Breaking News

అల్కా యాగ్నిక్‌కి అరుదైన వినికిడి సమస్య..ఎందువల్ల వస్తుందంటే..

Published on Wed, 06/24/2026 - 13:36

రెండోవిడత ‘పద్మ’ పురస్కారాల ప్రదానోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది. వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన దాదాపు 65 మంది ప్రముఖులకు రాష్ట్రపతి ద్రౌపదిముర్ము పురస్కారాలు అందజేశారు. ఈ వేడుకకు ప్రముఖ బాలీవుడ్ ప్లేబ్యాక్ సింగర్ అల్కా యాగ్నిక్ కూడా హాజరయ్యారు. ఆమెకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మవిభూషణ్‌ను ప్రదానం చేశారు. ఆమెకు లభించిన ఈ గుర్తింపును చూసి యాగ్నిక్‌ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోలో ఆమె చాలా బలహీనంగా కనిపించారు. పైగా ఆమెను సిబ్బంది చాలా జాగ్రత్తగా తీసుకురావడం స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో ఆమె అప్పటి నుంచి ఇంకా కోలుకోలేదా అన్న అనుమానాల లేవనెత్తాయి అభిమానుల్లో. యాగ్నిక్‌ 2024లో తాను అరుదైన వినికిడి సమస్యతో బాధపడుతున్నట్లు ప్రకటించగానే..ఒక్కసారిగా వినికిడి ఆరోగ్యంపై చర్చలు మొదలవ్వడమే గాదు అవగాహన ప్రాముఖ్యతను నొక్కి చెప్పింది. ఇంతకీ యాగ్నిక్‌ ఫేస్‌ చేస్తున్న వినికిడి సమస్య ఏంటంటే..

60 ఏళ్ల గాయని అల్కా యాగ్నిక్ అత్యంత అరుదైన సెన్సోరిన్యూరల్ హియరింగ్ లాస్‌(SNHL)తో బాధపడుతోంది. ఆమె కారణంగానే ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది ఈ సమస్యను ఏదో ఒక దశలో ఎదుర్కొంటున్నట్లు నివేదికల్లో వెల్లడైంది. అసలేంటి సమస్య అంటే..

సెన్సోరిన్యూరల్ హియరింగ్ లాస్ అంటే?
లోపలి చెవి (కోక్లియా) లేదా మెదడుకు ధ్వని సంకేతాలను పంపే శ్రవణ నాడి మార్గాలకు నష్టం జరిగినప్పుడు సెన్సోరిన్యూరల్ హియరింగ్ లాస్ (SNHL) సంభవిస్తుంది.

చెవిలో గులిమి పేరుకుపోవడం లేదా ఇన్ఫెక్షన్ల వల్ల కలిగే తాత్కాలిక వినికిడి సమస్యల వలె కాకుండా, SNHL తరచుగా శాశ్వతంగా ఉంటుంది. ఇది ఒక మనిషి వినగల, మాట్లాడగల సామర్థ్యాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తుంది. ఇక గాయని యాగ్నిక్‌కిఒక ఆకస్మిక వైరల్ దాడి కారణంగా ఈ వినికిడి లోపం మొదలైందట. దీని కారణంగా ఆమె వినికిడి సామర్థ్యం ఊహించని విధంగా తీవ్రంగా క్షీణించింది.

సెన్సోరిన్యూరల్ వినికిడి లోపం లక్షణాలు
సెన్సోరిన్యూరల్ హియరింగ్ లాస్‌ లక్షణాలు తీవ్రతను బట్టి మారవచ్చని అంటున్నారు వైద్యులు.

  • ఆకస్మిక లేదా క్రమమైన వినికిడి లోపం

  • సంభాషణలను అర్థం చేసుకోవడంలో ఇబ్బంది

  • చెవులలో రింగుమని శబ్దం (టిన్నిటస్)

  • మసకగా వినిపించే శబ్దాలు

  • శబ్దాలతో కూడిన వాతావరణంలో వినడంలో ఇబ్బంది

  • ఇతరులు అస్పష్టంగా మాట్లాడుతున్నారని అనిపించడం

కొన్ని సందర్భాల్లో, వినికిడి లోపం అకస్మాత్తుగా సంభవించవచ్చు, తక్షణ వైద్య సహాయం అవసరం కావచ్చు.

SNHLకి కారణం..

సెన్సోరిన్యూరల్ వినికిడి లోపానికి అనేక కారకాలు దోహదం చేస్తాయి, వాటిలో ఇవి ఉన్నాయి:

వైరల్ ఇన్ఫెక్షన్లు
కొన్ని రకాల వైరల్ ఇన్ఫెక్షన్లు వినికిడికి బాధ్యత వహించే లోపలి చెవి నిర్మాణాలను దెబ్బతీస్తాయి.

పెద్ద శబ్దానికి గురికావడం
పెద్ద సంగీతం, కచేరీలు, హెడ్‌ఫోన్‌లు లేదా వృత్తిపరమైన శబ్దానికి దీర్ఘకాలం పాటు గురికావడం వల్ల కోక్లియా లోపల ఉన్న సున్నితమైన హెయిర్ సెల్స్ శాశ్వతంగా దెబ్బతినవచ్చు.

వయసు పైబడటం
వయసు సంబంధిత వినికిడి లోపం అనేది సెన్సోరిన్యూరల్ వినికిడి లోపం (SNHL) అత్యంత సాధారణ రూపాలలో ఒకటి.

కొన్ని రకాల మందులు
ఓటోటాక్సిక్‌గా పిలిచే కొన్ని రకాల మందులను దీర్ఘకాలం పాటు వాడినప్పుడు, అవి వినికిడిని దెబ్బతీయవచ్చు.

వైద్య పరిస్థితులు
ఆటోఇమ్యూన్ రుగ్మతలు, తల గాయాలు, కణితులు, రక్తప్రసరణ సమస్యలు కూడా వినికిడిని ప్రభావితం చేయగలవు.

వినికిడి ఆరోగ్యం ఎందుకు ముఖ్యం?
వినికిడి లోపం కేవలం చెవులను మాత్రమే ప్రభావితం చేయదు. చికిత్స చేయని వినికిడి సమస్యలు మానసిక ఆరోగ్యం, సామాజిక సంబంధాలు, సంభాషణ, మొత్తం జీవన నాణ్యతపై ప్రభావం చూపుతాయని పరిశోధనలు చెబుతున్నాయి. వినికిడి లోపం ఉన్నవారు సామాజిక ఒంటరితనం, ఆందోళన, నిరాశ, పని ప్రదేశంలో ఉత్పాదకత తగ్గడం, సంభాషణలో ఇబ్బందులు,కొన్ని సందర్భాల్లో మతిమరుపు సంబంధిత సమస్యలు ఎదురవుతాయని చెబుతున్నారు. ముం

చికిత్స చేయవచ్చా?
చికిత్స అనేది వినికిడి లోపం కారణం,తీవ్రతపై ఆధారపడి ఉంటుంది.

  • వినికిడి పరికరాలు (హెయిరింగ్ ఎయిడ్స్)

  • కాక్లియర్ ఇంప్లాంట్లు

  • సహాయక వినికిడి పరికరాలు

  • శ్రవణ పునరావాసం

  • అంతర్లీన వైద్య పరిస్థితులకు చికిత్స

అకస్మాత్తుగా వినికిడి లోపం సంభవించిన సందర్భాలలో తక్షణ వైద్య మూల్యాంకనం చాలా కీలకం. ఎందుకంటే ముందస్తు జోక్యం కోలుకునే అవకాశాలను మెరుగుపరుస్తుంది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
వినికిడి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి నిపుణులు కొన్ని సులభమైన చర్యలను సూచించారు. అవేంటంటే..

హెడ్‌ఫోన్ వాల్యూమ్‌ను 60 శాతం కంటే తక్కువగా ఉంచండి
బిగ్గరగా ఉండే పరిసరాలలో ఎక్కువసేపు ఉండటాన్ని పరిమితం చేయండి
అవసరమైనప్పుడు చెవి రక్షణను ఉపయోగించండి
అకస్మాత్తుగా వినికిడిలో మార్పులు వస్తే వైద్యుడిని సంప్రదించండి
క్రమం తప్పకుండా వినికిడి పరీక్షలను చేయించుకోవడం

(చదవండి: ఆరు నెలల్లో పదికిలోలు..కానీ అనుహ్యంగా యథావిధి ఎందుకిలా అంటే..!)

Videos

సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి పిటిషన్ పై విచారణ

బట్టల్లేకుండా రక్తపుమడుగులో గాయత్రి ఆరోజు అర్ధరాత్రి HOTEL లో..!

60 ఏళ్లుగా సాధ్యం కాని రికార్డు బ్రేక్

బిగ్ షాక్ ఇచ్చిన త్రిష - విజయ్ షేక్ అవుతున్న తమిళనాడు

ఆ తల్లి బూడిద అడిగితే... ఏ కులం అంటు..!

JC ప్రభాకర్ రెడ్డికి బిగ్ షాక్ తాడిపత్రిలో YSRCP భారీ నిరసన

క్రాంతి కుమార్ ఇంటికి ఏపీ హైకోర్టు న్యాయవాదుల బృందం

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్

కమిషనరేట్ నుంచి కృష్ణలంక పీఎస్ దాకా.. అందరికీ ఈ కేసుతో లింకులు

CI నాగరాజు అరెస్ట్ అంతా డ్రామానా? రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు అన్ని మాయం

Photos

+5

నాగదుర్గ 'ఇడుపు కాయితం' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ముంబైలో అట్టహాసంగా ' స్టైల్ ఐకాన్స్ సమ్మిట్ అవార్డ్స్ 2026' వేడుక (ఫొటోలు)

+5

షూటింగ్‌లకు బ్రేక్.. నేపాల్‌ప్రకృతి ఒడిలో మీనాక్షి చౌదరి (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో నాని (ఫొటోలు)

+5

39 సెకన్ల తేడాతో.. వెనెజువెలాలో మహా విధ్వంసం! (ఫొటోలు)

+5

హైదరాబాద్ : మాయజేసినట్టే.. వాన కొట్టే.. (ఫొటోలు)

+5

‘సూపర్‌ సుబ్బు’ సిరీస్‌ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సమంత ‘మా ఇంటి బంగారం’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

పులివెందులలో రెండో రోజు వైఎస్‌ జగన్‌ పర్యటన (ఫొటోలు)

+5

ముద్దుల కూతురితో బిగ్‌బాస్ శివజ్యోతి (ఫొటోలు)