Breaking News

బిగ్‌బీ దివాలీ గిఫ్ట్‌ : నెట్టింట ట్రోలింగ్‌ మామూలుగా లేదుగా!

Published on Tue, 10/28/2025 - 10:52

బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు, బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ దీపావళి కానుక ఇపుడు నెట్టింట  విమర్శలకు తావిస్తోంది. సిబ్బందికి దివాలీ కానుకకు సంబంధించిన వీడియో హాట్‌ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియాలో చాలా మంది  బిగ్‌బీ  దివాలీ గిఫ్ట్‌కు మెచ్చుకోగా,  మరికొందరు ఆయన కానుకపై నిరాశగా పెదవి విరిచారు. సిగ్గు చేటు అంటూ ట్రోల్‌ చేస్తున్నారు. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే...  

బిగ్‌బీ తన సిబ్బందికి దీపావళి కానుకగా రూ.10,000 నగదు, ఒక స్వీట్ బాక్స్ ఇచ్చారంటూ ముంబైలోని అమితాబ్ నివాసం జుహూ వద్ద ఒక కంటెంట్ క్రియేటర్ ఈ వీడియోను తీసి, దాన్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు.   బాలీవుడ్ అతిపెద్ద నటుడు అమితాబ్ బచ్చన్ తన ఇంటి సిబ్బందికి ,భద్రతా సిబ్బందికి రూ. 10,000 నగదు , ఒక స్వీట్‌ బాక్స్‌ ఇచ్చారు అనే క్యాప్షన్‌తో ఈ వీడియోనే షేర్‌ చేశాడు.  ఈ వీడియోపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన రావడం గమనార్హం.  ఈ వీడియో వేలాది వీక్షణలతోపాటు  నెటిజన్లలో చర్చకు దారితీసింది. పండుగ సీజన్‌లో తన ఉద్యోగులను ప్రశంసించినందుకు కొందరు అమితాబ్‌ను ప్రశంసించారు.  

మరికొందరు బిగ్‌బి లాంటి వాళ్ల స్థాయికి, ఆస్తులతోపోలిస్తే ఇది  "చాలా తక్కువ" ,"ఇది చాలా విచారకరం అనే విమర్శలు వెల్లువెత్తాయి. మరికొందరైతే,  రోజంతా మీ భద్రకోసం, మీకోసం కాపలాకాసే వారికి కేవల 10వేల రూపాయలా, సిగ్గు చేటు, దీపావళి నాడు ప్రతి ఒక్కరూ తమ సిబ్బందికి రెట్టింపు జీతం ఇవ్వాలి. కొంతమంది 20-25 వేలు బోనస్‌గా కూడా ఇస్తారు"  అంటూ స్పందించారు.  పలు కంపెనీలు, ​ కార్పొరేట్లు తమ కార్మికులకు లగ్జరీ దీపావళి  కానుకలు, హ్యాంపర్లు బహుమతిగా ఇస్తున్న వీడియోలతో సోషల్ మీడియా నిండిపోయిన సమయంలో ఈ ట్రోలింగ్‌  విపరీతంగా నడుస్తోంది.

నోట్‌: ఈ వీడియోలో అమితాబ్‌ క్లిప్‌లో పలువురు సిబ్బంది, భద్రతా సిబ్బంది బహుమతులు అందుకున్నట్లు కనిపిస్తున్నప్పటికీ,  దీనిపై  ఎలాంటి ధృవీకరణ లేదు. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)