Breaking News

బిడ్డకు తల్లయినా అంతే గ్లామర్‌గా ఆలియా! ఆమె ఫిట్‌నెస్‌ సీక్రెట్‌ ఇదే..!

Published on Sun, 08/04/2024 - 12:20

బాలీవుడ్‌ నటి ఆలియా భట్‌ ఎంత గ్లామరస్‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల ఒక బిడ్డకు జన్మనిచ్చాక కూడా అంతే అందం, పిట్‌నెస్‌తో తీగలా ఉంది. ఆమె తన అందం, నటనతో వేలాదిమంది అభిమానులను సంపాదించుకుంది. నిజానికి అమ్మగా మారే తరుణంలో స్త్రీ శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో అందరికీ తెలిసిందే. అంత ఈజీగా సాధారణ స్థితికి రావడం కుదరదు. అలాంటిది ఆలియా మాత్రం అంతకుముందు ఎలా ఉందో అలానే ఉండటమే గాక మరింత అందంగా కనిపించి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇంతకీ ఆమె అంతలా బాడీ ఫిట్‌గా ఉండేందుకు ఏం చేస్తుందంటే..

ఆలియా శరీరం ఆకట్టుకునేలా ఉండేందుకు ర్డియో, స్ట్రెంగ్త్ ట్రైనింగ్, యోగా, పైలేట్స్ వంటి వర్కౌట్స్‌ చేస్తుంది. అలియా తన ఫిట్‌నెస్‌ రొటీన్లో కార్డియో కచ్చితంగా ఉంటుంది. ఈ వర్కౌట్‌తోనే ఆరునెల్లలోనే తన తొలి చిత్రం "స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్" కోసం ఏకంగా 20 కిలోలు తగ్గింది. అప్పటి నుంచే హృదయ ఆరోగ్యానికి ప్రాముఖ్యతనిచ్చేలా బరువు తగ్గించే ఈ కార్డియో వ్యాయామానికి ప్రాధాన్యత ఇస్తుంది. ప్రతి ఒక్కరూ తమ దినచర్యలో భాగంగా కనీసం 30 నిమిషాలు చేయగలిగితే ఫిట్‌గానే గాక ఆరోగ్యంగా ఉండగలుగుతారు. 

స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అనేది ఆలియా వర్కౌట్ రొటీన్‌లో మరొక అంశం. ఇటీవల, ఆమె ఒక బార్‌బెల్‌తో బరువున్న హిప్ థ్రస్ట్‌లను ప్రదర్శించే వీడియోను షేర్ చేసింది. ఇది మన శరీరాకృతిని అందంగా కనిపించేలా చేసే మంచి వ్యాయామం. పైగా ఇది కండరాలు, వీపుకి సంబంధించిన సమస్యల నుంచి బయటపడేలా చేస్తుంది.

అలాగే ఆలియా ఫిట్‌నెస్‌లో పైలేట్స్ ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది మొత్తం శరీర అమరిక, కండరాల స్థాయిని మెరుగుపరచడానికి పైలేట్స్ ఒక అద్భుతమైన మార్గం.

మన మనస్సు, శరీరాన్ని అనుసంధానించడానికి యోగా చక్కగా పనిచేస్తుంది. ఇది శారీరక ఆరోగ్యం తోపాటు మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తుంది. ఇది విశ్రాంతిని, ఒత్తిడిని అందించి ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది. ఇక్కడ ఆలియా చేసే వ్యాయామాలన్ని దైనందిన జీవితానికి అవసరమయ్యే రిలాక్సేషన్‌ టెక్నీక్‌లను ఏకీకృతం చేసేవే గాక, మొత్తం ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచడంలో సహాయపడతాయి.

ఇవన్నీ పాటించాలంటే..

  • ఆలియా భట్ మాదిరిగానే ఫిట్‌నెస్ స్థాయిని సాధించడానికి, స్థిరత్వం, వైవిధ్యం కీలకం. 

  • మన దినచర్యను సమతుల్యంగా, ఆసక్తికరంగా ఉంచడానికి కార్డియో, స్ట్రెంగ్త్ ట్రైనింగ్, ఫ్లెక్సిబిలిటీ  వంటి వ్యాయామాలు చేయాలి. 

  • అనింటి కంటే ముఖ్యం క్రమం తప్పకుండా చేయడం. 

  • అలాగే వారానికి కనీసం 150 నిమిషాల ఏరోబిక్ యాక్టివిటీ లేదా 75 నిమిషాల తీవ్రమైన యాక్టివిటీని లక్ష్యంగా పెట్టుకోవాలి.

  • శరీరం సంకేతాలపై శ్రద్ధ వహించి, అధిక శ్రమను నివారించండి.

 

 (చదవండి: అమెరికన్‌ గాయకుడికి టైప్ 1.5 డయాబెటీస్: ఎలా గుర్తిస్తారంటే..?)

 

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)