Breaking News

సాంగ్లీ నుంచి స్టాన్‌ఫోర్డ్‌ వరకు.. పేద ఇంటి బిడ్డ సక్సెస్‌ స్టోరీ

Published on Wed, 11/06/2024 - 10:16

‘పెద్ద చదువులు చదవాలి’ అనేది పేదింటి అమ్మాయి ఆక్సా కోరిక. అయితే అదంత తేలికైన విషయం కాదని ఆమెకు అర్థం అయింది. దారి పొడగునా ఎన్నో అడ్డంకులు ఎదుర్కొంది. అయినా సరే ఆమె ప్రయాణం ఆగలేదు. ‘పెద్ద చదువులు చదవడానికి పేదరికం అడ్డు కాదు’ అని నిరూపించి ఎంతో మంది అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలుస్తోంది అక్సా పులారా. టెక్‌ దిగ్గజం గూగుల్‌లో ఇన్నోవేషన్‌  ప్రాజెక్ట్‌లలో కీలక బాధ్యతలు చూస్తోంది. 

మహారాష్ట్రలోని సాంగ్లీలో పుట్టిన ఆక్సా పులారా ‘వాల్చంద్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌’ నుండి బ్యాచిలర్‌ డిగ్రీ చేసింది. ‘చదివింది చాలు’ అన్నారు ఇంటి పెద్దలు. ఉన్నత చదువులు చదవాలనేది అక్సా లక్ష్యం.

‘నేను ఇంకా చదువుకోవాలనుకుంటున్నాను’ అంటే ససేమిరా అన్నారు.అదేపనిగా అడిగితే పెద్దల మనసు కరిగింది. ‘సరేలే. చదువుకో’ అన్నారు. ఆరోజు తనకు ఎంత సంతోషమైందో!

‘యస్‌...నేను సాధించగలను’ అనే గట్టి నమ్మకం వచ్చింది. ఆ నమ్మకమే అక్సాకు ఎంతో శక్తిని ఇచ్చింది. ఆ శక్తే తనను అమెరికా వరకు తీసుకెళ్లింది. అమెరికాలో చదువుకుంటున్న వారి గురించి వినడమే కాని తాను కూడా చదువు కోసం అక్కడికి వెళతానని కలలో కూడా అనుకోలేదు. సదరన్‌ కాలిఫోర్నియా యూనివర్శిటీలో చేరింది. ఆ తరువాత స్టాన్‌ఫర్డ్‌ యూనివర్శిటీలో కొంతకాలం పనిచేసింది. అక్కడ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, మెషిన్‌ లెర్నింగ్‌(యంఎల్‌)తో సహా అత్యాధునిక సాంకేతికతలో నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుంది. (రోజుకు నాలుగు గంటలే పని, నెల ఆదాయం 15 లక్షలకు పై మాటే!)

ఆ తరువాత గూగుల్‌లో చేరింది. అక్కడ ఏఐ, మెషిన్‌ లెర్నింగ్‌ ఇన్నోవేషన్‌లకు సంబంధించిన ప్రాజెక్ట్‌లను లీడ్‌ చేస్తోంది. కాలేజీ, యూనివర్శిటీ రోజుల్లో గూగుల్‌లో ఆవిష్కరణల గురించి ఆసక్తిగా తెలుసుకునేది. ఇప్పుడు ఆ ఆవిష్కరణలలో తాను కూడా భాగం అయింది. అక్సాకు మొదటి నుంచి టెక్నాలజీ అంటే ఇష్టం. ముఖ్యంగా కట్టింగ్‌–ఎడ్జ్‌ టెక్నాలజీగా చెప్పే ఏఐ, ఎంఎల్‌లో ప్రతి చిన్న విషయం తెలుసుకునే ప్రయత్నం చేసేది. నిజజీవితంలో మనం ఎదుర్కొనే ట్రాఫిక్‌జామ్‌లాంటి సమస్యలకు ఏఐ, ఎంఐ సాంకేతికత పరిష్కారం చూపుతుందని అంటుంది ఆక్సా పులారా.

గూగుల్‌లో చేరిన తరువాత ఆ సంస్థ ఏఐ అండ్‌ ఎంఎల్‌ డెవలప్‌మెంట్స్‌లో ప్రధానపాత్ర పోషిస్తోంది. టీమ్‌ వర్క్‌స్పేసెస్, లుకర్‌ స్టూడియో  ప్రో మొదలైన ఇన్నోవేటివ్‌ గూగుల్‌  ప్రొడక్ట్స్‌లో తన వంతు పాత్ర నిర్వహించింది. మనలో సామర్థ్యం ఉండగానే సరి΄ోదు. ఆ సామర్థ్యానికి తగిన వేదిక కూడా దొరకాలి. గూగుల్‌ రూపంలో ఆమెకు సరైన వేదిక దొరికింది.

‘గూగుల్‌లో కనిపించే కల్చరల్‌ ఆఫ్‌ ఇన్నోవేషన్‌ ప్రభావంతో పరిశోధనలపై ఆసక్తి పెరిగింది. సంక్లిష్టమై సమస్యలకు పరిష్కారం కనుక్కోవాలనే కుతూహలం నన్ను ముందుకు నడిపించింది’ అంటుంది అక్సా పులారా. ఆమె పట్టుదల, ఉత్సాహం చూస్తుంటే ఎన్నో ఆవిష్కరణలలో కీలకపాత్ర పోషించబోతుందని గట్టిగా చెప్పవచ్చు. 

 

Videos

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)