Breaking News

అందం, ఆరోగ్యమే కాదు, బరువు తగ్గడంలో కూడా ‘గేమ్‌ ఛేంజర్‌’ ఇది!

Published on Mon, 01/27/2025 - 15:46

చిన్నపుడు ఏ చిన్న దెబ్బ తగిలినా, ఏ చిన్న నొప్పి వచ్చినా  మన అమ్మమ్మలు, నానమ్మలు ఉపయోగించే అద్భుతమై చిట్కా కొబ్బరి నూనె. పైపూతగా మాత్రమే కాదు కడుపులోకి తీసుకోవడం ద్వారా కొబ్బరి నూనె వల్ల కూడా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అందుకే ఆయుర్వేదంలో దీనికి  చాలా ప్రాధాన్యత ఉంది.  కొబ్బరి నూనెలో చాలా పోషక విలువలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందా రండి.

కొబ్బరి నూనె అనగానే కేవలం జుట్టు మాత్రమే పనికొచ్చేది కాదు. శరీర ఆరోగ్యానికి, చర్మ ఆరోగ్యానికి చాలామంచిది. కేరళ, థాయ్‌లాండ్‌  లాంటి అనేక ప్రదేశాల్లో కొబ్బరినూనెను వంటల్లో వాడతారు. అలాగే   ఈ కొబ్బరి నూనెను ఉదయాన్నే పరగడుపున ఒక స్పూన్ తాగితే, శరీరంలో ఆరోగ్య సమస్యలన్నిటికీ దివ్య ఔషధం లాగా పని చేస్తుందని నమ్ముతారు.అధికబరువుతో బాధపడే వారు కొబ్బరి నూనెను గాలి కడుపుతో తీసుకుంటే బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇందులో మంచి కొవ్వు శరీరంలో నెమ్మదిగా జీర్ణం అవుతుంది.  

కొబ్బరి నూనెతో ఉపయోగాలు :

  • గుండె ఆరోగ్యానికి మంచిది. ఇది మంచి కొలెస్ట్రాల్ (HDL) ను పెంచడం ద్వారా, చెడు కొలెస్ట్రాల్ (LDL) తగ్గిస్తుంది

  • లారిక్ఆమ్లం పుష్కలంగా ఉండే బలమైన యాంటీమైక్రోబయల్ లక్షణాలు రోగనిరోధకశక్తిని  పెంచుతాయి.శరీరానికి హానికరమైన బ్యాక్టీరియా, వైరస్‌లు ,శిలీంధ్రాలతో ఫైట్‌ చేసి,  రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. సాధారణ ఇన్ఫెక్షన్‌లను దూరంగా ఉంచడానికి సహాయపడతాయి.

  • మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. కొబ్బరి నూనెలోని MCT లు కీటోన్‌లుగా మారి, మెదడుకు ప్రత్యామ్నాయ శక్తి వనరుగా పనిచేస్తాయి.  ఇది  జ్ఞాపకశక్తి, దృష్టి ,మానసిక స్పష్టతతో సహా అభిజ్ఞా విధులను మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా వయసు పెరిగే కొద్దీ ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మానసిక స్థితిలో హెచ్చుతగ్గులు తగ్గుతాయి .

  • కొబ్బరి నూనె  మరో ముఖ్యమైన లక్షణం బరువు తగ్గడంలో సహాయపడుతుంది. కొవ్వును కరిగిస్తుంది. శరీర కొవ్వుగా నిల్వలు పెరగకుండాకా పాడి,  బరువు నిర్వహణలో సహాయపడతాయి.

  • కొబ్బరి నూనెలోని యాంటీమైక్రోబయల్ లక్షణాలు హానికరమైన బ్యాక్టీరియాను తొలగించి,ఆరోగ్యకరమైన ప్రేగును ప్రోత్సహిస్తాయి. ఇది కొవ్వులో కరిగే విటమిన్లు, ఖనిజాలను గ్రహించడంలో సహాయపడుతుంది. మెరుగైన జీర్ణక్రియను అందిస్తుంది. ఉబ్బరం, మలబద్ధకం,  అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తుంది.

  • జుట్టు కండిషనింగ్‌కు కొబ్బరి నూనెకు మించింది లేదు.  ఇది జుట్టు కుదుళ్లలోకి చొచ్చుకుపోతుంది, ప్రోటీన్ నష్టాన్ని తగ్గిస్తుంది. జుట్టు తెగిపోకుండా నిరోధిస్తుంది. సహజమైన మెరుపు వస్తుంది. క్రమం తప్పకుండా వాడితే జుట్టు  ఒత్తుగా ఆరోగ్యంగా,  బలంగా పెరుగుతుంది.

  • కొబ్బరి నూనెతో ఆయిల్ పుల్లింగ్ వల్ల ప్లేక్ ఏర్పడటాన్ని తగ్గిస్తుంది. ఇందులోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలతో నోటి దుర్వాసన, చిగుళ్ల వ్యాధులను నివారించవచ్చు. 

  • వర్జిన్ కొబ్బరి నూనె  తొందరగా శక్తినిస్తుంది. శక్తి బూస్టర్‌గా పనిచేస్తుంది.

  • మంటను తగ్గించడంలో సహాయపడుతంది. క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఆర్థరైటిస్ వంటి లక్షణాలకు ఉపశమనం లభిస్తుంది.


చర్మానికి కొబ్బరి నూనె
కొబ్బరి నూనె ,చర్మ మెరుపునకు పెట్టింది పేరు.   పొడిగా మారిపోయిన చర్మానికి కొబ్బరినూనె పూస్తే సహజ సౌందర్యం వస్తుంది.  స్కిన్‌ బ్యూటీలో ఈ నూనె గేమ్-ఛేంజర్ అని చెప్పవచ్చు. మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది. స్నానానికి ముందు, తర్వాత గానీ  చర్మానికి కొద్దిగా కొబ్బరి నూనె  రాస్తే తేమను నిలుపుకుంటుంది, మీ చర్మాన్ని రోజంతా మృదువుగా , హైడ్రేటెడ్‌గా  ఉంటుంది. సహజ సిద్ధమూన మేకప్ రిమూవర్‌గా పనిచేస్తుంది. వాటర్ ప్రూఫ్ మస్కారాతో సహా మేకప్‌ను కరిగించడానికి కొబ్బరి నూనెతో ముఖంపై సున్నితంగా మసాజ్ చేయాలి. ఆ తరువాత గోరువెచ్చని నీళ్లలో  ముంచిన గుడ్డతో తుడిచేయాలి.

పగిలిన పెదాలకు  కొబ్బరి నూనె రాస్తే పెదాలు,  తేమఉంటాయి.  రసాయనాలు కలిపిన ప్రొడక్ట్స్‌తో పోలిస్తే ఇది చాలా ఉత్తమం. నెట్లోకి వెళ్లినా  ఎలాంటి హాని ఉండదు. కొబ్బరి నూనె అద్భుతమైన మసాజ్ ఆయిల్. 

నోట్‌ : ఇది అవగాహనకోసం అందించిన సమాచారం  మాత్రమే. ఈ లాభాలు, ప్రయోజనాలు అందరికీ ఒకేలా వర్తించవు. మెరుగైన ఫలితాలకోసం ఆరోగ్య నిపుణులును సంప్రదించడం ఉత్తమం.

చదవండి: చాలా కాస్ట్లీ గురూ! ఉప్పు పేరు చెబితేనే గూబ గుయ్య్‌..!

శానిటరీ ప్యాడ్‌ అడిగితే.. ఇంత దారుణమా! నెటిజన్ల ఆగ్రహం


 

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు