హెరిటేజ్ లో పాలు అమ్మినట్టు.. టీచర్ పోస్టులను అమ్మేశారు
Breaking News
సెరిబ్రల్ పాల్సీతో జీవిస్తూ..12 వేల అడుగుల ఎత్తులో 10 కిలోమీటర్ల పరుగు!
Published on Sun, 09/06/2026 - 12:45
శారీరకం మానసికంగా ఉండే వైకల్యం ఎల్లప్పుడూ మన గమనాన్ని ఆపలేవు. అవి బలమైన సంకల్పం ముందు ఓడిపోతాయి. అందుకు ఉదాహరణ అనురాగ్ రావత్. ఒకప్పుడూ అతను ఎలా బతుకుతాడు, అతడి జీవితం ఎలా ఉంటుంది అని సందేహం వ్యక్తం చేసిన వాళ్లే ఆశ్చర్యపోయాలా స్ఫూర్తిదాయకంగా జీవిస్తున్నాడు.
సెరిబ్రల్ పాల్సీతో జీవిస్తున్న రావత్ భారతదేశంలో రెండోసారి ఎత్తైన ప్రదేశంలో పరుగును పూర్తి చేసి, తన ఫిట్‌నెస్ ప్రయాణంలో మరో అద్భుతమై మైలురాయిని అందుకున్నాడు. అతని ఘనతను ప్రశంసిస్తూ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ఇలా ఉంది. “సెరిబ్రల్ పాల్సీతో జీవిస్తూనే, 12,500 అడుగుల ఎత్తులో 10 కిలోమీటర్ల పరుగును పూర్తి చేసి, భారతదేశంలో ఒక వ్యక్తి దేశానికి ప్రపంచవ్యాప్త కీర్తిని తీసుకురావడం ఇది రెండోసారి” అని యూజర్ పేర్కొన్నాడు పోస్ట్‌లో.
రావత్ మారథాన్‌లు, ఫిట్‌నెస్ ఛాలెంజ్‌లు, సాధారణ వ్యాయామాల్లో పాల్గొంటూ తన ప్రయాణాన్ని సోషల్ మీడియాలో పంచుకునేవాడు. అది కాస్తా కాలక్రమేణా అతని పోస్ట్‌లకు రెండు లక్షలకు పైగా ఫాలోవర్లతో కూడిన ఆన్‌లైన్ కమ్యూనిటీని నిర్మించుకోవడానికి దారితీసింది. కాగా, రావత్‌కు రెండేళ్ల వయసులో సెరిబ్రల్‌పాల్సీ ఉన్నట్లు నిర్థారణ అయ్యింది. ఆయన తన తండ్రి స్ఫూర్తితో సైన్యంలో చేరాలని కలలు కంటూ పెరిగాడు కానీ ఎనిమిదో తరగతితోనే చదువు మానేయక తప్పలేదు. చదువు మానేయడం రావత్‌కు చాలా కష్టంగా అనిపించినా తప్పలేదు.
దాంతో అంతా అతడి భవిష్యత్తు ఎలా ఉంటుందా అని అనుకున్నారు. చివరికి తనకంటూ ఒక మార్గాన్ని నిర్మించుకుని అందరూ తన వైపు తిరిగి చూసేలా చేసుకున్నాడు. అంతేగాదు రావత్ వీడియోలు చిత్రీకరించడం, ఎడిట్ చేయడం స్వయంగా నేర్చుకుని, పరుగు, జిమ్ వర్కౌట్‌లు, ఫిట్‌నెస్ ఛాలెంజ్‌లు, తోసహా తన దైనందిన జీవితానికి సంబంధించి ప్రతీ కంటెంట్‌ను పంచుకునేవాడు. అప్పటి నుంచే అతని జర్నీ యావత్తు ప్రపంచం దృష్టిని ఆకర్షించింది.
అతన కంటెంట్ తన సామార్థ్యాలపై దృష్టిని సారిస్తోంది. పైగా ఆ వ్యాధి తన సామార్థాలను ఆపలేదు, పరిమితులను విధించలేదు అని చెబుతున్నట్లుగా ముందుగా సాగుతున్నాడు రావత్. నెటిజన్లు కూడా నిన్ను చూస్తే గర్వంగా ఉంది. నువ్వు మాకు స్ఫూర్తివి. వదిలేయడం అనేది రక్తంలోనే లేదు అనడానికి నువ్వే నిదర్శనం అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు.
(చదవండి: 104 ఏళ్లకు బెయిల్... 105లో స్వేచ్ఛ)
Tags : 1