Breaking News

వాటర్‌ స్కీయింగ్‌ పోటీల్లో పాల్గొన్న తొలి భారతీయ మహిళ ఆమె..!

Published on Wed, 07/09/2025 - 10:48

అనూజ వైద్య మరో రికార్డు సాధించింది. పర్వతారోహకురాలైన అనూజ వైద్య ఇప్పుడు కొత్త రికార్డుల కోసం నీటి మీద దృష్టి పెట్టారు. ఇంటర్నేషనల్‌ వాటర్‌ స్కీయింగ్‌ పోటీల్లో పాల్గొన్న తొలి భారతీయ మహిళ ఆమె. 

గుజరాత్‌ రాష్ట్రం, సూరత్‌కు చెందిన అనూజవైద్య గత నెల (జూన్‌) 24 నుంచి 29 వరకు థాయ్‌లాండ్‌లో జరిగిన ఏషియన్‌ వాటర్‌ స్కీయింగ్‌ అండ్‌ వేక్‌ బోర్డింగ్‌ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్నారు. బాల్యం నుంచి అనూజ స్పోర్ట్స్‌లో చురుగ్గా ఉండేవారు. ట్రెకింగ్, స్విమ్మింగ్‌తోపాటు తండ్రి ప్రోత్సాహంతో తాపి నదిలో వాటర్‌ స్పోర్ట్స్‌లో శిక్షణ పొందారు. ఆమె తల్లి సొంతరాష్ట్రం ఉత్తరాఖండ్‌. తల్లి ప్రోత్సాహంతో అనూజ ఆమె చెల్లి అదితి ఇద్దరూ పర్వతారోహణ చేశారు. 

ఎవరెస్ట్‌ పర్వతాన్ని 2019లో తొలి ప్రయత్నంలోనే అధిరోహించి ’ఎవరెస్ట్‌ సిస్టర్స్‌’ గా గుజరాత్‌ రాష్ట్రంలో పేరు తెచ్చుకున్నారు. ఈ సిస్టర్స్‌ ఉత్తరాఖండ్‌లో ‘గెట్‌ సెట్‌ అడ్వెంచర్స్‌’ పేరుతో అడ్వెంచర్‌ స్పోర్ట్స్‌ కంపెనీ స్థాపించారు. ఇదిలా ఉండగా 27 ఏళ్ల అనూజ వైద్య తాజాగా వాటర్‌ స్కీయింగ్‌ స్పోర్ట్స్‌లో భారత్‌ తరఫున పాల్గొన్నారు. రికార్డుల్లో శిఖరాగ్రాన్ని చేరిన అనూజ ప్రస్తుతం నీటి/మీద రికార్డుల బాట పట్టారు. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఈ క్రీడ మనదేశ మహిళల దృష్టిని పెద్దగా ఆకర్షించలేదు.  

వీరికంటే ముందు ఎవరెస్ట్‌ శిఖరాన్ని హరియాణకు చెందిన తాషి, నున్‌గ్షి మాలిక్‌లు ఎవరెస్ట్‌ను (2023)అధిరోహించారు. సెవెన్‌ సమ్మిట్స్‌ పూర్తి చేసిన తొలి సిస్టర్స్‌గా రికార్డు సొంతం చేసుకున్నారు. అనూజ వేసిన తొలి అడుగుతో కొత్తతరం క్రీడాకారిణులు ఆ దారిలో నడుస్తారని ఆశిద్దాం.  

(చదవండి: ఐరన్‌ సయామీ..! ఒకే ఏడాదిలో రెండుసార్లు..)

#

Tags : 1

Videos

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు