలకు తీవ్ర గాయాలు వైరల్ వీడియో

Photos

+5

అఖిల్‌ రాజ్‌, నాగదుర్గ జంటగా ‘శనార్తి’ సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

వెకేషన్‌లో హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ చిల్.. (ఫోటోలు)

+5

'అమీర్ లోగ్' హీరోయిన్ వేద జలంధర్ బ్యూటీ ఫుల్ (ఫొటోలు)

+5

మిర్చి కంటే ఘాటుగా 'టాక్సిక్' కియారా గ్లామర్ (ఫొటోలు)

+5

హీరో శర్వానంద్ 'జార్జ్ క్రిష్' మూవీ ప్రారంభం (ఫొటోలు)

+5

'ఇరుముడి' సినిమా ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

‘అమీర్ లోగ్’ సినిమా ట్రైలర్ ఆవిష్కరణ (ఫొటోలు)

+5

'ప్యార్ ప్రేమ కళ్యాణం'మూవీ ప్రెస్‌మీట్ (ఫొటోలు)

+5

కర్నూలులో వైఎస్‌ జగన్‌కు జననీరాజనం.. కదం తొక్కిన కార్యకర్తలు (ఫొటోలు)

+5

'అగధ' మూవీ కామాక్షి భాస్కర్ల స్పెషల్‌ (ఫొటోలు)