Breaking News

బచ్చలికూర ఎంత మేలో.. తెలిస్తే అస్స‌లు వ‌దులుకోరు!

Published on Sat, 12/16/2023 - 10:28

'మనకు అందుబాటులో ఉండే అనేక రకాల ఆకుకూరల్లో బచ్చలి కూర ఒకటి. కానీ, బచ్చలికూరను చాలామంది ఇష్టపడరు.. అయితే, బచ్చలికూరలో దాగివున్న ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే మాత్రం నిజంగా బంగారమే అంటారు.'

బచ్చలి కూరలో విటమిన్ ఎ, సి, ఇ, కె, మెగ్నీషియం, ఫోలేట్, పొటాషియం, ఐరన్, కాపర్ పుష్కలంగా ఉన్నాయి. ఇది ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, డైటరీ ఫైబర్, ఫ్లేవనాయిడ్స్‌కు భాండాగారం. రక్తహీనతతో బాధపడే వారికి బచ్చలి కూర దివ్యౌషధంలా పని చేస్తుంది. శరీరంలో రక్తం తక్కువగా ఉన్నవారు తమ రోజు వారి ఆహారంలో బచ్చలికూరను చేర్చుకుంటే ఆ సమస్య నుంచి త్వరగా బయటపడగలరని నిపుణులు చెబుతున్నారు.

హైబీపీ పేషెంట్లు బచ్చలి ఆకులను రసంగా చేసుకుని తాగుతుంటే.. రక్తపోటు అదుపులో ఉంటుంది. అంతేకాదు.. బచ్చలి కూర గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బచ్చలికూరను తరచూ తీసుకోవటం ద్వారా శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొలెస్ట్రాల్ కరుగుతుంది. బచ్చలి కూరలో ఉండే కాల్షియం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి.

బచ్చలి కూరలో అధికంగా ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, నియాసిన్, సెలీనియం నరాల ఆరోగ్యానికి, మెదడు ఆరోగ్యానికి ఎంతో సహా యపడతాయి. అంతేకాదు, మూత్రంలో మంట, ఇన్ఫెక్షన్ వంటి సమస్యలతో బాధపడేవారు రెగ్యులర్‌గా బచ్చలి కూరను తీసుకోవడం వల్ల మూత్ర విసర్జనలోని సమస్యలు తొలగిపోతాయి, పైల్స్, కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు వంటి సమస్యలతో బాధపడేవారు బచ్చలికూరను తింటే ఈ సమ స్యనుంచి ఉపశమనం లభిస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
ఇవి చ‌ద‌వండి: 'ఇంగువ'ని ఇలా తీసుకుంటే ఈజీగా బరువు తగ్గుతారు!

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)