Breaking News

రూ. 40 లకే భోజనం, ఎక్కడ? నమ్మలేకపోతున్న ఫ్యాన్స్‌

Published on Fri, 06/27/2025 - 10:52

ప్రముఖ గాయకుడు అరిజిత్ సింగ్ కేవలం తన పాటల ద్వారా మాత్రమే కాదు, తన గొప్పమనసుతో అందరి మనసులను దోచుకున్నాడు. సెలబ్రిటీలు అనేక  వ్యాపారాలకు, ఎండార్స్‌మెంట్లతో కోట్లకు పడగలెత్తుతున్న తరుణంలో తన రెస్టారెంట్ ద్వారా ప్రజలకు పోషకాహారం అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. కేవలం 40 రూపాయలకే కమ్మటి భోజనం అందిస్తున్నాడు. ఎక్కడ?  ఈ నిర్ణయం వెనుక ఉన్న అసలు  ఉద్దేశం ఏంటి? తెలుసుకుందామా

పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లోని తన స్వస్థలం జియాగంజ్‌లో హెషెల్ అనే రెస్టారెంట్‌ను ప్రారంభించాడు అరిజిత్‌ సింగ్‌. కుటుంబ వ్యాపారంలో భాగంగా దీన్ని ఏర్పాటు చేశాడు.  ఈ రెస్టారెంట్ చాలా తక్కువ ధరకు, కేవలం రూ. 40కి ఆరోగ్యకరమైన, నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నాడు. తద్వారా మధురమైన గానంతోపాటు సామాజిక సేవతో మరోసారి ఎందరో హృదయాలను గెలుచుకున్నాడు.

మనీ కంట్రోల్‌ నివేదిక ప్రకారం ఈ హోటల్‌ కొత్తదేమీ కాదు. కుటుంబ వ్యాపారంలో భాగంగా గాయకుడు అరిజిత్ సింగ్ తండ్రి గురుదయాళ్ సింగ్  చాలా కాలంగా నిర్వహిస్తున్నారు. అయితే సగటు మనిషికి,  మరీ ముఖ్యంగా విద్యార్థులకు  చాలా సరసమైన  ధరలో, ఆరోగ్యకరమైన, రుచికరమైన భోజనాన్ని అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు అరిజిత్‌. అంతేకాదు గౌరవప్రదంగా వడ్డించడ కూడా అధిక ప్రాధాన్యత ఇచ్చేలా ఈ కొత్త ధరలను ప్రకటించినట్టు తెలుస్తోంది.

మనీ కంట్రోల్‌ నివేదిక ప్రకారం ఈ హోటల్‌ను గాయకుడు అరిజిత్ సింగ్ తండ్రి గురుదయాళ్ సింగ్ నిర్వహిస్తున్నారు.ఇది చాలా కాలంగా కొనసాగుతున్న కుటుంబ వ్యాపారంలో భాగం. అయితే సగటు మనిషికి,  మరీ ముఖ్యంగా విద్యార్థులకు  చాలా సరసమైన  ధరలో, ఆరోగ్యకరమైన, రుచికరమైన భోజనాన్ని అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు అరిజిత్‌. అంతేకాదు గౌరవప్రదంగా వడ్డించం కూడా అధిక ప్రాధాన్యత ఉంటుందట.

భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే గాయకుడు అరిజిత్‌ సింగ్‌ ఒకడు. అతని కచేరీకోసం ప్రేక్షకులు డిమాండ్‌ బాగా ఉంటుంది. ఒక్కో షోకు దాదాపు 14 కోట్లు వసూలు చేస్తాడట. ముంబైలో రూ. 8 కోట్ల ఇల్లు,  లగ్జరీ కార్లు అతని సొంతం.  మొత్తంగా అరిజిత్‌ సింగ్‌  నెట్‌వర్త్‌ సుమారు 414 కోట్లు ఉంటుందని అంచనా.

అయితే కోట్ల రూపాయలు ఆర్జించే గాయకుడు అరిజిత్ సింగ్ లాంటి వారికి ఛారిటబుల్ ఫుడ్ ఆర్గనైజేషన్‌ను నడపడం పెద్ద విషయం కానప్పటికీ, అభిమానులు ఇప్పటికీ ఈ వార్త నిజమేనా అని ఆశ్చర్యపోతున్నారు. మరోవైపు ఈ పూర్తి భోజనం విద్యార్థులకు మాత్రమేనని అందరికీ కాదని పేర్కొంటున్నారు. 'ఫర్ ఎ చేంజ్' అనే సంస్థ మరో పోస్ట్‌లో, ఈ రెస్టారెంట్ సరసమైన ధరలకు ఆరోగ్యకరమైన భోజనాన్ని అందిస్తుందని  తెలిపింది. ఈ రెస్టారెంట్ ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు పనిచేస్తుందని, విద్యార్థులకు డిస్కౌంట్లను కూడా అందిస్తుందని, ఇది అరిజిత్ సమాజ సేవపై ఆయనకున్న నిబద్ధతకు నిదర్శనమని పేర్కొపడం గమనార్హం.

భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే  పాపులర్‌ గాయకుల్లో ఒకరు అరిజిత్‌ సింగ్‌.  అతని కచేరీలకున్న డిమాండ్‌  అంతా ఇంతా కాదు. ఒక్కో షోకు దాదాపు 14 కోట్లు వసూలు చేస్తాడట. ముంబైలో రూ. 8 కోట్ల ఇల్లు, లగ్జరీ కార్లు అతని సొంతం.  మొత్తంగా అరిజిత్‌ సింగ్‌  నెట్‌వర్త్‌ సుమారు 414 కోట్లు ఉంటుందని అంచనా.

Videos

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)