'ధర్మస్థల' కేసులో మరో భారీ ట్విస్ట్
Breaking News
అర్జున్ చక్రవర్తి కోసం ముప్పై కేజీలు తగ్గాను
Published on Fri, 08/22/2025 - 10:53
విజయ రామరాజు టైటిల్ రోల్‌లో నటించిన చిత్రం ‘అర్జున్ చక్రవర్తి’. ఈ చిత్రంలో సిజా రోజ్ హీరోయిన్. విక్రాంత్ రుద్ర దర్శకత్వంలో శ్రీని గుబ్బల నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో విజయ రామరాజు మాట్లాడుతూ –‘‘ఈ సినిమా కోసం దాదాపు 30 కేజీల బరువు తగ్గాను. ఆ తర్వాత బరువు పెరిగాను.
నేను సిక్స్ ప్యాక్‌తో ఉన్న సీన్స్ తీసినప్పుడు రెండు రోజులు ఏమీ తినలేదు. కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నాను. అయితే ట్రైలర్ విజువల్స్ చూసివారు పెద్ద సినిమాలా ఉందని అంటుంటే సంతోషంగా ఉంది’’ అన్నారు. ‘‘ఈ సినిమా నా తొమ్మిదేళ్ల కల. ఆరేళ్ల మా టీమ్ కష్టం. విజయ్ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టాడు. బడ్జెట్ పెరిగినా మా నిర్మాత నన్ను స΄ోర్ట్ చేశారు’’ అని చె΄్పారు విక్రాంత్ రుద్ర. ‘‘ఆగస్టు 29న నేషనల్ స్పోర్ట్స్ డే. కబడ్డీ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన మా సినిమా అదే రోజు రిలీజ్ అవుతోంది’’ అని చెప్పారు శ్రీని గుబ్బల. – విజయ రామరాజు
ఇదీ చదవండి: PCOS Belly తగ్గేదెలా? ఇవిగో అమోఘమైన టిప్స్
Tags : 1