Breaking News

డిప్రెషన్‌తో పోరాడుతూనే.. ఐఏఎస్‌ సాధించిన అలంకృత!

Published on Thu, 12/12/2024 - 12:37

ఐఏఎస్‌ సాధించటం చాలామంది యువత కల. అయితే కొందరు మాత్రమే ఆర్థికంగా, వ్యక్తిగతంగా.. ఎదరయ్యే సవాళ్లను అధిగమించి విజయం సాధించగలుగుతారు. అలాంటి కోవకు చెందిందే అలంకృత. డిప్రెషన్‌ అనేది ఎంత భయానక మానసిక వ్యాధి అనేది తెలిసిందే. దీన్ని అధిగమించడం అంత సులభం కాదు. అలాంటి సమస్యతో పోరాడుతూనే క్లిష్టతరమైన సివిల్స్‌ పరీక్షలో మంచి ర్యాంకు సాధించి ఐఏఎస్‌ అధికారి అయ్యింది. ఈ క్రమంలో ఆమె చేసిన అలుపెరగని పోరాటం అసామాన్యమైనది. వ్యక్తిగతంగా క్షోభను అనుభవిస్తూనే..తొలి ప్రయత్నంలోనే సివిల్స్‌లో విజయం సాధించి అందర్నీ విస్తుపోయేలా చేసింది. 

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కి చెందిన అలంకృత పాండే ఎంఎన్‌ఎన్‌ఐటీ అలహాబాద్‌ నుంచి ఇంజనీరింగ్‌ చేసింది. ఆ తర్వాత కొంతకాలం బెంగళూరులోని ఐటీ కంపెనీలో  పనిచేసింది కూడా. ఇంకా ఏదో సాధించాల్సింది మిగిలిపోయిందన్న ఫీల్‌తో 2014లో ప్రతిష్టాత్మకమైన సివిల్స్‌ పరీక్షకు సన్నద్ధం కావాలనుకుంది. అయితే ఆ ఏడాదే ఆమె తీవ్రమైన డిప్రెషన్‌తో మనో వ్యధను అనుభవించింది. 

తన స్నేహితులు, కుటుంబసభ్యుల మద్దతతుతో అధిగమించే యత్నం చేసింది. అయితే తీవ్రమైన డిప్రెషన్‌ ప్రభావంతో..ఆ ఏడాది ఫ్రిలిమ్స్‌కు హాజరు కావడం కూడా మానుకోక తప్పలేదు. అయినప్పటికీ అలంకృత అంతు చూసేంత వరకు తగ్గేదే లే..అంటూ వెనుకడుగు వేయలేదు.  ప్రతిరోజూ ఎనిమిది గంటల పాటు ప్రిపరేషన్‌ సాగించేలా ప్రణాళిక వేసుకుని మరీ కష్టపడి చదివేది. సరిగ్గా 2015లో ఆమె కష్టానికి ఫలితం దక్కింది. 

ఆ ఏడాది మొదటి ప్రయత్నంలోనే సివిల్స్‌ మంచి ర్యాంకు సాధించి ఐఏఎస్‌ అయ్యింది. తొలి పోస్టింగ్‌ పశ్చిమబెంగాల్ కేడర్‌ కేటాయించడంతో అక్కడ నుంచి ఐఎఏస్‌గా బాధ్యతలు చేపట్టింది. ఆ తర్వాత తన తోటి ఐఏఎస్‌ అధికారి అన్షుల్‌ అగర్వాల్‌ని వివాహం చేసుకుంది. ప్రస్తుతం ఆమె బీహార్‌లో ఐఏఎస్‌గా విధుల నిర్వర్తిస్తోంది. 

ఇక్కడ అలంకృత డిప్రెషన్‌పై సడలని అలుపెరగని పోరాడటమే ఐఏఎస్‌ సాధించేలా చేసింది. సడలని స్థిరమైన స్థైర్యంతో కష్టతరమైన సవాళ్లను అధిగమించి అద్భుతాలను సృష్టించొచ్చని చూపించి..ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది. సాధించాలన్న దృఢ సంకల్పం ముందు ఎంతటి అనారోగ్య సమస్య అయినా కతం కావాల్సిందే కదూ..!.

(చదవండి: బెట్టింగ్‌ పిచ్చి తగ్గేదెలా?)
 

Videos

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)