మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు
Breaking News
బస్సులో మంటలు.. తప్పిన పెను ప్రమాదం
కూకట్పల్లి జేఎన్టీయూలో విద్యార్థుల ఘర్షణ
ఇస్రో: జీఎస్ఎల్వీ-ఎఫ్17 సక్సెస్.. నింగిలోకి ‘నిఘా నేత్రం’
చరిత్ర సృష్టించిన భారత ఓపెనర్.. ప్రపంచ రికార్డులు
ఒక్క పోటుతో.. చిన్నారెడ్డి ఫస్ట్ రియాక్షన్
సురేఖ బర్తరఫ్.. కొండా మురళి సంచలన ట్వీట్
ప్రపంచ వ్యాప్తంగా నిలిచిపోయిన చాట్‌జీపీటీ, జెమిని ఏఐ
మోదీకి ఆ కానుక ఇవ్వాలనుకున్నా.. కానీ ఏమైందంటే?
శ్రీకాంత్ అద్భుత విజయం.. సుదీర్ఘ నిరీక్షణకు తెర
హైదరాబాద్‌లో ట్రాఫిక్ మళ్లింపులు.. ఈ రూట్లలో వెళ్తున్నారా?
వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన చంద్రబాబు
అగార్కర్ అందుకే రాలేదు.. రోహిత్ గురించి ఎందుకు?: బీసీసీఐ
‘బీజేపీ నేతలు సమాధానం చెప్పాల్సిందే’
రేవంత్‌రెడ్డిని శపిస్తున్నాను: కొండా సుస్మిత సంచలనం
తెలంగాణ సీఈఓ సుదర్శన్‌రెడ్డికి ‘సర్’ నోటీసులు
మీసం మెలేసిన కొండా మురళి
స్త్రీవాద దిగ్గజం, ప్రముఖ జర్నలిస్టు, రచయిత్రి కన్నుమూత
గతంలోనూ మంత్రులు బర్తరఫ్.. ఎవరెవరు? ఎప్పుడెప్పుడంటే?
తెలంగాణ రాజకీయాల్లో నెక్ట్స్ ఏంటి?
కొండా సురేఖ వివాదం.. ఎలా మొదలైంది? ఎప్పుడేం జరిగింది?
ఇంటిప్స్: వీటితో ఇబ్బంది పడ్తున్నారా.. మన్నికకై ఇలా చేయండి!
Published on Fri, 03/01/2024 - 08:14
'ప్రతీరోజూ ఇంట్లో ఉన్న వంటింటిని కాపాడడం.. వంటింట్లో ఉన్న వస్తువులను కాపాడడం.. ఆ వస్తువులలో ఆరోగ్యానికి సంబంధించిన వాటిని ఎక్కువ రోజులు మన్నికగా ఉండేట్లు చూసుకోవడం ఎంతో కష్టం. ఇకపై అలాంటి తిప్పలకు చెక్ పెట్టేవిధంగా ఈ ఇంటిప్స్ వాడారో.. కాస్త వీటి టెన్షన్ నుంచి రిలీఫ్ అవొచ్చు. ఇక అవేంటో చూద్దాం..'
ఈ విధానాలు..
- కూరలో నీరు ఎక్కువైతే కూరగాయ ముక్కలు ఉడికిన తర్వాత కూడా కూర చిక్కబడదు. అలాంటప్పుడు వేయించిన వేరుశనగపప్పులు పొడి కలిపితే చిక్కదనంతోపాటు రుచి కూడా ఇనుమడిస్తుంది. కూరల్లో ఉప్పు ఎక్కువైనప్పుడు కూడా ఈ చిట్కా మంచి ఫలితాన్నిస్తుంది.
- బంగాళాదుంపలు వాడిపోయినట్లయితే.. ఒక పాత్రలో వేసి అవి మునిగేటట్లు నీటిని పోసి ఓ అరగంట ఉంచితే తాజాగా మారుతాయి.
- అల్లంవెల్లుల్లి పేస్ట్ గ్రైండ్ చేసేటప్పుడు అందులో చిటికెడు ఉప్పు, అర టీ స్పూన్ నూనె వేయాలి. ఇలా గ్రైండ్ చేసిన పేస్ట్‌ను గాలిచొరబడని డబ్బాలో నిల్వ చేసి ఫ్రిజ్‌లో పెడితే రెండు వారాల పాటు తాజాగా ఉంటుంది.
- వెల్లుల్లిపొట్టు త్వరగా వదలాలంటే.. రేకలను ఒక పాత్రలో వేసి కొద్దిగా నూనె వేసి అన్నింటికీ పట్టేటట్లు వేళ్లతో రుద్ది ఇరవై నిమిషాల సేపు ఎండలో పెట్టాలి.
- పచ్చిమిర్చి ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఫ్రిజ్‌లో పెట్టేముందు తొడిమలు ఒలిచి న్యూస్ పేపర్‌లో చుట్టి పాలిథిన్ కవర్‌లో పెట్టాలి.
- మార్కెట్‌లో కొన్న పనీర్‌ని వండే ముందు పది నిమిషాల సేపు గోరువెచ్చటి నీటిలో నానబెడితే, పనీర్ ముక్కలు మృదువుగా మారుతాయి.
ఇవి చదవండి: చెట్టినాడు ఘుమఘుమలు!
#
Tags : 1