Breaking News

కాక్‌పిట్ - క్యాబిన్ : మలేషియన్‌ ఎయిర్‌లైన్స్‌ చరిత్ర

Published on Tue, 09/23/2025 - 12:05

మహిళా సాధికారత విషయంలో మలేషియా ఎయిర్‌లైన్స్‌ కీలక అడుగు వేసింది. పూర్తిగా మహిళా సిబ్బందితో తన  తొలి విమానాన్ని ప్రారంభించింది.   చెక్-ఇన్ కౌంటర్ల నుండి, కాక్‌పిట్ నుండి క్యాబిన్ వరకు, మొత్తం విమాన ప్రయాణంలోని ప్రతి దశలోనూ మహిళలేబాధ్యతల్లో ఉండటం  విశేషం.  తద్వారా పూర్తిగా మహిళా సిబ్బందితో  తన తొలి విమానాన్ని విజయవంతంగా నిర్వహించడం ద్వారా మలేషియా ఎయిర్‌లైన్స్ చరిత్ర సృష్టించింది. 

సెక్యూరిటీ,  పైలట్లు,  కో-పైలట్లు , క్యాబిన్‌ క్రూ సహా పూర్తిగా మహిళా బృందమే ఉండటమే దీని విశేషం. కౌలాలంపూర్ నుండి కోటా కినాబాలుకు బయలుదేరిన విమానం (MH2610) ఎగిరింది.ఈ సమాచారాన్ని మలేషియన్‌ ఎయిర్‌లైన్స్‌ ఫేస్‌బుక్‌లో వెల్లడించింది.  మహిళల శక్తి సామర్థ్యాలను, వృత్తి నైపుణ్యం,నాయకత్వం గుర్తించాలని పేర్కొంది.

మలేషియా ఏవియేషన్ గ్రూప్  శ్రామిక శక్తిలో మహిళల సంఖ్య 36 శాతంగా  ఉంది. పురుషాధిపత్యం ఉన్న విమానయాన రంగంలో మహిళల ప్రాతినిధ్యంపై అంతర్జాతీయ వాయు రవాణా సంఘం (IATA) 2025  మైలురాయిని  అధిగమిండమనే కేవలం పురోగతిని మాత్రమే కాదు, ఆకాశానికి పరిమితులు లేవనే విషయాన్ని ఇది సూచిస్తుందని అని మలేషియా ఎయిర్‌లైన్స్ ఫేస్‌బుక్ పోస్ట్‌లో రాసింది. ఇది మరింతమందికి ప్రేరణ కావాలని అభిలషించింది.  ఆశావహులైన విమానాన్ని  నడపాలనుకునే వారు,  తదుపరి తరం అమ్మాయిలు అడ్డంకులను అధిగమించి, తమ కలలను సాధించడంలో తమ చర్య ప్రోత్సాహాన్నిస్తుందని ఎయిర్‌లైన్  పేర్కొంది.

ఇదీ చదవండి: Hair Dye: మెరిసిందని మురిసిపోవద్దు.. ఈ జాగ్రత్తలు మస్ట్‌
 

మలేషియా ఎయిర్‌లైన్స్ ప్రకారం, దేశీయ , అంతర్జాతీయ మార్గాల్లో 8,200 గంటలకు పైగా అనుభవం ఉన్న అనుభవజ్ఞురాలైన పైలట్ కెప్టెన్ నూర్సజ్రినా బింటి జుల్కిఫ్లి , ఇటీవల సర్టిఫికేషన్ పొందిన యువ పైలట్ సెకండ్ ఆఫీసర్ సితి నూర్ సయామిరా బింటి బహారుద్దీన్ బోయింగ్ 737-800 ను నడిపారు.


 

Videos

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)