Breaking News

అనంత్‌-రాధిక ప్రీ-వెడ్డింగ్‌ : పాక్‌ జీడీపీ, నీతా నగలపై సెటైర్లు

Published on Thu, 03/07/2024 - 14:11

రిలయన్స్‌ అధినేత బిలియనీర్‌ ముఖేష్‌ అంబానీ, రిలయన్స్‌  ఫౌండేషన్‌ చైర్‌ పర్సన్‌ నీతా అంబానీ దంపతుల చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ  ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు ఇంటర్నెట్‌లో పెద్ద సంచలనంగా మారాయి. అనంత్‌ అంబానీ-రాధికా మర్చంట్‌ పెళ్లి ఈ ఏడాది జూలై నిర్వహించేందుకు ఇరు కుటుంబాలు నిర్ణయించాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 1, 2, 3 తేదీల్లో ప్రీ వెడ్డింగ్‌ బాష్‌ అంగరంగ వైభంగా జరిగింది.  పలువురు   సెలబ్రిటీలు ఈ వేడుకల్లో సందడి చేశారు.

అయితే ఈ సందర్బంగా  అంబానీ కుటుంబం ఈ వేడుకులకు ఖర్చు పెట్టిన కోట్లాది రూపాయలపై పెద్ద చర్చ నడిచింది.  ప్రీ  వెడ్డింగ్‌ వేడుకలకే ఇంత హంగామా అని కొందరు, లక్షల కోట్లకు అధిపతి అయిన  ముఖేష్‌ అంబానీ 12 వందల కోట్లు  వెచ్చించడం పెద్ద ఖర్చే కాదని మరికొందరు వాదించారు.  

దీంతోపాటు వందల కోట్ల విలువ చేసే  అంబానీ భార్య నీతా అంబానీ, పెద్ద కొడలు శ్లోకామెహతా, కుమార్తె ఇషా అంబానీ ధరించి డైమండ్‌ నగలు, కాబోయే వరుడు అనంత్‌ అంబానీ డైమండ్‌ వాచ్‌ గురించి ఇంటర్నెట్‌ తీవ్ర చర్చ నడిచింది.  

ఇదంతా ఒక ఎత్తయితే  నీతా అంబానీ ధరించి రూ. 500-600 కోట్ల విలువైన డైమండ్‌ నెక్లెస్‌ వైరల్‌గా మారింది. పాకిస్తాన్‌ జీడీపీ కంటే నీతా అంబానీ  డైమండ్‌ నెక్లెస్‌ ధరే ఎక్కువ అంటూ నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే ఇన్‌స్టాలో  పలు పోస్ట్‌లు వైరల్‌గా, తాజాగా ఏఎన్‌ఐ షేర్‌ చేసిన వీడియోపై ఇదే కమెంట్లు కనిపించడం గమనార్హం.

కాగా ఐఎంఎఫ్‌ అంచనాల ప్రకారం పాకిస్తాన్ జీడీపీ దాదాపు 341 కోట్ల డాలర్లు (రూ. 28.23 లక్షల కోట్లు)గా ఉన్న సంగతి తెలిసిందే. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)