Breaking News

పిల్లలు ఇష్టపడేలా ఆకుకూరలతో అద్భుతమైన వంటకాలు

Published on Sat, 11/22/2025 - 14:49

క్యాల్షియం, ఐరన్, ఇతర  పోషకాలు సమృద్ధిగా ఉండే ఆకుకూరలు అన్ని వయసుల వారికీ మేలు చేస్తాయి.  సంప్రదాయ వంటలుగానే కాదు పిల్లలు ఇష్టపడేలా ఆకుకూరలతోనూ వంటిల్లును టేస్టీగా సిద్ధం చేయండి.

 పాలక్‌ హమ్మస్‌ 
కావల్సినవి: పాలకూర – కప్పు; కాబూలి చనా (తెల్లశనగలు) – 1/2 కప్పు (4–5 గంటలు సేపు తగినన్ని నీళ్లలో నానబెట్టాలి); నువ్వులు – 2 టేబుల్‌ స్పూన్లు; కొత్తిమీర తరుగు – 2 టేబుల్‌ సూన్లు; వెల్లుల్లి రెబ్బలు – 4; జీలకర్ర – టేబుల్‌ స్పూన్‌; ఆలివ్‌ ఆయిల్‌ – 2 టేబుల్‌ స్పూన్లు; నిమ్మరసం – టేబుల్‌ స్పూన్‌; ఉప్పు – తగినంత.

తయారీ: ∙నానబెట్టిన తెల్ల శనగలను ఉడికించాలి ∙శనగలు చల్లారాక మిక్సర్‌లో శనగలతోపాటు పై అన్ని పదార్థాలను వేసి, మెత్తగా గ్రైండ్‌ చేయాలి. ∙ఉప్పు సరిచూసుకుని, ఒక గిన్నెలోకి తీసుకొని, బ్రెడ్, చిప్స్, ఇతర వెజిటబుల్‌ సలాడ్‌తో సర్వ్‌ చేయాలి. సాండ్‌విచ్‌ స్ప్రెడ్‌గానూపాలక్‌ హమ్మస్‌ను ఉపయోగించవచ్చు. 

చదవండి: 17 ఏళ్ల తరువాత ఇండియాకు ఎన్‌ఆర్‌ఐ జంట, వీడియో వైరల్‌

గోంగూర అవకాడో రైస్‌
కావల్సినవి:  అన్నం – 2 కప్పులు; గోంగూర (సన్నగా తరిగినది) – 2 కప్పులు; అవకాడో ముక్కలు – కప్పు; ఉప్పు – తగినంత; జీలకర్ర – అర టీ స్పూన్‌; ఇంగువ – చిటికెడు; ఆవాలు – అర టీ స్పూన్‌; మెంతులు –పావు టీ స్పూన్‌; కరివేపాకు రెమ్మలు – 2; ఎండుమిర్చి – 4; పచ్చిమిర్చి – 2; శనగపప్పు – టేబుల్‌ స్పూన్‌; మినప పప్పు – టీ స్పూన్‌; ఉప్పు – తగినంత; పసుపు –పావు టీ స్పూన్‌; పల్లీలు –పావు కప్పు. 
తయారీ:  ∙బాణలిలో నూనె వేడి చేసి, జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఇంగువ, కరివేపాకు వేసి కలపాలి ∙నిలువుగా కట్‌ చేసిన పచ్చిమిర్చి, శనగపప్పు, మినప్పప్పు వేసి, బంగారు రంగులోకి మారే వరకు వేయించాలి ∙గోంగూర ఆకులను వేసి, పేస్ట్‌ అయ్యేవరకు కలపాలి. దీంట్లో ఉప్పు, పసుపు వేసి కలపాలి.  ∙అన్నంలో గోంగూర మిశ్రమం, అవకాడో ముక్కలను బాగా కలిపి, వడ్డించాలి. 

తోటకూర పెస్టోపాస్తా
కావల్సినవి: పాస్తా – ఉడికించి పక్కనుంచాలి; తోటకూర (సన్నగా తరిగిన ఆకులు) – కప్పు; ఆలివ్‌ ఆయిల్‌ 2 టేబుల్‌ స్పూన్లు, బాదం, జీడిపప్పు పలుకులు – 2 టేబుల్‌ స్పూన్లు; వెల్లుల్లి – 4 రెబ్బలు; మిరియాల పొడి – రుచికి సరిపడా; ఉల్లిపాయ తరుగు- టేబుల్‌ స్పూన్‌; వెన్న లేదా బటర్‌ – టేబుల్‌ స్పూన్‌; చీజ్‌ – తగినంత; ఉప్పు – తగినంత.

తయారీ: ∙మిక్సర్‌ జార్‌లో తోటకూర, జీడిపప్పు, బాదంపప్పు, వెల్లుల్లి, తురిమిన చీజ్, ఉప్పు, మిరియాల  పొడి వేయాలి. ∙ఆలివ్‌ ఆయిల్‌ను కొద్ది కొద్దిగా వేస్తూ, మెత్తని పేస్ట్‌ అయ్యే వరకు బ్లెండ్‌ చేయాలి ∙ఉడికించిన పాస్తాలో తోటకూర పెస్టో సాస్‌ వేసి బాగా కలపాలి ∙తరిగిన ఉల్లిపాయలు, వెన్న లేదా నూనెలో వేయించిపాస్తాలో కపాలి ∙పైన మిరియాలపొడి చల్లి వేడివేడిగా వడ్డించాలి.

ఇదీ చదవండి: ఇంటర్న్స్‌ కావాలి, నెలకు రూ. లక్ష స్టైఫండ్‌ : ట్విస్ట్‌ ఏంటంటే

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)