Breaking News

రణపాలతో ఆరోగ్య ప్రయోజనాలు : పేరులోనే ఉంది అంతా!

Published on Thu, 03/28/2024 - 14:05

ప్రకృతిలో వెదికి పట్టుకోవాలనే గానీ  ఎన్నో ఔషధ మొక్కల నిలయం. సౌందర్య పోషణ దగ్గర్నించి, దీర్ఘకాల రోగా వలరు ఉన్నో ఔషధ గుణాలున్న మొక్కలు మన చుట్టూనే ఉన్నాయి. అలాంటి వాటిలో రణపాల ఒకటి.

వాస్తవానికి రణపాల అలంకరణ మొక్కగా భావిస్తాం. కానీ ఆరోగ్య ప్రయోజనాలు కూడాచాలానే ఉన్నా యంటున్నారు  ఆయుర్వేద నిపుణులు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 150 వ్యాధులను నయం చేయగల శక్తి రణపాల మొక్కకి ఉంది.

ర‌ణ‌పాల శాస్త్రీయ నామం Bryophyllum pinnatum. దీని ఆకులు కాస్త మందంగా ఉంటాయి.  రుచి  కొద్దిగా  వ‌గ‌రు, పులుపు సమ్మిళితంగా ఉంటుంది. ఆకు నాటడం ద్వారానే మరో  మొక్కను అభివృద్ది చేసుకోవచ్చు. అంటే ఇంటి ఆవ‌ర‌ణ‌లో సుల‌భంగా పెంచుకోవ‌చ్చన్నమాట. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ మైక్రోబయోల్, యాంటీ ఫంగల్,యాంటీ హిస్టామైన్ తోపాటు అనాఫీలాక్టిక్ గుణాలు రణపాలలో అధికంగా  ఉన్నాయి

రణపాల ప్రయోజనాలు 
♦ ఆకు తినడం ద్వారా గానీ,  కషాయం తయారు చేసి తీసుకోవడం ద్వారా,  ఆకు  పేస్ట్‌ను కట్టు కట్టడం ద్వారా గానీ చాల ఉపయోగాలను పొందవచ్చు.
♦ అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.
♦ డయాబెటిస్ ని క్రమబద్దీకరిస్తుంది.
♦  కిడ్నీ స‌మ‌స్య‌లు తగ్గుతాయి.  కిడ్నీ స్టోన్లు ఉన్న‌వారికి ఎంత‌గానో మేలు చేస్తాయి. ఈ ఆకుల‌ను తింటే ర‌క్తంలోని క్రియాటిన్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి.
♦ జీర్ణాశ‌యంలోని అల్స‌ర్లు త‌గ్గుతాయి. అజీర్ణం, మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించుకోవ‌చ్చు
♦  ఆకులని వేడిచేసి గాయాలపై పెడితే  గాయాలు త్వరగా మానుతాయి
♦  ఆకులని నూరి దాన్ని తలపై పట్టులా వేస్తే  తల నొప్పి తగ్గుతుంది.
♦ రోజు ఈ ఆకుల్ని తినడం ద్వారా జుట్టు రాలడం తగ్గుతుంది. తెల్ల వెంట్రుక‌లు రావ‌డం ఆగుతుందట
♦ ఈ ఆకుల్లో యాంటీ పైరెటిక్ ల‌క్ష‌ణాలు  జ‌లుబు, ద‌గ్గు, విరేచ‌నాల‌ను న‌యం చేస్తాయి.
♦ మ‌లేరియా, టైఫాయిడ్ జ్వ‌రాలు వ‌చ్చిన వారు తీసుకుంటే మంచిది. 
♦  ర‌ణ‌పాల ఆకుల‌ను తిన‌డం వల్ల హైబీపీ త‌గ్గుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. మూత్రంలో ర‌క్తం, చీము వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.
♦ కామెర్లతో బాధపడేవారు రోజూ ఉద‌యం, సాయంత్రం ఈ ఆకుల ర‌సాన్ని తీసుకుంటే వ్యాధి న‌యం అవుతుందని ఆయుర్వేదం చెబుతుంది.

నోట్‌:  ఈ చిట్కాలను  పాటించేటపుడు, రెగ్యులర్‌గా సంప్రదించే డాక్టర్‌, ఆయుర్వేద నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)