Breaking News

మణికట్టుపై పల్స్‌ లేకపోవడం ప్రమాదకరమా!.. బిగ్‌బీకి సైతం..

Published on Wed, 05/28/2025 - 14:29

బాలీవుడ్ మెగాస్టార్‌, బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలతో అలరించిని గొప్ప నటుడు. ఏ పాత్రలోనే ఇట్టే ఒదిగిపోయి..ప్రేక్షకుల, విమర్శల ప్రశంసలు  అందుకున్న దిగ్గజ నటుడు. అయితే ఆయకు మణికట్టుపై పల్స్‌ అస్సలు ఉండదట. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా కౌన్‌ బనేగా కరోడ్‌పతి ఎపిసోడ్‌లో చెప్పారు. ఆ సీజన్‌ ఎపిసోడ్‌లో ‘సాధారణంగా హార్ట్ బీట్ తెలుసుకోవడానికి రెండు వేళ్లను శరీరంలో ఏ భాగంపై ఉంచి చూస్తారు?’ అనే ప్రశ్న వచ్చింది. ఆ ప్రశ్నకు మణికట్టు సమాధానం. ఆ నేపథ్యంలో బిగ్‌బీ తన మణికట్టుపై వేళ్లు పెట్టినా నాడి దొరకదని చెప్పుకొచ్చారు. దానికి గల కారణాన్ని కూడా వివరించారు. మరీ ఇలా పల్స్‌ ఉండకపోవడం ఏదైనా అనారోగ్యానికి సంకేతమా..?, ఎందువల్ల ఇలా జరుగుతుంది వంటి వాటి గురించి సవివరంగా తెలుసుకుందాం.

1982లో కూలీ సినిమా సమయంలో అమితాబ్‌ ప్రమాదం బారినపడ్డారు. ఆ ప్రమాదం కారణంగా చాలా రోజులు ఆస్పత్రిలో ఉండిపోవాల్సి వచ్చింది. అదీగాక ఆస్పత్రి సిబ్బంది ప్రతి అరగంటకొకసారి రక్తం తీసుకోవడానికి సూదులు గుచ్చేవారని అన్నారు. దాంతో మణికట్టుపై పల్స్ పనిచేయడం ఆగిపోయిందని అన్నారు. ప్రస్తుతం తన మెడపై మాత్రమే పల్స్‌ ఉంటుందని అన్నారు. 

ఇది సర్వసాధారణమా లేక ప్రమాదమా..?
ఇది సర్వసాధారణంగా గాయం, శస్త్ర చికిత్స లేదా రక్తనాళాలను ప్రభావితం చేసే వైద్య పరిస్థితులు వంటి వాటి కారణంగా సంభవిస్తుంది. వాస్తవానికి ఆరోగ్యవంతమైన వ్యక్తుల మణికట్టు వంటి ప్రామాణిక పాయింట్లలో పల్స్‌ సులభంగా తెలుస్తుంది, గుర్తించగలం కూడా. 

అయితే గాయం లేదా ధమనులకు సంబంధించిన సమస్యల కారణంగా కొత్తమందికి బలహీనమైన పల్స్‌ ఉండొచ్చని అన్నారు వైద్యులు. అయితే ఇలా లేకపోవడం మాత్రం మొత్త ఆరోగ్యానికి అంత ప్రమాదకరమేమి కాకపోయినా..కారణమేంటన్నది తెలుసుకోవాల్సిందేనని నొక్కి చెప్పారు.

మన హార్ట్‌ బీట్‌ని గుర్తించడానికి ఉపకరించేవి శరీరంలోని పల్స్‌ పాయింట్లేనని అన్నారు.  మన శరీరంలో ఎక్కడెక్కర్‌ పల్స్‌ ఉంటాయంటే..

రేడియల్ పల్స్: బొటనవేలు బేస్ దగ్గర మణికట్టు మీద
కరోటిడ్ పల్స్: మెడకు ఇరువైపులా, వాయునాళం పక్కన
ఫెమోరల్ పల్స్: గజ్జ ప్రాంతంలో
పాప్లిటియల్ పల్స్: మోకాలి వెనుక
డోర్సాలిస్ పెడిస్ పల్స్: పాదం పైభాగంలో
పోస్టీరియర్ టిబియల్ పల్స్: చీలమండ ఎముక వెనుక
ఇలా శరీరంలోని ఈ విభిన్న ప్రాంతాల్లోని నాడీ స్పర్శ సాయంతో హృదయ స్పందనని అంచనా వేస్తారు ఆరోగ్య సంరక్షణ నిపుణులు.

పల్స్‌ తెలుసుకోవడం ఎలా అంటే..
పల్స్‌ను తనిఖీ చేయడం అనేది చాలా ముఖ్యమైనది. పైగా సింపుల్‌ తెలుసుకునే క్లినకల్‌ అంచనా. అందుకోసం మన చూపుడు, మధ్య వేళ్లను పల్స్‌ పాయిట్లపై ఉంచి.. వారి హృదయస్పందన రేటు ఎంత వేగంగా లేదా నెమ్మదిగా ఉందనేది అంచనావేస్తారని చెబుతున్నారు నిపుణులు. 

అలా అని నిర్లక్ష్యం చెయ్యొద్దు..
మణికట్టులో పల్స్‌ లేకపోతే దాన్ని తేలిగ్గా తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఎందుకంటే..ఆ వ్యక్తికి గాయం లేదా ఎలాంటి శస్త్ర చికిత్సలు జరిగిన ఆరోగ్య చరిత్ర లేకపోతే ప్రమాదకరమేనని హెచ్చరిస్తున్నారు. 

ఇది రక్తప్రసరణ సరిగా లేకపోవడం లేదా ధమని అడ్డంకి లేదా నరాల సంబంధిత సమస్యని సూచిస్తుంది. దీన్ని గనుక నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో వైద్యుడిని సంప్రదించనట్లయితే అంతర్లీనంగా ఉన్న వైద్య పరిస్థితిని ముందుగా గుర్తించి అనారోగ్య సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. 

 

గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాల కోసం వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం

(చదవండి: భారతీయుల దంతాలు బాగుంటాయ్‌..! జర్మన్‌ వ్యక్తి ప్రశంసల జల్లు)
 

Videos

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)