Breaking News

ఎనభై రెండేళ్ల ఎనర్జీ!

Published on Wed, 09/03/2025 - 04:13

సోషల్‌ మీడియా వేదికగా అసామాన్య సామాన్యుల గురించి పరిచయం చేస్తుంటారు పారిశ్రామిక దిగ్గజం ఆనంద్‌ మహీంద్రా. తాజాగా ఆయన తమిళనాడులోని పొల్లాచికి చెందిన కిట్టమ్మాళ్‌ గురించి పోస్ట్‌ పెట్టారు.శక్తికి వయసు అడ్డుకాదని నిరూపించింది 82 సంవత్సరాల కిట్టమ్మాళ్‌. పవర్‌ లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్స్‌లో పాల్గొనే కిట్టమ్మాళ్‌ ఉత్సాహానికి కేరాఫ్‌ అడ్రస్‌.

‘ఎనభై రెండు సంవత్సరాల వయసులో ఆమె పైకెత్తేది బరువులను కాదు. మనలో దాగి ఉన్న ఆత్మవిశ్వాసాన్ని. కలలు కలడానికి, ఆ కలలు నెరవేర్చుకోవడానికి వయసు అడ్డుకాదని మరోసారి నిరూపించిన మహిళ’ అంటూ కిట్టమ్మాళ్‌ విల్‌పవర్‌ను కొనియాడారు ఆనంద్‌ మహీంద్రా.

కునియముత్తూరులో జరిగిన ‘స్ట్రాంగ్‌ ఉమెన్‌ ఆఫ్‌ సౌత్‌ ఇండియా’ పోటీలో పాల్గొన్న కిట్టమ్మాళ్‌ 17 మంది మహిళలతో పోటీ పడింది. ఈ మహిళలందరూ 30 కంటే తక్కువ వయసు ఉన్నవారే! డెడ్‌లిఫ్టింగ్‌ 50 కేజీల విభాగంలో అయిదో స్థానంలో నిలిచింది. తన మనవళ్లు రోహిత్, రితిక్‌ నుంచి స్ఫూర్తి పొందిన కిట్టమ్మాళ్‌ బామ్మ పవర్‌లిఫ్టింగ్‌లో పవర్‌ చాటుతోంది.

బరువులు ఎత్తడం ఆమెకు కొత్తేమీ కాదు. 25 కిలోల బియ్యం బస్తాలను అవలీలగా మోసుకెళ్లేది. ‘నేను తీసుకునే ఆహారమే నా శక్తి’ అంటున్న కిట్టమ్మాళ్‌ సంప్రదాయ, పోషక విలువలతో కూడిన ఆహారానికిప్రాధాన్యత ఇస్తుంది.

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)