Breaking News

ఆ నేత ఆలోచన 'వేరేలెవెల్‌'..గెలుపుని కూడా పర్యావరణ హితంగా..!

Published on Thu, 06/06/2024 - 11:34

ఇటీవల లోక్‌సభ, ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ ముగిసిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు, పార్టీ కార్యకర్తలు బాణా సంచాలతో, మిఠాయిలతో ఆ విజయోత్సాహాన్ని ఆనందంగా జరుపుకుంటారు. ఎవ్వరైనా ఇలానే చేస్తారు. మరొకందరూ వారీ మతానుసారంగా పూజలు, మొక్కలు, చెల్లించుకోవడం చేస్తారు. మహా అయితే అన్నదానాలు చేస్తారు. కానీ ఈ ఎంపీలా ఇలా సెలబ్రేట్‌ చేసుకోవాలని ఎవ్వరూ ఆలోచించరేమో..!. అతడేమీ మిగతా అభ్యర్థుల్లా స్వేచ్ఛగా ప్రచార ర్యాలీతో ఎన్నికల బరిలోకి దిగిన వ్యక్తి కాదు. అయినప్పటికీ ఎన్నికల్లో విజయకేతనం ఎగరువేయడమే గాక ఆ సంతోషాన్ని  ఇలా సెలబ్రేట్‌ చేయమని తన అభ్యర్థులను కోరి..అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అతడి వినూత్న ఆలోచన చూసి..'వాటే ఎంపీ' అంటూ అంతా ప్రశంసిస్తున్నారు.

అతడే అమృత్‌పాల్‌. 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే..కొందరు అభ్యర్థులు జైల్లో ఉన్నప్పటికీ ఎంపీ ఎన్నికల్లో విజయం సాధించారు.వారిలో ఒక అభ్యర్థే ఈ అమృత్‌పాల్‌. స్వతంత్ర అభ్యర్థి అమృతపాల్ సింగ్ పంజాబ్‌లోని ఖదూర్ సాహిబ్ లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందారు. ఇతడు రాడికల్ సిక్కు బోధకుడు, ఖలిస్థానీ అనుకూల గ్రూప్ ‘వారిస్ పంజాబ్ దే’ అధినేత. ఖదూర్ సాహిబ్ లోక్‌సభ స్థానం నుంచి అమృతపాల్ సింగ్ దాదాపు లక్షా 90 వేల ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. 

ప్రస్తుతం అసోం జైలులో ఉన్నారు. జాతీయ భద్రతా చట్టం కింద అమృతపాల్‌ను అరెస్టు చేశారు. అమృతపాల్ సింగ్ జైలులో ఉండగానే పెద్ద విజయం సాధించారు. అయితే ఈ విజయాన్ని మిఠాయలతో సెలబ్రేట్‌ చెయ్యొద్దని అన్నారు. అందరికి ఉచితంగా మొక్కలను పంపిణీ చేసి వేడుక చేసుకోవాలని తన అభ్యర్థులకు సూచించారు. అంతేగాదు దాదాపు  5 లక్షల మొక్కలను పంపిణీ చేసేలా యత్నించమని అన్నారు. 

తాను వేడి, కాలుష్యం పట్ల ఆందోళన చెందుతున్నానని, అందువల్ల పర్వావరణ హితార్థం ఇలా మొక్కలు పంచండని అభ్యర్థులను కోరారు. వారు కూడా అతడు చెప్పినట్లు అతడి పేరుతో మొక్కలను డిస్ట్రూబ్యూట్‌ చేశారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు పర్యావరణం పట్ల స్ప్రుహ కలిగిన గొప్ప నేత అంటూ ‍ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. 

 

(చదవండి:  ఆ చిన్న సిరామిక్‌ మేక బొమ్మ అన్ని లక్షలా..!)
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)