Breaking News

ఎంత గ్రాండ్‌మాస్టర్‌ అయినా తల్లి చాటు బిడ్డే..!

Published on Thu, 07/31/2025 - 11:26

చెస్‌ గురించి పెద్దగా ఆసక్తి లేని వారికి కూడా ఇప్పుడు సుపరిచిత పేరు... దివ్యా దేశ్‌ముఖ్‌. ప్రపంచం మెచ్చిన అపూర్వ విజయం తరువాత తన తల్లిని కౌగిలించుకొని భావోద్వేగానికి గురువుతున్న దివ్య వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ‘తల్లి అంటే ఎంతోమంది స్టార్‌ల వెనుక ఉన్న అన్‌సంగ్‌ హీరో’ అని దివ్య తల్లి గురించి ప్రశంసిస్తూ ఈ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు పారిశ్రామిక దిగ్గజం ఆనంద్‌ మహీంద్ర. 

‘ఎంత గ్రాండ్‌మాస్టర్‌ అయినా తల్లి చాటు బిడ్డే’ అన్నారు నెటిజనులు. తల్లులు పిల్లల గురించి ఎన్నో కలలు కంటారు. వారి కలలను తమ కలలుగా భావిస్తారు. వారి కష్టాలను తమ కష్టాలుగా భావిస్తారు. పిల్లల కంటే ఎక్కువగా వారి విజయాలకు సంతోషంతో ఉప్పొంగిపోతారు. అందుకే...అమ్మలు అన్‌సంగ్‌ హీరోలు. ఉమెన్స్‌ చెస్‌ వరల్డ్‌ కప్‌  గెలుచుకున్న తరువాత ‘ఎవరీ దివ్య దేశ్‌ముఖ్‌?’ అనే ఆసక్తి చాలామందిలో మొదలైంది. చాలా చిన్న వయసు నుంచే చెస్‌ ఆడడం మొదలుపెట్టిన దివ్య చెస్‌లోనే కాదు చదువులోనూ ‘శభాష్‌’ అనిపించుకునేది. 

‘అయిదేళ్ల వయసు నుంచే చెస్‌లో అద్భుతమైన ఆటతీరును ప్రదర్శిస్తూ వస్తోంది దివ్య. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో పతకాలు గెలుచుకున్న దివ్యకు కామ్‌గర్ల్‌గా పేరు. జయాపజయాలలో ఒకేరకంగా ఉండడం కొందరికి మాత్రమే సాధ్యపడుతుంది. అలాంటి వారిలో దివ్య ఒకరు. ఓడిపోయిన సందర్భంలోనూ ఆమె కళ్లలో బాధ కనిపించేది కాదు. టోర్నమెంట్‌ గెలచినప్పుడు ట్రోఫీతో నా దగ్గరకు వచ్చేది. 

తాను సాధించిన విజయం గురించి ఎంతోమాట్లాడే అవకాశం ఉన్నప్పటికీ చాలా తక్కువగా మాట్లాడేది. తనకు ఇష్టమైన ఆట, చదువును రెండిటినీ విజయవంతంగా సమన్వయం చేసుకునేది. నాగ్‌పూర్‌ కాకుండా వేరే చోట చెస్‌ పోటీలు జరిగినప్పుడు పాఠ్యపుస్తకాలను తీసుకువెళ్లేది. చదువును ఎప్పుడూ అశ్రద్ధ చేయలేదు’ అంటూ గత జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంది నాగ్‌పూర్‌లోని భారతీయ విద్యాభవన్‌ స్కూల్‌ మాజీ ప్రిన్సిపాల్‌ అంజు భూటాని.

 

(చదవండి: రికార్డు బ్రేకింగ్‌ నాట్య ప్రదర్శన..! ఏకంగా 170 గంటల పాటు..)

Videos

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)