Breaking News

డబుల్‌ దుపట్టా డిజైనర్‌ లెహంగాలో మెరిసిన పెళ్లి కూతురు, దీని స్పెషాల్టీ ఇదే!

Published on Thu, 01/02/2025 - 16:15

సాధారణంగా పెళ్లి   పెళ్లి తంతు, విందుభోజనాలు  ఎలా ఉన్నాయి అనేది చూస్తాం. అలాగే వధూవరులు అందం చందాల్నిచూసి అందమైన జంట,క్యూట్‌ కపుల్‌, మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌ అని పొగిడేస్తాం.   వీటితోపాటు  ఈ  మధ్య కాలంలో ప్రీ వెడ్డింగ్‌ వేడుకల సందడి కూడా బాగాపెరిగింది. దీంతోపాటు  వధూవరుల డిజైనర్‌ దుస్తులు,  ఆభరణాలకు చాలా ప్రాధాన్యత ఏర్పడింది.  ముఖ్యంగా బ్రైడల్‌ లుక్‌ అదే.. పెళ్లి కూతురు  ముస్తాబు, డిజైనర్‌ లెహెంగాలు చాలా ఆసక్తికరంగా మారాయి.  

తాజాగా గాయకుడు అర్మాన్ మాలిక్‌ తనచిరకాల ప్రియురాలు ఆష్నా ష్రాఫ్‌ను పెళ్లాడాడు. వధువు  ఆరెంజ్‌ కలర్‌ డిజైనర్‌ లెహెంగాలో మెరిసిపోతూ  అందరి దృష్టినీ ఆకర్షించింది. అద్భుత సెట్టింగుల మధ్య వారి  పెళ్లి దుస్తులు ఫ్యాషన్  ప్రేమికులను ఆకట్టుకున్నాయి.   ఆర్మాన్‌, ఆష్నా దుస్తులను ప్రముఖ డిజైనర్‌ మనీష్ మల్హోత్రా  డిజైన్‌  చేశారు.


ప్రత్యేకత ఏంటి అంటే
రెగ్యులర్‌  కలర్స్‌ కంటే  భిన్నంగా ఆరెంజ్‌  కలర్‌  మనీష్ మల్హోత్రా లెహంగాలో  ఆష్నా బ్యూటిఫుల్‌గా ముస్తాబైంది. బంగారు జర్దోజీ వర్క్ తో, స్క్వేర్ నెక్ క్రాప్డ్ బ్లౌజ్, ఫ్లేర్డ్  స్కర్ట్‌ అద్భుతంగా అమిరింది. దీనికి డబుల దుపట్టాలతో తన బ్రైడల్‌ లుక్‌ను మరింత ఎలివేట్‌ చేసేలా జాగ్రత్తపడింది. ఆరెంజ్‌ కలర్‌లో ఒకటి, తలపై మేలిముసుగుకోసం పాస్టెల్ పీచ్‌ కలర్‌లో  ఒకటి జతగా ధరించింది. అలాగే డ్రెస్‌కు మ్యాచింగ్‌గా పాస్టెల్ పీచ్ బ్యాంగిల్స్  వేసుకుంది.  ఇంకా  పోల్కీ డైమండ్‌, చోకర్ నెక్లెస్, ముత్యాల ఆభరణాలతో మేళవించి న్యూ గ్లామ్‌ లుక్‌తో కాబోయే పెళ్లి కూతుళ్లకు  కొత్త ట్రెండ్‌ అందించింది. 

ఇక వరుడు అర్మాన్ మాలిక్ ఈ విషయంలో ఆష్నాను ఫాలో అయిపోయాడు.   ఆమెకు  మ్యాచింగ్‌గా  మనీష్ మల్హోత్రా డిజైన్‌ చేసిన గోల్డ్ జర్దోజీ వర్క్ ఫుల్ స్లీవ్స్‌  పీచ్‌ షేర్వానీలో  కనిపించాడు.మ్యాచింగ్ కుర్తా, ప్యాంటు,,తలపాగా సిల్క్ మెటీరియల్‌తో పాటు, బ్రూచ్‌లో రాయల్, క్లాసీ లుక్‌లో అదిరిపోయాడు.  అలాగే కొత్త ఏడాదిలో  తమ సరికొత్త జీవన ప్రయాణాన్ని మొదలు పెడుతున్న వేళ అర్మాన్‌ కొత్త ఈపీ( EP extended play)ని  విడుదల చేశాడు. 

కాగా  ఆష్నా ష్రాఫ్  పాపులర్‌ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, లగ్జరీ ఫ్యాషన్, బ్యూటీ , లైఫ్‌స్టైల్‌కి  పెట్టింది పేరైన ఆమెకు 10 లక్షలకు  పైగా ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లుఉన్నారు. 
 

Videos

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)